60 ఏళ్ల స్వతంత్రం ఇక్కడికి తెచ్చింది మనల్ని

h1pa.gif

పోలీసులకు అవసరానికి మించి అధికారాలిస్తే పరిణామాలు ఎలా వుంటాయో స్పష్టంగా చెప్పిన ఉదాహరణ ఇది. మనది ప్రజాస్వామ్యమేనా అని ఒక సారి ప్రశ్నించుకోవలసిన పరిస్థితి కలుగజేసింది నిన్న జరిగిన ఒక సంఘటన. తమ హక్కుల కొరకు ఉద్యమిస్తున్న ఎం పీ టీ సీ ల ధర్నా వద్ద పోలిసులు ప్రదర్శించిన ఈ బ్యానర్ రాను రాను మన దగ్గర ఒక పోలిసు రాజ్యం ఏర్పడుతోందని ఎంతోకాలంగా హక్కుల సంఘాల వాళ్లు చెప్తున్న విషయం నిజమేనని చెబుతోంది.

ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజాప్రతినిధులకే ఇంత కటువుగా హెచ్చరికలు జారి చేసే దశకు పోలిసులు వచ్చారంటే దానికి కారణం చంద్రబాబు, వై ఎస్ లు ఇద్దరూ పోలిసులను ఉపయోగించి రాష్ట్రాన్ని పరిపాలించడమే. తాముచేసే పనులకు ఎటువంటి జవాబుదారీతనం లేని దశకు పోలిసు శాఖ చేరుకోవడానికి వరుస ముఖ్యమంత్రులు ఇచ్చిన అపరిమిత అధికారాలే కారణం. మన బాబైతే కలెక్టర్ల కన్న ఎస్పీల తోనే ఎక్కువ సంభాషించే వాడని ప్రతీతి. ఇక సేన్ వంటి నేరచరితులను డీజీపీలు గా నియమించి వై ఎస్ కూడ అదే బాట పట్టాడు.

ఆందోళన చేస్తేనే కాల్చేస్తామంటున్న హైదరాబాద్ పోలిసులను చూస్తే అసలు మనం వుంటున్నది స్వతంత్ర భారతావని లోనేనా లేక బ్రిటీషు వలస పాలనలోనా అని అనుమానం వస్తున్నది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: