తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా కలాం?

kalam.JPG

ఈ మెయిల్ చెక్ చేసుకుందామని యాహూ కి వెళ్తే చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా కలాం గారు ఈ ప్రశ్న అడిగారు నన్ను ‘ భూగోళం పై టెర్రరిజం లేకుండా చెయ్యాలంటే ఏం చెయాలి ‘

నాకు నవ్వొచ్చింది.

ఏమిటి కలామూ ఈ సత్తె కాలపు ప్రశ్నలు? అని తిరిగి అనాలనిపించింది.

కాని ప్రశ్నకు ప్రశ్నతో జవాబివ్వడం సరికాదని ఇదో ఇలా జవాబిస్తున్నా…

ప్రపంచం లో 90% (ఇంకా ఎక్కువైనా కావచ్చు) టెర్రరిజం అమెరికా వల్లనే ఉత్పన్నం అవుతుంది. గత వందేళ్లలో జరిగిన అతిపెద్ద టెర్రరిస్టు ఘటనలు అన్నీ ఆ దేశం చేసినవో లేదా ఆ దేశం ప్రొద్బలంతో జరిగినవో. కాబట్టి ఆ దేశానికి ముకుతాడు వేస్తే సమస్య చాల వరకు సాల్వ్ అయినట్టే. ఎలా వేయాలంటారా? చాలా సింపుల్ మన లాంటి దేశాలు కొంచెం వెన్నెముకను వాడటం నేర్చుకోవాలంతే. ఏంటింత సింపులా అనకండి, ఎన్నో చిన్న దేశాలు ప్రత్యామ్న్యాయం చూపిస్తున్నాయి, చూసే ఓపికా, పాటించే దమ్మూ మనకుండాలి కానీ…

ఇక మిగతా 10% (అంతకన్న తక్కువ) టెర్రరిజానికి కారణం ఆకలి, అసమానత, ప్రాంతీయ విభేదాలు, మతతత్వం (దాదాపు అదే ప్రయార్టీలో) ఇందులో మొదటి రెండిట్నీ రూపుమాపడం చాల తేలిక. పాలకులకు చిత్తశుద్ది వుండాలంతే. చివరి రెండు మొండిఘటాలు. కొంచెం టైము, కొంచెం త్యాగం, కొంచెం ఓపిక కావాలి వీటి భరతం పట్టడానికి.

అయినా అన్నీ తెలిసిన జ్ఞానులు, ఇలా ప్రైవేటు కంపెనీల అడ్వర్టైస్మెంట్ వ్యూహాల్లో తలదూర్చటం ఎందుకు? సిల్లీ ప్రశ్నలు వెయ్యటం ఎందుకు కలామూ? డబ్బులు పుచ్చుకొని ఆ పని చెయ్యడనికి బోలెడు మంది పనీపాటా లేని క్రికెటర్లు, సినిమా యాక్టర్లూ ఉండగా…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: