మెకాలే పుత్రుల శకం!

బీబీసీ లో భారత్ – బ్రిటన్ సంబంధాల గురించి ఒక వార్త చదువుతుంటే అందులో మెకాలే ప్రస్తావన వచ్చింది. ఒక సారి మెకాలే మనకు వదలి వెళ్లిన వారసత్వం ఏమిటో చూద్దాం…

1832 ప్రాంతంలో బ్రిటీష్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కు సెక్రటరీ గా వచ్చిన థామస్ బేబింగ్టన్ మెకాలే మనకొక విద్యావ్యవస్థ ను, న్యాయవ్యవస్థనూ రూపొందించినవాడు. ఇప్పుడు మనం ఇంకా ఉపయోగిస్తున్న భారతీయ శిక్షాస్మృతి ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను మెకాలేనే రాశాడు.

ఇక బ్రిటీష్ వారికి గుమస్తాలను తయారుచెయ్యడానికి అతడు రూపొందించిన విద్యవ్యవస్థనే మనం ఇంకా ఉపయోగిస్తున్నాం. (మధ్యలో కొన్నాళ్లు మనవాళ్లు ఈ విద్యావ్యవస్థను మార్చాలని గొడవచేశారు, కాని ఇటీవల మనం మళ్లీ పాశ్చాత్య కంపెనీలకు హైటెక్ గుమస్తాగిరీ వెలగబెట్టడం మొదలెట్టడంతో ఇప్పుడు ఎవరూ పెద్దగా చప్పుడు చెయ్యట్లేదు.)

“మెకాలే పుత్రులు” అనే ఈసడింపు వాఖ్యానం అప్పుడప్పుడూ వినపడుతుంది. మెకాలే తన ‘Minute on Indian Education’ లో రాసిన ఈ మాటలు ఇప్పటికీ అక్షర సత్యాలే అనిపిస్తుంది.

“It is impossible for us, with our limited means, to attempt to educate the body of the people. We must at present do our best to form a class who may be interpreters between us and the millions whom we govern; a class of persons, Indian in blood and colour, but English in taste, in opinions, in morals, and in intellect”

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 94,532 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: