ప్లీజ్ ఇంకోసారి హ్యాప్పి పొంగల్ అనకండి!

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

గత పదేళ్లుగా ప్రతీ సంక్రాంతి నాడు క్రమం తప్పకుండా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు బ్లాగ్ వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

మన రాష్ట్రంలో ఎక్కడి నుండి మొదలైందో కాని గత కొన్నేళ్లుగా సంక్రాంతిని పొంగల్ అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది.

మొదట్లో వచ్చిన ఇంగ్లీషు గ్రీటింగు కార్డుల మీద హ్యాప్పి న్యూ ఇయర్ అండ్ పొంగల్ అని వుండేది. బహుశా అక్కడి నుండి మనవాళ్లు పట్టుకున్నారనుకుంటా దీన్ని.

పొంగల్ అనేది తమిళుల పండుగ. సంక్రాంతి నాడే జరుపుకుంటారు దీన్ని.

ప్లీజ్! ఇంకోసారి హ్యాప్పి పొంగల్ అనకండి…

(పొద్దున్నే వచ్చిన ఒక ఈ మెయిల్ చూశాక దీన్ని రాయాలనిపించింది)

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: