ఈ అరాచకత్వానికి అంతం ఎప్పుడు?

అడ్డూ అదుపూ లేకుండా రంకెలు వేస్తున్న అగ్రరాజ్యం తన హింసరచనను కొత్త ప్రదేశాల్లో కొనసాగిస్తున్నది. ఇరాక్ ను అగ్నిగుండంలా మార్చేసిన బుష్ ఇప్పుడు దాన్ని చల్లార్చడానికి మరో తప్పిదానికి ఒడిగడుతున్నాడు. ఓ వైపు ఇరాక్ కు ఇంకా సైనికులను పంపడమే తప్పు అని అందరూ అంటుంటే దాన్ని పెడచెవిన పెడుతూ మరో వైపు ఇరాన్ ను ఈ గొడవలోకి లాగేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు. నిన్న ఇరాక్ లోని కుర్ద్ స్వతంత్ర ప్రాంతానికి అధికార కేంద్రం గా ఉన్న ఇర్బిల్ పట్టణం లోని ఇరాన్ దౌత్య కార్యాలయం పై దాడి ఖచ్చితంగా కవ్వింపు చర్యనే.

ఒక దేశం పై దాడి చెయ్యడం, ఆ దేశ ప్రజలను, అధ్యక్షుడిని చంపివేయడమే పెద్ద నేరాలంటే ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఒక విదేశం లో ఉన్న మరో విదేశీ దౌత్య కార్యాలయం పై సైనిక దాడికి పాల్పడటం, దౌత్యాధికారులను నిర్భందించడం అన్ని అంతర్జాతీయ నియమాలకూ విరుద్ధం.

ఈ దాడి జరిగిన సమయంలో అక్కడి స్థానిక కుర్ద్ ప్రభుత్వ సేనలు అమెరికన్ సైనికులను అడ్డుకున్నాయని, తమ అనుమతి లేనిదే ముందుకు వెళ్లరాదని హెచ్చరించాయని వెలువడుతున్న వార్తలు, అమెరికన్ల ఆగడాలని బట్టబయలు చేస్తున్నాయి. ఏ ఇరాకీల కోసం యుద్ధం చేస్తున్నానని అమెరికా చెప్పుకుంటుందో ఆ ఇరాకీలే ఇవ్వాళ మా దేశానికొచ్చి మాకే చెప్పకుండా ఒక మిత్ర దేశం (!) దౌత్య కార్యాలయం పై దాడి చెయ్యడం అక్రమం అని అంటున్నారు.

ఇక అల్ ఖైదా సాకు చూపిస్తూ సొమాలియా పై దాడి చెయ్యడం ద్వారా అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి అమెరికా దాదాగిరీ ప్రదర్శిస్తోంది. స్వేచ్చ, సమానత్వం, ప్రజాస్వామ్యం అని చిలక పలుకులు వల్లె వేస్తూ ప్రపంచవ్యాప్తంగా నిర్భంధాన్ని, అసమానతను, నియంతృత్వాన్ని పోషిస్తోంది. సోమాలియాలోనూ చమురు నిక్షేపాలు వుండటం అమెరికా తాజా వైఖరి పై అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటికే ఇరాక్ యుద్ధం పై 400 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయని అంచనాలు అందుతున్నయి. అంటే 40000 కోట్ల డాలర్లు. ఇందులో సగం మొత్తాన్ని వాడి ప్రపంచంలోని పేదరికాన్ని రూపుమాపవచ్చనుకుంటా. అప్పుడు తీవ్రవాదం దానంతట అదే సమసిపోతుంది. యుద్ధాలు ఎప్పుడూ హింసను తగ్గించవనే చారిత్రక సత్యం తెలిసినా తన వాణిజ్య కాంక్షలను తీర్చుకోవడానికి అమెరికా ఈ దురంతాలకు పాల్పడుతోంది.

ఎవరో అన్నట్టు మరో వియత్నాం లా మారుతున్న ఇరాక్ యుద్ధం అమెరికా అంతానికి ఆరంభం అయ్యే అవకాశం వుంది.

అది తొందరగా జరిగితే ఎంత బాగుండు.

Read this nice quote I found somewhere…

Jonathan Freedland

“You don’t catch the terrorist fish by machine-gunning them from the sky, but by draining the sea of grievance in which they swim. That work will be long and slow and require enormous political brainpower. And it is the polar opposite of everything George Bush stands for.”

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: