కాంగ్రెస్ కొత్త కపట నాటకం

తెలంగాణా సమస్య ను పరిష్కరించడానికంటూ కాంగ్రెస్ ఎత్తుకున్న రెండో ఎస్సార్సీ పల్లవి అత్యంత దుర్మార్గమైనది, మోసపూరితమైనది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చక ముందే తెలంగాణవాదులంతా మేల్కోవాలి.

మొదటి ఎస్సార్సీ విస్పష్టంగా తెలంగాణ ఏర్పాటును సిఫారసు చేసాక ఇంకోసారి ఆ ప్రహసనానికి తెర తీయడం అనవసరం. తెలంగాణ అంత ఉధృతంగా సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొత్తం దేశంలోనే ఇంకొకటి లేదు. ఒకటి రెండు ప్రతేక వాదనలు కొంచెం చెప్పుకోదగిన స్థాయిలో వున్నప్పటికీ, వాటికి తెలంగాణ ఉద్యమానికి వున్నంత చరిత్ర కాని, ప్రజామోదం కాని లేవు.

ఆయినా స్వాతంత్రం వచ్చాక ఎన్నో రాష్ట్రాలను ఎస్సార్సీ ఆమోదం లేకుండానే ఇచ్చి (1956 లో ఆంధ్రప్రదేశ్ నుండి మొన్నటి జార్ఖండ్, చత్తీస్ గడ్, ఉత్తరాంచల్ వరకూ ఎస్సార్సీ నివేదికతో పనిలేకుండానే ఏర్పాటయ్యయి.) ఇప్పుడు తెలంగాణ దగ్గరికికొచ్చే సరికి ఒకదాని తరువాత ఒక మెలిక పెట్టడం, తెలంగాణవాదుల సహనాన్ని పరీక్షించడమే.

తెలంగాణా ప్రజలు గత అయిదు దశాబ్దాలుగా ఎన్నోసార్లు తమకు ప్రతేక రాష్ట్రం కావాలని చెప్పారు. మొన్నటికి మొన్న కరీం నగర్ ఉప ఎన్నికల్లో వారు విస్పష్టంగా తెలంగాణ రాష్ట్రం కొరకు తమ ఆమోదాన్ని తెలిపారు. కాంగ్రెస్ నాయకులేమో ఇంకా వారి అనుమతి కావాలి, వీరి అనుమతి కావాలి అంటూ నాటకాలు ఆడుతున్నారు.

రెండో ఎస్సార్సీ అనే ఈ కాంగ్రెస్ ఎత్తుగడ చాలా ప్రమాదకరమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే దురుద్దేశంతో ఇప్పటికే రాష్ట్రం లో అనేక ప్రత్యేక వాదనలు ముందుకు తెచ్చి ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఇక ఎస్సార్సీ అంటే దేశవ్యాప్తంగా వున్నవీ లేనివీ అన్ని కలిపి ఒక వంద రాష్ట్రాలకు డిమాండ్ వుంది అని సాకు చూపించొచ్చు. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం చేసేందుకే కాంగ్రెస్ ఈ కుట్రపూరిత ఎత్తుగడను ఎంచుకుంది.

తెలంగాణవాదులంతా అప్రమత్తమై దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం వుంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

ట్విట్టర్ పై తెలంగాణ

a

గణాంకాలు

  • 92,111 సందర్శకులు

%d bloggers like this: