లొంగని వీరునికి సలాం!

సద్దాం హుస్సేన్ దారుణ హత్యకు నిరసనగా తెలుగు కవులు, కళాకారులు, జర్నలిస్టులు కలిసి 3 జనవరి నాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ హాల్లో ఒక సభ నిర్వహించారు. అనేక మంది ప్రముఖులు ఈ సభ కు హాజరయ్యి అమెరికా హంతక చర్యను ఖండించారు.

సభకు ప్రముఖ కవి శివారెడ్డి అధ్యక్షత వహించారు. సద్దాం హత్యకు సంతాపసూచకంగా ఒక నిముషం మౌనం పాటించడంతో సభ ప్రారంభం అయ్యింది.

మొదట సంధ్యక్క బృందం ‘మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది’ అనే ఉద్వేగభరితమైన పాట పాడారు.

శివారెడ్డి సభను ప్రారంభిస్తూ ఈ దుశ్చర్యను ఖండించడంలో భారత ప్రభుత్వం చూపిస్తున్న చేతగానితనాన్ని తీవ్రంగా విమర్శించారు.

అధికార భాష సంఘం అధ్యక్షుడు ఏ. బి. కే ప్రసాద్ మాట్లాడుతూ అసలు ఇరాక్ యుద్ధంలో మొదటి నుంచి అమెరికా ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తొందో వివరించారు. జార్జ్ బుష్ తాత అయిన ప్రెస్కాట్ బుష్ కు నాజీలతో సంబంధాలు వున్నాయని ఇటివలనే వెల్లడైందని, వీళ్లు డబ్బుల కొరకు ఏ దుర్మార్గానికైన ఒడిగట్టే కిరాతకులని అన్నారు.

విప్లవ కవి వరవర రావు ‘సద్దాం చనిపోయిన క్షణం ఒక సుడిగాలి జార్జ్ బుష్ ను కలవరపెట్టిన వార్త ను ఉటంకించారు. అతడి మరణం కూడ సామ్రాజ్యవాదులను వణికించింది అన్నారు. సద్దాం కు అంజలి ఘటిస్తూ ఒక కవితను చదివి వినిపించారు.

ఫ్రముఖ పాటల రచయిత, గాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ ‘వీరులు ఉరికొయ్య ను ఎలా ముద్దాడుతారో సద్దామును చూస్తే తెలిసిందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం పై ఒక మంచి పాటను పాడారాయన.

స్కై బాబ సద్దాం పై రాసిన ‘లొంగని వీరునికి సలాం’ అనే గొప్ప కవితను చదివి వినిపించాడు.

షాజహాన, జూపాక సుభధ్ర, హెచ్చర్కే కూడ సద్దామును అన్యాయంగా ఉరి తీయడాన్ని ఆక్షేపిస్తూ కవితలు చదివారు.

ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ సద్దాం మరణం ప్రపంచాన్ని ఒక కొత్త కోణం నుంచి చూసేటట్టు చెయ్యగలదేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని అన్నారు. ఇవ్వాళ అంతా అమెరికా కళ్లతో ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకునారని అంటూ దీనికి ఉదాహరణగా మన పేపర్లలో మధ్య ప్రాచ్యం అని రాస్తున్న ప్రాంతం నిజానికి మనకు తూర్పు ఆసియా అని వివరించారు. సద్దాం వ్యక్తిగత నర్సు చెప్పిన విషయాలని ఉటంకిస్తూ తనకు పెట్టిన ఆహారంలోంచి కొంత భాగాన్ని దాచి వుంచి పావురాలకు పెట్టడం ద్వార సద్దంలో ఒక శాంతి కాముకుడు, జైల్లో ఖాళీ సమయాల్లో మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా సద్దాంలో ఒక రైతు హృదయం వున్నాయని అన్నారు. మొక్కవోని జాతీయ భావాలకు, సామ్రజ్యవాద వ్యతిరేకతకు అతడు ప్రతీక అని, అతడు మరణించినా అనేక మందికి ప్రేరణగా నిలుస్తాడని అన్నారు.

పౌర హక్కుల నేత ప్రొ. హరగోపాల్ అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుర్మార్గ స్వభావాన్ని సోదాహరణంగా వివరించారు. సద్దాం ను చంపివేసి దాన్ని సున్ని, షియాల మధ్య మత ఘర్షణలు పెంచడానికి అమెరికా కుట్ర చేస్తోందని అన్నారు.

మరో పౌర హక్కుల నేత రత్నమాల మాట్లాడుతూ సద్దాం మరణం ఒక లాగ ఉదారవాదుల, ప్రగతిశీల శక్తుల వైఫల్యమేనని అన్నారు.

సభలో ఇంకా లోకేశ్వర్, సంగిసెట్టి స్రినివాస్, తెలకపల్లి రవి, శ్రీధర్ దేశ్ పాండే, జి.ఎస్.రాం మోహన్, రాంకి, చిక్కుడు ప్రభాకర్, అరుణోదయ రామారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: