1) ప్రస్తుత ముఖచిత్రం – మోదుగు పూలు
వేసవి వచ్చిందంటే చాలు మా ఊరికి నలువైపులా పరుచుకున్న మోదుగు పూలు కనువిందు చేస్తాయి. అసలు మోతుకూరు (మోదుగూరు) అనే పేరు మోదుగు చెట్ల నుండే వచ్చిందని నాకెప్పుడూ అనిపిస్తుంది.
మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కల్పవృక్షాల్లో మోదుగు చెట్టును ప్రముఖంగా చెప్పుకోవాలి. మోదుగు చెట్ల ఆకులతో విస్తరాకులు కుడతారు. దాని కాండం నుండి స్రవించే జిగురును వివిధ ఉత్పత్తుల్లో, తోలుశుద్ధికీ వాడతారు. మోదుగు పూలనుండి సహజసిద్ధమైన రంగును తయారు చేస్తారు. వేళ్ల నుండి వచ్చే నారతో తాళ్లు పేనుతారు.
ఇంగ్లీషులో మోదుగు చెట్టును Flame of the Forest అని అంటారు.
2) నవంబర్ 2008 ముఖచిత్రం – పోలేపల్లి చిన్నారులు
మధ్యాహ్న భోజనం కొరకు వరుసలో నిలబడ్డ పోలేపల్లి సెజ్ బాధిత రైతుల పిల్లలు వీళ్లు.
దళిత, గిరిజన రైతుల నుండి కారుచౌకగా 1000 ఎకరాల భూమిని లాక్కుని అదే భూమిని లక్షల రూపాయలకు అమ్ముకుని సొమ్ముచేసుకున్న మన రాష్ట్రప్రభుత్వ నిర్వాకానికి రోడ్డునపడ్డ చిన్నారులు వీళ్లు. పోలేపల్లి సెజ్ బాధిత రైతుల పోరాటంపై పూర్తి వివరాల కొరకు: http://polepally.wordpress.com చూడండి.
3) 2008 జనవరి ముఖచిత్రం – బ్రతుకమ్మ పండుగ
ప్రకృతితో మనిషికి గల అనుబంధాన్ని ఆవిష్కరించే అతి కొద్ది పండుగల్లో బతుకమ్మ ఒకటి. దసరా పండుగకు రెండు రోజుల ముందొచ్చే ఈ పండుగ తెలంగాణా వాసులకు అతి ప్రీతిపాత్రమైనది. ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు బతుకమ్మ పాటల రూపంలో వెల్లడవుతుంటాయి.
4) 2007 ముఖచిత్రం – తంగేడు పువ్వులు
తంగేడు పువ్వులు – దక్షిణ భారత దేశమంతటా కనిపించే తంగేడు చెట్టుకు [Cassia Auriculata] తెలంగాణా ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దసరాకు ముందొచ్చే బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వులను ఎక్కువగా వాడుతారు. తంగేడు చెట్టులో ఇతర భాగాలు కూడా ఎంతో ఉపయోగపడుతాయి. తంగేడు పుల్లలు పళ్లు తోముకోవడానికి, ఆకులు పచ్చి రొట్ట ఎరువుగా, కొమ్మలు వంట చెరకుగా ఉపయోగిస్తారు. ఈ బెరడును తోళ్ల శుద్ధి పరిశ్రమలో విస్తృతంగా వాడుతారు. అంతే కాదు ఆయుర్వేదంలో ఈ చెట్టు వేర్లతో, ఆకులతో ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తారు.










తెలాంగాణ పోరాటం గురించి తెలియచేస్తున్నందుకు చాల సంతోషం,కానిభారత సైనికులు ముస్లిములను ఊచకోత కోషారని వ్రాశారు.నిజమా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా?ఏమైనా పేపర్ క్లిప్పింగ్స్ ఉంటే చెప్పండి.నాకు చాలా అవసరం
-మనోహర్,
-manoharmane1969@yahoo.com
మనోహర్ గారూ,
ఆపరేషన్ పోలో సందర్భంగా చనిపోయిన ముస్లిముల సంఖ్య గురించి చాలా వివాదం ఉంది. ఈ సంఖ్య 50,000 వరకూ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. పోలీస్ ఆక్షన్ అనంతరం భారత సైన్యం ముస్లిములపై జరిపిన అత్యాచారాల సంగతి తెలుసుకున్న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ హింసపై ఒక విచారణ కమీషన్ వేశాడు.
ఆ రిపోర్టు మొత్తం ఎప్పటికీ వెలుగు చూడకపోయినా ఇటీవల అందులోంచి కొన్ని భాగాలను ఫ్రంట్ లైన్ పత్రిక ప్రచురించింది. అవి ఇక్కడ చదవచ్చు:
http://www.hinduonnet.com/fline/fl1805/18051140.htm
దిలీప్ గారికి నమస్కారములు!
మీరు పంపించిన సుందర్లాల్ రిపోర్ట్ వలన నాకొక డౌట్ క్లియర్ అయ్యింది. చాలా సంతోషం. నేను బ్లాగీంగ్ కు కొత్తవాన్ని. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.తిరిగి త్వరలో కలుస్తాను.
- మనోహర్.
manoharmane1969@yahoo.com
మనోహర్ గారూ,
చాలా సంతోషం. తప్పకుండా కలుద్దాం.
నా ఈ మెయిల్ ఐడి: konatham.dileep(AT)gmail.com
దిలీప్
ప్రతి చిత్రం వెనుకా ఒక చరిత్ర అంటే ఇదేనేమో!బాగుంది.
దిలీప్ గారు, మీకు అభ్యంతరం వుండబోదన్న అభిప్రాయంతో, మీ http://hridayam.wordpress.com/cover-page/ టపాని మరొక బ్లాగులో నా వ్యాఖ్యలో ఉదహరించాను [Refer http://himabinduvulu.blogspot.com/2009/06/blog-post.html#comments
ఉష గారూ,
అభ్యంతరం ఎంత మాత్రమూ లేదు
కొణతం దిలీప్