ఏమీ చేయలేరని ఎగిరిపడకు నేస్తం

I may disapprove of what you say, but I will defend to the death your right to say it – Voltaire

తెలుగు బ్లాగుల్లో వివాదాలు కొత్తకాదు. అవి ఉండకూడదనీ కాదు. కానీ ఇటీవల కొందరు బ్లాగర్ల ప్రవర్తన గమనించిన తరువాత ఈ రెండు ముక్కలు రాయాలనిపించింది.

సహజంగానే కులం, వర్గం, ప్రాంతం, మతం వంటి విషయాల గురించి చర్చలు చాలా త్వరగా వేడెక్కిపోతాయి. ఇటువంటి చర్చలు పరస్పర దూషణల దాకా వెళ్లడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైంది. ముఖాముఖి జరిగే చర్చల్లో కన్నా ఇంటర్నెట్ లో మనుషులను అపార్ధం చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి అపార్ధాలే చివరికి చిలికిచిలికి గాలివానలు అవుతున్నాయి.

కత్తి మహేశ్ కుమార్ పై ఇటీవల ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేసిన భాస్కర్ రామరాజు అనే వ్యక్తి చాలా విద్యాధికుడు. మంచి బ్లాగులు రాస్తాడు. మహేశ్ రాసిన విషయాలపై ఆయనకు అభ్యంతరం ఉంటే దాన్ని వ్యాఖ్యల ద్వారా, బ్లాగ్ పోస్టుల ద్వారా వ్యతిరేకించే స్వేచ్చ రామరాజు గారికి ఉంది. ఒకవేళ మహేశ్ ఏదైనా అభ్యంతరకరమైన రాతలురాస్తే అతనిపై చట్టపరంగా చర్య తీసుకునే అవకాశమూ ఉంది.

కానీ రామరాజు గారు చేసిందేమిటి?

మహేశ్ పై వ్యక్తిగత ద్వేషం పెంచుకుని అతన్ని దళితుడని కులంపేరుతో హేళన చేయడం అమానుషం.

రామరాజు చేసిన పనిని ఖండించకుండా మహేశ్ పై విరుచుకుపడుతున్న బ్లాగు మిత్రులు ఒక విషయం పూర్తిగా మర్చిపోయినట్టు కనపడుతుంది.

రామరాజు కేవలం మహేశ్ పై అవమానకర వ్యాఖ్య చేసి ఊరుకోలేదు. అతను వేరే బ్లాగుల్లో మహేశ్ పేరుమీద కామెంట్లు రాయడం మొదలు పెట్టాడు ఈ మధ్య.

ఇలా వేరొకరి పేరు వాడుకుని కామెంట్లు చేయడం అత్యంత నీచమైన పని. స్వంతపేరు రాయకుండా అనామక కామెంట్లు రాస్తే కూడా సహించవచ్చు కానీ వేరే బ్లాగర్ పేరును దొంగతనంగా వాడుకున్న రామరాజు భాస్కర్ చేసింది నైతికంగానే కాదు చట్టప్రకారం కూడా తప్పే. అటువంటి వ్యక్తిని వెనకేసుకు వచ్చే బ్లాగర్లను ఏమనాలి?

మహేశ్ కు వ్యతిరేకంగా బ్లాగు పోస్టులు వేస్తున్న వారందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. మహేశ్ అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు, కానీ ఆ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చ అతనికి ఉందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ అతను రాసేది నచ్చకపోతే అతన్ని తప్పకుండా నిలదీయొచ్చు, వాదించొచ్చు కానీ దొంగ పేర్లతో దాడులు చేయడం ఏం సంస్కృతి?

ఇక ఒకరిద్దరు బ్లాగర్లు అయితే “IP అడ్రస్ పట్టుకుని నువ్వేమీ చేయలేవు” అని కూడా మహేశ్ పై జోకులు విసురుతున్నారు.

సిగ్గుపడాలి మీరంతా.

తప్పు జరిగిందని తెలిసీ బాధితుడిని ‘నువ్వేమీ చేయలేవు’ అని గేలిచేస్తున్నందుకు.

ఇంటర్నెట్ లో మనకు anonymity ఉంటుందని, మారుపేర్లతో మనం ఏం చేసినా చెల్లుతుందని చాలామంది అమాయకంగా అనుకుంటుంటారు. కంప్యూటర్ల గురించి ఏమీ తెలియని వారేకాక సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వారు కూడా ఇలా అనుకోవడమే విషాదం.

మనదేశంలో సైబర్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఇప్పుడు. గత యేడాది సోనియా గాంధీ గురించి ఆర్కుట్ లో కామెంట్ రాసినందుకు జైలు పాలైన రాహుల్ వైద్ కేసు వివరాలు చూస్తే రెండు విషయాలు అర్థం అవుతాయి మనకు.

ఒకటి మన పోలీసులు సైబర్ నేరాలను పరిష్కరించే సత్తా కలిగి ఉన్నారు.

రెండు ఆర్కుట్, ఫేస్ బుక్, వర్డ్ ప్రెస్, బ్లాగర్, యాహూ, గూగుల్ …ఇలా మీరు ఏ సర్వీస్ వాడి తప్పుచేసినా సదరు కంపెనీ మన పుట్టుపూర్వోత్తరాలన్నీ పోలీసు వారికి చక్కగా అప్పజెప్పుతుంది.

కాబట్టి మిత్రులారా, మన పోలీసులు ఏమీచేయలేరనో, లేక ఇంటర్ నెట్ లో మనం Anonymous గా ఉన్నామనో ఏదిపడితే అది రాయకండి. మీరు ఇంటర్ నెట్ లో చేసే ప్రతిపనినీ ఏదో ఒక వ్యవస్థ రికార్డు చేస్తూనే ఉంటుందని, అవసరమైనప్పుడు తీగ లాగితే డొంకంతా కదులుతుందని మరువకండి. మారుపేర్లతో (ఇతరులను కించపరిచే) బ్లాగులు నడిపిస్తే మాడుపగులుతుందని గుర్తుంచుకోండి.

చివరగా ఒక మాట. మహేశ్ పై ఒంటికాలి మీద లేస్తున్న వారంతా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఒకటుంది. మహేశ్ తన బ్లాగులో రాస్తున్న అనేక విషయాలు ఆయన ఇవ్వాళ కొత్తగా కనుక్కున్న విషయాలేమీ కావు. అవి గత కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న విషయాలే. గొప్ప గొప్ప మనుషులు చెప్పిన మాటలే అవి. అలాంటి విషయాలు రాస్తున్నందుకు మహేశ్ పై విషం కక్కడం వల్ల ఏ ప్రయోజనమూ సిద్ధించదు.

ప్రశ్నించే మనిషిని మనం చంపేయగలమేమో కానీ ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంటుందని గుర్తుంచుకోండి.

—–

ఫిబ్రవరిలో చదువరి బ్లాగుల్లో దొంగలు పడ్డారంటూ రాసిన పోస్టు చదివారా?

6 స్పందనలు నుండి “ఏమీ చేయలేరని ఎగిరిపడకు నేస్తం” కు


  1. 1 Marthanda 11:15 పూర్వాహ్నం వద్ద జూన్ 22, 2009

    మనిషి యొక్క బిహేవియర్ ని అతని కులం నిర్దేశిస్తుందా? జళగం వెంగళ రావు, ముప్పాళ్ళ లక్ష్మణ రావు (గణపతి) ఇద్దరూ వెలమ దొర కులంలో పుట్టిన వాళ్ళే. వెంగళ రావు దోపిడీ వర్గానికి చెందిన వాడైతే గణపతి దోపిడీ ప్రైవేట్ ఆస్తిని వ్యతిరేకించే మావోయిస్ట్. కత్తి మహేష్ రిజర్వేషన్ ఆధారంగా పైకి వచ్చాడు కనుక అతను అలాంటోడు అనడంలో ఎంత వరకు హేతుబద్దత ఉంది?

  2. 3 Konatham Dileep 5:33 పూర్వాహ్నం వద్ద జూన్ 24, 2009

    ఏకలింగం గారూ,

    అనామక బ్లాగర్లకు, వ్యాఖ్యాతలకు సమాధానం ఇవ్వొద్దనుకున్నాను కానీ, మీరు రాసిన పోస్టులో భాష చూశాక మీరు ఇంత సౌమ్యంగానూ రాయగలరా అని ఆశ్చర్యపోయి ఈ చిన్ని జవాబు.

    మీరు ఇప్పుడు రాసిన భాషలో మనం ఎంతకాలమైనా వాదించుకోవచ్చు. దాంతో నాకు పేచీ లేదు. కానీ మారుపేర్లతో ఒక మనిషిని కులం పేరుతో అవమానించడం, అదీ బాగా చదువుకున్న మీబోటి యువకులు చేయడం నాకు బాధ కలిగించింది.

    మన విశ్వాసాలను ప్రశ్నిస్తే సహజంగానే కోపం వస్తుంది. దానికి ఎలా ప్రతిప్సందించాలనేదే ఇక్కడ సమస్య. నేనింతకు ముందే చెప్పినట్టు మతం/కులం గురించి మహేశ్ మాట్లాడుతున్న విషయాలు బహుశా తెలుగు బ్లాగ్ లోకానికి కొత్త కావొచ్చు కానీ అవి చార్వాకుని నుంచి పెరియార్ దాకా అనేకమంది చెప్పగా, కొన్ని వందల ఏళ్లనుండి వ్యాప్తిలో ఉన్న విషయాలే.

    ప్రశ్నించడం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మానవజాతి వికాసమూ ఆగిపోతుంది. వందమంది కలిసి ఒక్కడి నోరు మూయించడం చరిత్రలో అనేకసార్లు జరిగింది. కానీ అలా జరిగిన ప్రతీసారీ ఆ ఒక్కడు మాట్లాడిన మాటలే నిజమై చివరికి సమాజ గమనాన్ని మార్చాయి. భూమి గుండ్రంగా తిరుగుతుందని గెలీలియో అన్ననాడు అప్పటి సమాజమూ, చర్చి కలిసి అతని గొంతు ఎలా నొక్కాయో మీకు తెలియనిది కాదు.

    The world will become a better place only when someone questions the status quo.

    ఈ చర్చకు ఇంతటితో ముగింపు పలుకుదాం.

    కొణతం దిలీప్

  3. 4 ఏకలింగం 8:28 పూర్వాహ్నం వద్ద జూన్ 24, 2009

    డిలీప్ గారు,
    దయచేసి దీన్ని చర్చకు కొనసాగింపు అనుకోకండి.
    But I have to clarify few point here.

    “మారుపేర్లతో ఒక మనిషిని కులం పేరుతో అవమానించడం, అదీ బాగా చదువుకున్న మీబోటి యువకులు చేయడం నాకు బాధ కలిగించింది.”

    నేను ఎప్పుడు ఎవరిని కుల, మత తారతమ్యాలతో చూడలేదు. అవమానించలేదు. మారుపేర్లతో ఇంకొకరిని దూషించలేదు. ఇక్కడ ఎవరో చేసిన పనికి నేను మద్దతుగా రావడానికి కారణం కేవలం మహేష్ గారు తెలిసీ తెలియక చేసిన పిల్ల చేస్టలు.

    “మన విశ్వాసాలను ప్రశ్నిస్తే సహజంగానే కోపం వస్తుంది. దానికి ఎలా ప్రతిప్సందించాలనేదే ఇక్కడ సమస్య. నేనింతకు ముందే చెప్పినట్టు మతం/కులం గురించి మహేశ్ మాట్లాడుతున్న విషయాలు బహుశా తెలుగు బ్లాగ్ లోకానికి కొత్త కావొచ్చు కానీ అవి చార్వాకుని నుంచి పెరియార్ దాకా అనేకమంది చెప్పగా, కొన్ని వందల ఏళ్లనుండి వ్యాప్తిలో ఉన్న విషయాలే.”

    దయచేసి చార్వాకుని “లోకయత” కు మహేష్ గారి పిచ్చిరాతలకు ముడిపెట్టకండి. దానికి దీనికి నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

    “ప్రశ్నించడం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మానవజాతి వికాసమూ ఆగిపోతుంది. వందమంది కలిసి ఒక్కడి నోరు మూయించడం చరిత్రలో అనేకసార్లు జరిగింది. కానీ అలా జరిగిన ప్రతీసారీ ఆ ఒక్కడు మాట్లాడిన మాటలే నిజమై చివరికి సమాజ గమనాన్ని మార్చాయి. భూమి గుండ్రంగా తిరుగుతుందని గెలీలియో అన్ననాడు అప్పటి సమాజమూ, చర్చి కలిసి అతని గొంతు ఎలా నొక్కాయో మీకు తెలియనిది కాదు.”

    ప్రశ్నించడాని ఎవరూ ఆపమనడం లేదండి. ఈయనగారి రాతల్లో సమాజ గమనాన్ని మర్చే ఒక్క రాత చూపించండి. అన్ని సభ్యసమాజం నొచ్చుకొనే రాతలే తప్ప. గెలీలియో పోరాడింది శాస్త్రీయ విజ్ఞాం కొరకు. దానితో దినిని పోల్చడమంటే మోకాలుకూ బోడిగుండుకూ లంకెపెట్టడమే.

    స్పందించినందుకు చాలా ధన్యవాదములు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. నమస్కారం.

    -ఏకలింగం

  4. 5 Swaroop 10:17 పూర్వాహ్నం వద్ద జూన్ 24, 2009

    Ekalingam garu,

    Sir mee post choosi nenu okkasari alochichalsina paristiti vachindi sir manam ekkada unnam ani. manam 21st century lo unnama ani gurtu chesukuni ila rastunnanu. kulalu, matalu ippudu levu sir. prati manishiki vari vadana vinipinche svatantram undhi(meeku kuda). kani adi edutivarini particularga pin point chesi undakudadu.

    Anthala mee vadananu vinipinchina meeru okka vishayam marchipoyaru sir. blogs undi bhavalanu vyakthaparichenduke kani ila kadu. mahesh garu annaru ani meeru ante meeku ayanaku teda enti ikkada. (naa uddesam lo mahesh garu tappu chesaru ani kadu. ekalingam gari sandarbam kabatti variki varthinche vidanga cheppanu.).

    chese pani, rase mata pakkavadiki useful ga undali sir.

    naaku telisi nenu meeku cheppe antha peddavadini kuda kanu. pls ee blogs ni margadarsakanga marchandi.

    Thanks sir.

  5. 6 నాగప్రసాద్ 5:14 అపరాహ్నం వద్ద జూన్ 24, 2009

    >>”ప్రశ్నించడం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మానవజాతి వికాసమూ ఆగిపోతుంది.”

    మానవజాతి వికాసానికి పనికొచ్చే ప్రశ్న అయితే, సమాజ గమనాన్ని ఖచ్చితంగా మార్చుతుంది.

    కాని ఇక్కడ ఇక చాలు, అందరం విసిగి పోయాము అని చెప్పినా కూడా వినకుండా ఎంతసేపూ “రాముడుకి సీత ఏమవుతుంది?” “విష్ణువు చిల్లర దేవుడా?” లాంటి ప్రశ్నలేస్తున్నందుకే విభేదించాల్సి వచ్చింది. ఇటువంటి ప్రశ్నలు సమాజగమనాన్ని మారుస్తాయని మీరనుకుంటే, అది మీ ఇష్టం.

    మీరు చర్చకు ముగింఫు పలికినప్పటికి, ఈ కామెంటు రాసినందుకు క్షమించండి. నేను కూడా ఈ కామెంటుతో చర్చను ఆపేస్తున్నాను.


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,597 సందర్శకులు