రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్రంగా కలవరపెట్టిన ఆయేషా హత్య కేసు నిందితుడు సత్యంబాబు, టీవీల్లో వచ్చే నేరాలు – ఘోరాలు వంటి క్రైం ప్రోగ్రాములే తనను నేరం చేసేలా పురికొల్పాయని చెప్పాడు.
ఆర్నెళ్ల క్రితం హైదరాబాదు శివార్లలో ఒక మహిళను హత్య చేసిన నిందితుడు కూడా పోలీసుల ఇంటరాగేషన్ లో తాను టీవీలో క్రైం కార్యక్రమాలు చూసే ఈ హత్యకు ప్రేరణ పొందానని చెప్పాడు.
గత కొన్నేళ్లుగా తెలుగు టెలివిజన్ పై నిరాఘాటంగా కొనసాగుతున్న ఈ క్షుద్ర వినోదం సమాజంపై ఎటువంటి దుష్ప్రభావాన్ని వేస్తుందో ఇంతకు మించిన ఉదాహరణ అక్కరలేదు.
రాత్రి తొమ్మిది అయితే చాలు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకూ ఏ చానెల్ లో ఏ ఘోరం చూడాల్సి వస్తుందోనని హడలిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. రాత్రి ఇంట్లో అన్నం తినే వేళకు మనుషులను చంపడాన్ని ఒక వినోదభరితమైన కార్యక్రమంగా మార్చి వడ్డిస్తున్నాయి తెలుగు వార్తా ఛానెళ్లు. ఇక ఈ గొప్ప వినోదం మిస్ కాకండి అంటూ పగలూ రాత్రీ తేడాలేకుండా ప్రకటనలతో ఊదరకొడుతున్నాయి.
24 గంటల నిరంతర వార్తా స్రవంతులు ఇప్పుడు ప్రజలకు నిరంతరం దుర్వార్తలు చూపిస్తున్నాయి. తమ చానెల్స్ రేటింగ్ పెరిగితే చాలు అనే ఏకైక లక్ష్యంతో ఎటువంటి గడ్డికరవడానికైనా సిద్ధమైపోతున్నాయి.
గత కొంతకాలంగా ఈ క్రైం సీరియళ్లపై ప్రజల నుండి వ్యతిరేకత పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సీరియళ్లను నిషేధించాలని కొన్ని విజ్ఞప్తులు కూడా అందాయి. అయితే ఇంకా ప్రభుత్వాలు ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
సమాజంలో ఎటువంటి మార్పు రావాలన్నా అది ప్రజల నుండే రావాలి. నేరాన్ని వినోదం చేసిన తెలుగు వార్తా చానెళ్ల తీరును ప్రజలు ఇకనైనా గట్టిగా నిరసించాలి. ఇటువంటి కార్యక్రమాలు మాకు వద్దు అని చానెళ్ల యాజమాన్యాలకు మనం స్పష్టంగా చెప్పాలి. తీరు మార్చుకోకపోతే ఆయా చానెళ్లను చూడడం మానేస్తామని హెచ్చరించాలి.
ఈ దిశగా మేము చేస్తున్న ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలవండి. మన సమాజం నుండి ఈ క్షుద్ర వినోదాన్ని తరిమికొట్టడదాం పదండి…
చేయాలనుకుంటున్న కార్యక్రమాలు:
1) నేరసంబంధ కార్యక్రమాలను తక్షణం ఆపివేయాలని, నేరాలను వినోదంగా మార్చే ప్రయత్నం మానుకోవాలని టీవీ చానెళ్ల యజమానులకు ఒక బహిరంగ లేఖ రాస్తున్నాం.
2) ఈ సీరియళ్లను తక్షణమే నిషేధించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి కూడా పంపిస్తున్నాం.
3) ఈ క్రైం సీరియళ్లపై మీడియా విశ్లేషకులు, మేధావులు, జర్నలిస్టులతో ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం.
4) టీవీ చానెళ్ల ఆఫీసుల ముందు వివిధ రూపాల్లో నిరసన తెలియజేయాలని అనుకుంటున్నాం.
ఈ ఉద్యమమానికి కేంద్రంగా ఒక తెలుగు బ్లాగును మొదలు పెట్టాం (http://spruha.wordpress.com). మీ వంతు సాయంగా ఇందులో మీ భావాలు పంచుకోండి. మీ అభిప్రాయం రాసి పంపండి.
దీనికి సంబందించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనండి (వివరాలు తెలియజేస్తాం)
నేరం వినోదం కా(రా)దు అనే నినాదంతో ఒక కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడదాం రండి
కొణతం దిలీప్
Email : konatham.dileepATgmail.com
Phone: 9849696536









నిజమే వీటిలో ఉండే వినోదం ఎమిటో అర్ధం కాదు,ఈ రోజు ఒక చానెల్ లో ప్రేమ జంట ఆత్మహత్య అని నూస్ వస్తోంది వ్యాఖ్యాత అసలు వారు ఫ్రేండ్సా లేక లవర్సా అని పెద్ద రీసెర్చ్ చేస్తోంది ,అలాగే ఆ అమ్మాయి ఫొటొని పదే పదే వెస్తున్నారు నాకు చాలా బాధగా అనిపించి చెప్తున్నాను.
జనాలు చూస్తున్నారు కాబట్టే అటువంటి కార్యక్రమాలు వేస్తున్నారు. టీవీ, పత్రికల్లో వచ్చే చవకబారు వార్తలు సమాజానికి పట్టిన ఒక రోగానికి సూచనలు. ఆ రోగం, జనాలు తమ వివేచనను విస్మరించటం. తమ ఎమోషన్స్ కి అప్పీల్ చేసే వాటినే పట్టించుకుంటున్నారు గాని, వాటిలో నిజానిజాలను బేరీజు వెయ్యట్లేదు. మనలో స్వతహాగా ఉండే మేధస్సును వాడట్లేదు.
అబ్బా తెలుగులో టైపింగ్ చాలా మెల్లగా ఉంది.
This problem is there everywhere. People would rather look at a tv show about gory accidents than a program on Chandraayan. People have intellectually become lazy.
అన్నింటికంటే సింపుల్ సూచన నాది..మీ మీ టీవీలు మూసీలో నిమజ్జం చేసేయండి. టీవీ నిమజ్జనం అనే కార్యక్రమం మరింతగా సక్సెస్ అయ్యే సూచనలున్నాయి. ఎందుకంటే దీని సక్సెస్ మనమీద ఆధారపడుతుంది..ఎదుటివాడిమీద కాకుండా. ఎంతసేపు వాడిది చెయ్యాలి, వీడిది చెయ్యాలి అనే బదలు మనమే ఆ పనేదో చేస్తేస్తే పోలా. TV is the modern opium of masses. TV is the box and figure out who is the idiot!!
ఈ కార్యక్రమాలే పెద్ద నేరాలు- ఘోరాలు
వీటితో పాటుగా కాలేజీ ప్రేమ, హైస్కూలు పిల్లల ప్రేమల్ని చూపించే సినిమా దైరెక్టర్లని, కథారచయతల్ని, నిర్మాతలకి, నటీ నటులకి కూడా ఇలాంటి నిరసనలు చెప్పాల్సిన పని ఉంది.
నాకు విచక్షణ ఉంది నేను చూడను అని యెవరైనా అనుకొంటే సరిపోదు. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. నేరాలు-ఘోరాలు జరిగిపోతూనే ఉంటాయి.