అరుదైన హైదరాబాద్ చిత్రాలు మొదటి భాగం చూశారా?
అయితే ఇదిగో రెండో వాయిదా…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
అప్పటి ప్రభుత్వ రవాణా బస్సు
హై కోర్టు భవనం – ఎదురుగా ఉన్న మూసీ నదిలో బురద నీరు (మురికి నీరు కాదు) చూడండి
గండిపేట చెరువు (ఉస్మాన్ సాగర్)
నగరంలో ఒక వీధి
ఫతేహ్ మైదాన్ (ఇప్పటి ఎల్.బి. స్టేడియం)లో సైనిక వందన స్వీకారం చేస్తున్న నిజాం నవాబు. దూరంగా ఇప్పటి అసెంబ్లీ భవనం కూడా కనపడుతుంది. చిత్రంలో కనపడుతున్న కొండపైనే ఇప్పుడున్న బిర్లా మందిర్ కట్టింది!
*ఈ చిత్రాలన్నీ 1900-1948 మధ్య తీసినవి
గమనిక: అన్ని చిత్రాలూ టైం లైఫ్ (TIME- LIFE) సంస్థ వారి కాపీరైటు.















Pch…. The beauty in those pictures is I could see so less people on the roads. I’m hating the current hyderbad which has become over crowded. Thanks for sharing those snaps
రెండో విడత చిత్రాలు కూడా బావున్నాయని వేరే చెప్పాలా?
హైదరాబాదు ను డెవలప్ చేసినం అని చెప్పుకునేటోళ్లు చెప్పాల మీరు హైదరాబాదు ను అభివృద్ది చేసిన్రా ఆగం చేసిన్రా అన్నది. అందరికి ఆశ్రయమిచ్చిన ఆనాటి హైదరాబాదెక్కడ కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల, పెట్టుబడి దార్ల చేతుల్లో చిక్కి సామాన్యుడు ఇల్లుకట్టుకోలేని పరిస్తితి ఉన్న ఈనాటి హైదరాబాదు ఎక్కడ. ప్రభుత్వ భూముల్ని అధికారం లోని వారు స్వాహా చెయ్యడం ఒకవైపు తమ భూములున్న దిక్కే ప్రభుత్వ పథకాలన్నీ మళ్లించడం మరోవైపు. ఇక్కడ పుట్టి పెరిగిన స్థానిక యువతను ఆటో డ్రైవర్లను, లిఫ్ట్ బాయ్ లను మహా ఐతే మార్కెటింగ్ కలెక్షన్ బాయ్స్ ను చేసి నిస్సిగ్గుగా చెప్పుకుందాం హైదరాబాదు ను డెవలప్ చేశాం అని.
తే.గీ. ప్రభవ మొందిన నాడె సంపన్నురాలు
సుందరమగు నిర్మాణాల సోయగముల
ధరణిపై వెలారిచిన సౌందర్య మూర్తి
అతులిత విశాల హృదయ మా హైద్రబాదు
– డా. ఆచార్య ఫణీంద్ర
ఇవి కూడా బాగున్నాయి.
ఫ్యూడల్ వ్యవస్త కు పుట్టిన పుండ్రేక్షుకోదండం హైదరాబాద్….తిలక్