అరుదైన హైదరాబాద్ చిత్రాలు

గూగుల్ ఇటీవల టైం లైఫ్ (TIME-LIFE) సంస్థ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం లైఫ్ సంస్థ వద్ద ఉన్న చిత్రాలను గూగుల్ స్కాన్ చేసి అంతర్జాలంలో ఉంచుతుంది. అలా గూగుల్ వారు ఉంచిన చిత్రాలలోంచి పాత హైదరాబాద్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు లభ్యమవుతున్నాయి.

ఈ చిత్రాలు నిజాం కాలం నాటి హైదరాబాద్ ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఇటీవల కొందరు తరచూ అంటున్నట్టు హైదరాబాద్ ను నిన్న మొన్న ఎవరో వచ్చి “అభివృద్ధి” చేయలేదని, అది స్వతంత్రం రాకపూర్వకమే ఒక ఆధునిక నగరమని ఈ చిత్రాలు మరోసారి నిరూపిస్తున్నాయి.

assembly-building

అసెంబ్లీ భవనం

nizamspalace1

రాత్రివేళ విద్యుద్దీపాల వెలుగులో నిజాం రాజప్రాసాదం

osmania_hospital1

ఉస్మానియా ఆసుపత్రి

british_residency

కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సి భవనం. ఇప్పుడు ఇందులో విమెన్స్ కాలేజీ ఉంది 

 

moazamjahimkt

మోజంజాహి మార్కెట్. (ఒక సారి ఆ వీధి దీపాలు చూడండి!)

 

secbad_rlystn

 నిర్మాణంలో ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్ 

state-central-library

అఫ్జల్ గంజ్ వద్ద ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరి భవనం

nizams-army

హైదరాబాద్ పురవీధుల గుండా నిజాం అశ్వికదళం కవాతు 

boys-playing-cricket

ఒక పబ్లిక్ స్కూళ్లో క్రికెట్ ఆడుతున్న పిల్లలు

village-mkt

హైదరాబాద్ సమీప గ్రామంలో ఒక వారాంతపు అంగడి

tractor-ploughing

ట్రాక్టర్ దున్నుతుంటే ఆసక్తిగా చూస్తున్న రైతులు

lady-soldiers

శిక్షణ పొందుతున్న మహిళా సైనికులు

nizam-time

నిజాం చిత్రంతో టైం పత్రిక ముఖచిత్ర కథనం (పన్నుల రూపేణా ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన సొమ్ముతో నిజాం రాజు ఆనాడు ప్రపంచంలోనే ధనికుడైన వ్యక్తిగా పేరుగాంచాడు )

ఇంకొన్ని అరుదైన హైదరాబాద్ చిత్రాలు ఇక్కడ: http://hridayam.wordpress.com/2008/11/21/rare-hyderabad-photos-2/

గూగుల్ లైఫ్ వారి చిత్రాల భాండాగారంలోని చిత్రాలు చూడాలంటే ఇక్కడికి వెళ్లండి: http://images.google.com/hosted/life

గమనిక: అన్ని చిత్రాలూ టైం లైఫ్ (TIME- LIFE) సంస్థ వారి కాపీరైటు

23 స్పందనలు నుండి “అరుదైన హైదరాబాద్ చిత్రాలు” కు


  1. 1 చంద్ర శేఖర్ కాండ్రు 3:31 పూర్వాహ్నం వద్ద నవంబరు 20, 2008

    లైఫ్ వారి చిత్రాలు గూగుల్‌లో లభ్యమవుతున్నయని నేనుకూడా నిన్న గూగుల్‌ఫీడ్‌ ద్వారా తెలుసుకున్నాను. వాళ్ళిచ్చిన లంకెద్వారా వెళితే అవి వియత్నాంలో యుద్దానికి సంభందించిన చిత్రాలు, స్వతహాగా నాకూ సైన్యం, విమానాలు, తుపాకులు మొదలగు వారి ఆయుధసంపత్తి అంటే ఉన్న కుతూహలంతోటి చాలా చిత్రాలు చూశా.

    కానీ యిదే లైఫ్ వారు హైదరాబాదు చిత్రాలు కూడా తిసి ఉంటారన్న ఆలోచన నాకు రాలేదు. ఆ విధంగా వెతికిందీ లేదూ. ఈ చిత్రాలను పరిచయం చేసినందుకు నెనర్లు.

  2. 2 meeruchadivaaraa 8:38 పూర్వాహ్నం వద్ద నవంబరు 20, 2008

    మంచి పోస్ట్! అరుదైన్ చిత్రాలు. మొన్ననే టీవీలో భలే తమ్ముడు సినిమా చూశాను. అందులో హైదరాబాదు కూడా చాలా పాతది.

  3. 3 నవీన్ గార్ల 9:23 పూర్వాహ్నం వద్ద నవంబరు 20, 2008

    జనాలు ఎంత పలుచగా ఉన్నారో కదా!! మోటారు బండ్ల కాలుష్యం లేకుండా, జనాల రొద లేకుండా హాయిగా ఉంది.

  4. 5 బ్రహ్మి 12:41 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    నేను నమ్మను. ఒక్క ఫొటోలో కూడా ట్రాఫిక్ జాం కనపడలేదు. ఇది హైద్రాబాదు కాదు. :-)

  5. 6 చదువరి 1:37 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    మంచి కబురు చెప్పారు, నెనరులు. ట్రాక్టర్ దున్నుతుంటే ఆసక్తిగా చూస్తున్న రైతులు, హైదరాబాద్ సమీప గ్రామంలో ఒక వారాంతపు అంగడి, మోజంజాహి మార్కెట్ – ఈ మూడూ నాకు బాగా నచ్చాయి. నేను ఆంధ్ర అని కొడితే వచ్చిన ఫోటోల్లో ఇది (http://images.google.com/hosted/life/l?q=andhra+source:life&imgurl=2429237876d0b1c3) ఒకటి. 1955 ఎన్నికల ప్రచారపు హోరులో తీసినదనుకుంటా. ఈ ఎన్నికల హడావుడి ఫోటోలు ఇంకా ఉన్నాయి. స్పష్టంగా ఉన్నాయి ఫోటోలు.

  6. 7 సుజాత 1:46 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    ఎంత బాగుందో ఆనాటి హైదరాబాదు జీవం ఉట్టిపడుతూ! ట్రాక్టర్ ని ఆశ్చర్యంగా చూస్తున్న రైతుల ఫొటో నిజంగా ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది.

    బ్రహ్మి,

    ఈ ఫొటోలు నిజాం కాలం నాటివండి. అప్పుడే ట్రఫిక్ జాం ఉంటే ఇప్పుడు మనం ఆకాశంలో నివశిస్తుండే వాళ్ళం.

  7. 8 sujata 2:08 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    Good Information. Infact, I saw most of these pictures in a coffee table book on Hyderabad City. I dont remember the name of the book. I will come back to you tomorrow. I hope I will find that book in the library again. Hyderabad has an interesting history. Thank you.

  8. 9 ఉమాశంకర్ 2:32 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    ఆహా! పొద్దున పొద్దున్నే ఆఫీసుకి రాగానే చూసాను, మనసెటో వెళ్ళిపోయింది. ఈరోజిక సంతృప్తిగా పని చేసుకోవచ్చు…

    నాకు బాగా ఇష్టమైన ఫోటో అంటే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ.

    ప్రతి ఫోటో తీసిన సంవత్సరం కూడా రాసి ఉంటే బాగుండేది. ఇంకా గూగుల్ సైటు కెళ్ళి చూడలేదు అక్కడ ఉంటుందేమో అని ఆశిస్తున్నా…

    ఈ ఫోటో లు ఇంతకుందే విడి విడి గా చూసిఉన్నా, ఆ మహిళా సైనికుల ఫోటో మాత్రం ఇప్పుడే చూడటం…

  9. 10 వికటకవి 2:49 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    చాలా బాగున్నాయ్. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  10. 11 రవి వైజాసత్య 5:16 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    బావున్నాయ్..క్రికెట్టాడుతున్న స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట అనుకుంటా. మొజంజాహీ మార్కెట్పై లక్స్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ చూశారా ;-) ఏదో బిస్కట్ల దుకాణం కనిపిస్తుంది కానీ మషూర్ ఐస్‌క్రీమ్ కన్పించట్లేదు :-(

  11. 12 నాగన్న 6:36 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    అప్పటి ఆధునికత బాగుంది, నిన్న మొన్న జరిగిన “అభివృద్ధి” ఇంకా బాగుంది.

    ఉరుదూ-బానిస-వృద్ధికి, తెలుగు-వృద్ధికి తేడా కనపడటం లేదా!?

    :-)

    ప్రచురించినందుకు నెనరులు.

  12. 13 చదువరి 7:33 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2008

    రవి వైజాసత్య: “లక్స్ సబ్బు అడ్వర్టైజ్మెంట్” – భలే కనిపెట్టారే! మీరు చెప్పాక కూడా కనుక్కోడానికి కాస్సేపు పట్టింది. అయితే ఆ సబ్బు అంత పాతదన్నమాట!

  13. 14 రవి 5:13 పూర్వాహ్నం వద్ద నవంబరు 21, 2008

    అబ్బ. ఎంత బావుందండీ. సెంట్రల్ లైబ్రరీ, మొజం జాహీ మార్కెట్ లు భలే ఉన్నాయి.

  14. 15 రాజేంద్ర కుమార్ దేవరపల్లి 6:18 పూర్వాహ్నం వద్ద నవంబరు 21, 2008

    చాలా బాగున్నాయి దిలీప్ గారు,http://images.google.com/hosted/life ఉపయోగించి నేను
    మరికొన్ని ప్రాంతాలను వెదికాను.ఉదాహరణకు దేశంలో రెండవ మనిసిపాలిటీ అయిన భీమిలి/భీమునిపట్నం
    వైజాగ్,గుంటూరు,అక్కడ ఏమీ లేవు.ANDHRA అని వెతికి చూడండి :) ఏమి వస్తున్నాయో,
    1991-92 లో అప్పుడు నేను పనిచేస్తున్న ఒకపత్రికవారు ప్రతిపాదించిన ఒక వార్తాధారావాహిక కోసం చాలా
    వింటేజ్ ఫోటోలు చాలా చూసాను.ముఖ్యంగా నైజాం కుటుంబాల్లోని మహిళలు,చక్కగా చీరలు కట్టుకోని ఉండటం చూసి ఆశ్చర్యపొయాను.వారిలో ఒకామె బహుశా నీలోఫర్ అనుకుంటా,గొప్పసౌందర్యరాశి.నిజాం ఆస్థాన ఫోటోగ్రాఫర్ ఒకాయన ఏదో సింగ్ కాబోలు వారి వారసులు ఇంకా ఆ వృతిలోనే ఉన్నారా??నరేంద్రలూధ్రా గారి దగ్గర కూడా చాలా చక్కని అరుదైన చాయాచిత్రాలున్నాయి,మీకు వీలున్నప్పుడు అలాంటివి కూడా ఇక్కడ పంచుకోండి

  15. 16 Konatham Dileep 6:38 పూర్వాహ్నం వద్ద నవంబరు 21, 2008

    @ చదువరి,

    మీరు యాధృచ్చికంగా పంపారో లేక కావాలనే పంపారో కానీ ఆ ఫొటోలో అప్పటి కమ్యూనిస్టు పార్టీ వారు విశాలాంధ్ర కు మద్ధతుగా గోడలపై రాసిన నినాదాలు కనపడుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!

    @ sujata,

    అదృష్టవశాత్తూ అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అనేక మంది ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. లాలా దీన్ దయాల్( http://www.deendayal.com) వారిలో ఒకరు. ఇటువంటి ఫొటోలన్నిటినీ అంతర్జాలంలో లభ్యమయ్యేట్టు చెయ్యాలనేది నా కోరిక. (కాపీ రైటు సమస్య లేనంతవరకూ)

    @ ఉమా శంకర్,

    కొన్ని ఫొటోలకు అవి తీసిన సంవత్సరం వివరాలు గూగులు వారి సైట్లో ఉన్నాయి.

    @ వైజా సత్య,

    లక్స్ సబ్బును భలే కనిపెట్టారు. నేను గమనించనే లేదు!

    @ నాగన్న,

    “అభివృద్ధి” చర్చ అంత త్వరగా తేలేది కాదు. ఆ చర్చ మరోసారి చేద్దాం.

    @ రాజేంద్ర కుమార్,

    మీరన్నది లాలా దీన్ దయాల్ గురించే కాబోలు. “Andhra” అని చదువరి గారు వెతికితే ఆసక్తికరమైన ఫొటోలే వచ్చాయి. తప్పకుండా నా దృష్టికి వచ్చిన పాత చిత్రాలు బ్లాగులో పోస్టు చేస్తాను.

  16. 17 Konatham Dileep 6:57 పూర్వాహ్నం వద్ద నవంబరు 21, 2008

    రాజేంద్ర కుమార్ గారు,

    బహుశా మీరు నిజాం రాణులైన దుర్రు షెహవర్ (Princess Durru Shehvar) మరియు నీలోఫర్ (Princess Niloufer) చిత్రాలు చూసి వుంటారు. వీరి చిత్రాలు చాలా ప్రాచుర్యం పొందాయి. వీరిద్దరి చిత్రాలు కూడా గూగుల్-లైఫ్ వారి కలెక్షన్లో ఉన్నాయి. వారి గురించి మరింత సమాచారం కొరకు ఈ లంకెలు చూడండి:

    http://en.wikipedia.org/wiki/Princess_Durru_Shehvar

    http://en.wikipedia.org/wiki/Princess_Niloufer

  17. 18 రాజేంద్ర కుమార్ దేవరపల్లి 8:14 పూర్వాహ్నం వద్ద నవంబరు 21, 2008

    చదువరి గారు,లక్స్ సబ్బు ఇక్కడ

    http://en.wikipedia.org/wiki/Lux_(soap)

    దానికన్నా పాతది పియర్స్ ఇక్కడ
    http://en.wikipedia.org/wiki/Pears_soap

    కన్యాశుల్కం నాటకం లో కూడా పియర్స్ ప్రస్తావన ఉంది చూడండి

  18. 19 Phani 1:49 అపరాహ్నం వద్ద నవంబరు 21, 2008

    చాలా బాగున్నాయి.

  19. 20 శ్రీ 11:13 అపరాహ్నం వద్ద డిసెంబరు 1, 2008

    బాగున్నాయి ఫోటోలు! ఒక్కసారి టైం మెషీన్ ఎక్కి పాత రోజుల్లోకి వెళ్ళిన అనుభవం కలిగింది.

  20. 21 sriram velamuri 6:17 అపరాహ్నం వద్ద జనవరి 16, 2009

    దిలీప్ గారూ ,ఫోటోలు చాలా బాగున్నాయి .మొన్న మీ అనువాదరచన చదివాను. ఒక దళారి పశ్చాతాపం … మీదే కదా …very good …thanx

  21. 22 Konatham Dileep 5:51 పూర్వాహ్నం వద్ద జనవరి 20, 2009

    ధన్యవాదాలు శ్రీరాం గారూ


  1. 1 పొద్దు » Blog Archive » నవంబరు బ్లాగుల ప్రస్థానం 3:23 పూర్వాహ్నం వద్ద డిసెంబరు 1, 2008 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,144 సందర్శకులు