అణు ఒప్పందంపై 13 ఆగస్ట్ 2007 నాడు పార్లమెంటులో చర్చకు బదులిస్తూ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలు ఇవి.
అణు ఒప్పందం అంశంపై భారత పార్లమెంటులో విశ్వాస పరీక్ష జరిగినప్పుడు మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆవేశపూరితమైన ప్రసంగం (ప్రసంగం చేయలేదు లెండి. ప్రసంగ పాఠం) లోనివీ వాక్యాలు…
ప్రతిపక్షాల దేశభక్తిపై వ్యంగ్య వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని ఉద్ధరించగలదనే సందేశాన్ని ఆయన ఇచ్చారానాడు.
అణు విద్యుత్ గురించి ఏమాత్రం తెలియని వారినుంచి మొదలుకొని అంతో ఇంతో తెలిసిన విద్యాధికుల వరకూ అణు జ్వరం ఆవహించిన ఘడియలు అవి. పార్లమెంటులో మన్మోహన్ సర్కారు అడ్డదారిలో విశ్వాస పరీక్ష నెగ్గిననాడు బయట పేలుతున్న బాణాసంచా చూశాక ఈ దేశ ప్రజలను ఎంత సుళువుగా మన రాజకీయ నేతలు మోసం చేస్తారా అని మధన పడ్డాను నేను.
టీవీల్లో జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు “అమెరికా అఫ్ఘానిస్తాన్ పై దాడి చేస్తే మనకేంటి? అది అమెరికాకు అఫ్ఘానిస్తానుకూ మధ్య విషయం. అయినా అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలపై దాడి చేయక ముద్దు పెట్టుకుంటారా?” అని రంకెలు వేస్తుంటే ఇంత అజ్ఞానులు మేధావులుగా ఎలా చలామణీ అవుతున్నారో అనుకునేవాణ్ని మనసులో.
ఈ అపర దేశభక్తుల నాటకం రెణ్నెళ్లలోపే బయటపడింది. అమెరికాతో “అణుబంధం” ఎటువంటి మోసపూరిత మాటల గారడీనో నిన్న వాషింగ్టన్ పోస్ట్ బయట పెట్టిన లేఖ తేటతెల్లం చేస్తుంది.
అమెరికా శాసనవ్యవహారాల సహాయ కార్యదర్శి జెఫ్ఫ్రీ టీ బెర్జనర్ రాసిన ఈ లేఖలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు అణు ఒప్పందంపై అడిగిన ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఈ లేఖలో మొదటి ప్రశ్నకు జవాబు చదివితే అమెరికా అసలు ఈ ఒప్పందం ఎందుకు కుదుర్చుకుంటున్నది స్పష్టంగా అర్ధం అవుతుంది.
మనం అణు పరీక్షలు జరిపితే ఏమవుతుందో బుష్ దొరవారు బ్లాక్ ఎండ్ వైట్ లో చెబుతున్నాడు కాస్త చదవండి.
ఇన్నాళ్లూ అటు పార్లమెంటులో ఇటు బయటా నిస్సిగ్గుగా మన్మోహన్, అతడి భజన బృందం చేస్తున్నది అబద్దపు ప్రచారమని ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమి కావాలి?
ఈ లేఖను బయటపెడితే మన్మోహన్ సర్కారు పతనమవుతుందనే భయంతోనే ఇన్నాళ్లూ ఈ లేఖను దాచామని జంకూగొంకూ లేకుండా చెబుతున్నారు అమెరికన్ అధికారులు.
వెయ్యి అబద్దాలు ఆడి కుదుర్చుకున్న ఈ అణు ఒప్పందం దేశహితం కొరకే అని ఇంకా నమ్మాల్సిందే మనం.
–
అణు ఒప్పందంపై నా మొదటి పోస్ట్ ఇక్కడ చదవండి











ఇంత జరిగినా… “ఆ..అది వాళ్ళ ప్రభుత్వపు గొడవ” అని నిస్సిగ్గుగా దులపరించేసుకుంటున్నారుగా ఈ లౌకికవాద ప్రభుత్వ ప్రతినిధులు
okka prasna andi…
america emaina india lover aa “to provide FREE LUNCH to India”???
– Vamsi
అమెరికా భారతదేశం మీద ప్రేమతో అణుఒప్పందం చేసుకోవటం లేదు అనేది జగద్విదితం.అది వారి strategic plan for South-Asia లో భాగం. ఇందులో మనం చూడాల్సింది ఈ technology వలన మనకొచ్చే లాభమెంత అని మాత్రమే.
పోఖ్రాన్లో మనం బుద్దుడ్ని నవ్వించిన తరువాత మనకొరిగిన tangible ప్రయోజనమేమిటి? మరో పది సంవత్సరాలు న్యూక్లియర్ టెస్టులు చెయ్యకుండా, కేవలం వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మనకొచ్చే నష్టం ఏమైనా వుందా? అమెరికా మీరు పరీక్షలు జరిపితే మా సరఫరా ఆపుతామన్నంత మాత్రానా, మన సార్వభౌమత్వానికి వచ్చే తీవ్ర విఘాతం ఏమిటి?
ఇటు ఇండియా అటు అమెరికా అధినేతలు తమ ప్రతిపక్షాన్ని అడ్డుతగలకుండా ఉండటానికి కొన్ని వక్రీకరణలు చేసినా..ఆపైన మొరాక్ ఒబామా అటు, బీజేపీ ఇటూ వస్తే మాత్రం ఈ డీల్ భవిష్యత్తులో జరక్కుండా ఉంటుందంటారా !!! ఈ డీల్ ప్రస్తుతంవున్న పరిస్థితుల్లో ఈ ప్రపంచానికి అవసరం. అందులో మనకెంత లాభముందో చెప్పగలిగితే, ఈ rhetoric నష్టాల్ని తరువాత బేరిజు చేయ్యొచ్చనుకుంటాను.
వంశీ గారు,
అణు ఒప్పందాన్ని providing FREE LUNCH to India అని మీరు భావిస్తే ఇక నేను మీకు చెప్పగలిగిందేమీ లేదు. నేను మాట్లాడుతున్నది ఒక ప్రధాన మంత్రి ఇంత నిస్సిగ్గుగా అబద్దం ఆడటం గురించి…
మహేశ్
అణు ఒప్పందం పై నేను రాసిన మొదటి పోస్టులోనే ఈ ఒప్పందం వల్ల మనకు ఒరిగేదేమిటో చాలా సుధీర్ఘంగా చెప్పాను. మరో సారి చూడగలరు.
1) మనమేదో అణు పరీక్షలు జరిపి బాంబులు తయారు చేసెయ్యాలని కాదు నేను చెప్పదలుచుకున్నది. మన ప్రధాన మంత్రి ఇంత కీలకమైన ఒప్పందం గురించి ఎంత అలవోకగా పార్లమెంటులో రెండుసార్లు పచ్చి అబద్దాన్ని చెప్పాడన్నదే నేను ఎత్తి చూపింది.
“ఈ డీల్ ప్రస్తుతంవున్న పరిస్థితుల్లో ఈ ప్రపంచానికి అవసరం”
ఏమిటీ స్వీపింగ్ స్టేట్మెంట్లు? ఈ అభిప్రాయానికి ఏ ప్రాతిపదికన రాగలిగారు మీరు?
కాసేపు వాదన కొరకు అణు ఒప్పందం మనకు మంచిదే అనుకుందాం. But Mahesh, Do ends justify the means?
దిలీప్
మీరు పైన ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారి ఇంగ్లీషు స్టేట్మెంట్ లు చదివి, క్రింద Q&A లింక్ లు కూడా చదివింతర్వాత, మీరంటున్నట్లుగా “నిస్సిగ్గుగా అబద్దం” ఆడింది ఏమీ కనబడట్లేదు.
ఆ questions & answers link లో నాకు PREVENTING India’s rights to undertake future nuclear tests ఎక్కడా నాకు కనిపించలేదు. అదే కదా మీరిచ్చిన ప్రధాన మంత్రి కోట్స్ లో వుంది. Nuclear Tests చేసింతర్వాత అమెరికా ఏం చేయొచ్చో ఆ answers లో వుంది. It’s like breaking a rental agreement..you pay some penalty..doesn’t mean you can’t walkout of the agreement.
అయినా అట్లాంటి క్లాజులు చిన్న చిన్న అగ్రిమెంట్లకే ఎవ్వరైనా రాసుకుంటారు, అందులో రెండు దేశాల మధ్యన మరీ ఖశ్చితంగా. మన వైపు నించి కూడా “when you don’t keep your end of the stick” clauses చాలానే ఉండి ఉంటాయి..అవన్నీ కూడా ఉటంకిస్తే మీర్రాసింది బాలెన్స్డ్ గా ఉండేది.
ఈ international-agreements కి పెద్ద విలువ ఉండదండీ. ఎవరో ఒకరు break చేసేంతవరకే వాటి విలువ. అమెరికా చాలా countries మీద sanctions విధించింది, ఏం సాదించింది చివరకి.
Sanctions యొక్క fundamental purpoes serve అవ్వట్లేదు అని వీళ్ళకు ఎప్పుడో అర్ధం అయ్యింది(దీని గురించి నేను కొన్ని పుస్తకాలని ఉదహరిస్తే బాగుంటుంది.గుర్తుకు రాగానే ఇస్తాను.ప్రస్తుతానికి One of the very succesful Indian in America..Newsweek International Weekly Chief Editor Fareed Zakaria articles ఏమైనా చదవండి).
ఇకపోతే వంశీ గారు..America provided free lunch to India అని అనలేదు. Why should anyone do so, by writing an open ended agreement అని ప్రశ్నించారు.
“టీవీల్లో జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు “అమెరికా అఫ్ఘానిస్తాన్ పై దాడి చేస్తే మనకేంటి? అది అమెరికాకు అఫ్ఘానిస్తానుకూ మధ్య విషయం. అయినా అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలపై దాడి చేయక ముద్దు పెట్టుకుంటారా?” అని రంకెలు వేస్తుంటే ఇంత అజ్ఞానులు మేధావులుగా ఎలా చలామణీ అవుతున్నారో అనుకునేవాణ్ని మనసులో”.
ఇట్లాంటి స్టేట్మెంట్ లు రిలేటివ్ అనుకుంటా దిలీప్ గారు. మీకెలా ఆయన ఫీలింగ్ అజ్ఞానంగా కనబడిందో, నాకూ మీ ఫీలింగ్ అంతే అజ్ఞానంగా కనబడుతూంది. (I sincerely apologize. My intention is not to provocate or to put down you. I just wanted to make a sincerely heart-felt assertive statement…no other motives please).
Please explain why does it look like an ignorant statement to you.
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లని పెంచి పోషింది అమెరికా వాళ్ళే అనే పాత వివరణ ఇవ్వకండి ప్లీజ్. అదో పెద్ద సబ్జక్ట్. That doesn’t give any right for Al-Qaida to attack America.
సగం యూరప్ ని కమ్మేసిన కమ్యూనిజం, అఫ్ఘనిస్తాన్ లో కూడా సోవియట్ యూనియన్ విజయం సాధించి ఉంటే, ఈ ప్రపంచం ఏమయ్యి ఉండేదో. America supported Afghan Mojahadeens in an effort to push Soviets out of Afghanistan. Thank God they did that.
Every night I pray and thank God that America LED the effort in stopping the spread of Communism all over the world.
అమెరికా, ఇంగ్లాండ్ లు ఎన్నో భయంకరమయిన తప్పులు చేసుండవచ్చు..కాని ప్రపంచం లో ప్రజాస్వామ్యం ఇప్పటికీ బతికి ఉందంటే వాళ్ళే కారణం అని బలంగా నమ్ముతాను నేను. “Give my liberty or give me death” అన్న Patrick Henry మాటలు సదా నా చెవుల్లో మోగుతూ ఉంటాయి. ఎందుకంటే స్వేఛ్ఛ లేని, ఇవ్వనీ, కమ్యూనిస్టుల ఉక్కు హస్తాల మధ్య జీవితాలు ఎలా ఉంటాయో దగ్గర్నుంచి చూసాను, చదివాను కూడా.
నేను వరంగల్ జిల్లాలో పుట్టి, అన్నల మధ్య, అన్నలతో పెరిగాను దిలీప్ గారూ. లెనిన్ ను దేవుడనుకొని బతికా చాలా సంవత్సరాలు.. నాకు దుఖం వస్తుంటుంది వెనక్కు తిరిగి నా చిన్నతనాన్నీ, నా మరియి నా వాళ్ళ అజ్ఞానాన్ని తల్చుకుంటే. దేవుడి దయకొద్దీ మా నాన్న నన్ను గాడి తప్పకుండా కాపాడాడు..ఒక్కోసారి బెత్తంతో, కొండొకచో బెల్ట్ తో. నా అనుభవాలు, paradigm-shifts గురించి రాయాలని ఉంది కాని, it would be too painful.
పోతే “do ends justify means” అని అడిగారు..not always..but yes..sometimes..it’s called keeping focus on the greater good..
ఇదే ప్రశ్న..లక్షలాది మందిని చంపించిన లెనిన్ ని, స్టాలిన్ ని, మావోని అడిగారా? What ends are these means for? అని. అసలలాంటి చరిత్రే కనపడదు కదా మన భారతదేశంలో విరివిగా దొరికే కమ్యూనిస్టు సాహిత్యంలో!. రష్యా భూతల స్వర్గం అనే పచ్చి అబద్దం తప్పితే.. ఘర్జించు రష్యా, ఘాండ్రించు రష్యా అనే empty rhetoric తప్పితే (God…I can’t believe that I started hating “Sri Sri” now..whom I ADMIRED MOST in the past).
ఈనాటి కమ్యూనిస్ట్ ల్లో ఉన్న ప్రధాన లోపమే అది సార్. మరి ఇంధన కొరత గురించి తప్పో ఒప్పో, ఏదో ఓకటి చేయడానికి తాపత్రయపడుతున్న సింగ్ గారిని ఇంత విమర్శిస్తున్నారే? propose చేస్తున్న solution లో లోపాలు వెతక్కపోతే వీళ్ళే ఒక grand schema of solutions propose చేయొచ్చు కదా. Glass is always half-empty అన్న negative-attitude ని ఎందుకు ఇంత బలంగా అందరి మీదా రుద్దుతారు. పాజిటివ్ గా vast majority of people(of 1000 million population) కి పనికొచ్చే ఒక్క సొల్యూషన్ ని అయినా pro-active గా propose చేసారా?
Globalized world లో inter-dependency అనేది Key అండి. Even in inter-personal relationships too.. అది ఏ self-help బుక్ చదివినా మొట్టమొదట కనబడుతుంది(7habits).
I believe in Win-Win attitude. కమ్యూనిస్ట్ లు ఎప్పుడూ కూడా either win-loose or loose-win అనే కోణం లోంచి జీవితాన్ని, ప్రపంచాన్నీ అందులో ఉన్న సర్వ వ్యవస్థలనీ చూస్తుంటారు. Granted…win-win is not always possible, but when you attempt, you atleast get rid of the “victimhood” menatlity.
సరే కామెంట్ పెద్దదయి పోయింది. ఇక్కడితో ఆపేస్తా. Thanks for looking out for folks though..
@”ఈ ప్రపంచం” అని నేనన్నదాన్ని అలా అర్థం చేసుకున్నారన్నమాట. నేను కేవలం its required for this part of the world అనే expression లాగా వాడాను. నేను మీ ‘ధృతరాష్ట్ర కౌగిలి’ చదివాను. అక్కడకూడా మన మధ్య ఇలాంటి చర్చ జరిగింది.ఒక దేశంగా భారతదేశం ఎప్పుడూ అమెరికాకు దాసోహమన లేదు. భవిష్యత్తులో అలా అయ్యేఅవకాశం లేదుకూడా. We are entering in to this agreement as equals అనే నాకు అనిపిస్తోంది. సాంకేతికపరిజ్ఞానం వారి దగ్గరుందిగనక అది మన అవసరమేగానీ, చేతగానితనం కాదు కదా!
అటువంటి సందర్భంలో why do we have such inferiority complex as a nation అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.మన్మోహన్ సింగ్ ఎంతైనా మెజారిటీలోవున్న ప్రభుత్వానికి నాయకుడు.తాను ఇష్టమొచ్చినట్లు “ప్రజాస్వామికంగా” ఈ డీల్ చేస్తే ఎవరుమాత్రం ఆపగలరు? ఎందుకు ఆపాలి? ఇక ఆయన ఆడింది అబద్దం అని మీరంటున్నారు. దానే diplomacy అంటారని international politics చెబుతాయి.రెండూ కరెక్టే. కానీ ప్రస్తుతానికి diplomacy అని నేననుకుంటాను.
Independent మిత్రమా,
ఓపికగా మీ నేపధ్యాన్నీ, మీరు పొందిన paradigm shift ను గురించీ సుదీర్ఘమైన వ్యాఖ్య రాసినందుకు కృతజ్ఞతలు.
నేను చాలామందిని చూశాను మీలాంటి మిత్రులను. కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టిగానీ, కొంతకాలం ఏదైనా ఎర్రజెండా పార్టీలో కానీ పనిచేసి కానీ ఉన్నవారు అనేకులు ఇప్పుడు కమ్యూనిజం పొడనే గిట్టనివాళ్లని.
మీరు అటు రష్యా నుండి మొదలుపెట్టి భారత కమ్యూనిస్టుల వరకూ, లెనిన్ దగ్గర నుండి శ్రీ శ్రీ వరకూ పది లైన్లలో తిట్టి పారేశారు. కమ్యూనిజం మంచిదా క్యాపిటలిజం మంచిదా, లెనిన్, స్టాలిన్, మావోల గుణ గణాలు ఎట్టివి అనే చర్చ మొదలుపెడితే ఒక గ్రంధమే అవుతుంది.
మీ ఇతర వ్యాఖ్యలకు నా జవాబులివీ:
అసలు అణు విద్యుత్ మనకు అవసరం అన్న వాదనే తప్పని నేను ఇదివరకే ఒక వివరణ ఇచ్చాను. ఒక అబద్దపు అవసరంపై సృష్టించిన అబద్దపు ఒప్పందం అణు ఒప్పందం.
అణు ఒప్పందాన్ని ఒక rental agreement తో పోల్చి చూడలేం మిత్రమా. ఎందుకంటే మీరు అన్నారే “its like breaking a rental agreement….you pay some penalty…” అని.
ఇక్కడే ఉంది తిరకాసంతా. అణు విద్యుత్ కేంద్రాల స్థాపనకు వేలకోట్లు ఖర్చు చేశాక రేపు అమెరికా ఏదైనా చిన్న కారణం చూపి ఒప్పందం రద్దు చేసుకుంటే మనకు జరిగే నష్టం అపారం. So let us not trivialize the issue by comparing it with a rental agreement.
ఇంకో విషయం మొన్న జార్జియా , రష్యా మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది తెలుసుగదా. ఆ యుద్ధంలో అమెరికా జార్జియా పక్షాన నిలబడింది. ఆ యుద్ధాన్ని సాకుగా చూపి రష్యాతో కుదుర్చుకోబోతున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నామని అమెరికా ప్రకటించింది.
రేపు పాకిస్తానుతో చిన్నపాటి సంఘర్షణ వస్తే అమెరికా మనల్ని ఇదే రకంగా బెదిరించగలదు.
అన్నట్టు ఫ్రెండ్, కొంచెం ఆ అమెరికా భక్తి కళ్లద్దాలని తీసి చూడు కాస్త. ఇవ్వాళ కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతుందంటే దానికి కారణం గత రెండు దశాబ్దాలుగా అమెరికా నుండి పాకిస్తానుకు అందుతున్న మిలిటరీ, ఆర్ధిక సాయమే. మొన్న సాక్షాత్తూ ఒబామానే ఒప్పుకున్నాడు ఈ సత్యాన్ని (http://blogs.reuters.com/pakistan/2008/09/06/obama-says-pakistan-used-us-aid-to-prepare-for-war-against-india/)
మిత్రమా liberty అనేది అమెరికా, ఇంగ్లాండులు చేస్తున్న అకృత్యాలకు ఒక అందమైన ముసుగు మాత్రమే. ఇరాక్ పై దాడి కూడా అక్కడి ప్రజలకు స్వేచ్చ ప్రసాదించడానికే అని చెప్పుకుంటాడు బుష్.
ఇక అఫ్ఘాన్ పై దాడి విషయం.
“తాలిబాన్లను పెంచి పోషించింది అమెరికానే అనే పాత వివరణ ఇవ్వకండి ప్లీజ్” అంటే అర్ధం ఏమిటి. నిజం అదే అయినప్పుడు ఇంకో విషయం ఎందుకు చెబ్తాను?
అల్ ఖైదా 3000 మందిని చంపి ఉంటుంది 9/11 లో కానీ ఆ వంకతో అఫ్ఘానిస్తాన్, ఇరాక్ లలో ఇప్పటికే లక్షలమంది అమాయక పౌరులను చంపేసిందే అమెరికా… అమాయకులను చంపడాన్నే కదూ మనం టెర్రరిజం అంటాం? మరి ఎవరు పెద్ద టెర్రరిస్టులు మిత్రమా?
ఇదంతా liberty కొరకే చేస్తుందా అమెరికా?
Globalized worldలో inter-dependency గురించి ప్రస్తావించారు. నేను inter-dependency వద్దని ఎక్కడా రాయలేదు. అయితే ఇవ్వాళ globalization అనేది వందల ఏళ్ల క్రితం వలస పాలన ఏ దోపిడీ అయితే చేసిందో అదే దోపిడి కొనసాగించడానికి ఒక కొత్త సాధనం మాత్రమే.
అణు ఒప్పందాన్ని కేవలం దానికదిగా చూడొద్దని దానితో పాటే మనం అమెరికాతో కుదుర్చుకున్న, ఇంతకన్నా ప్రమాదకరమైన వ్యవసాయ ఒప్పందం కూడా పరిశీలించాలని నేను ఇదివరకు పోస్టులో కూడా రాశాను. ఇప్పుడు మళ్లీ అదే చెప్తున్నాను.
ఇప్పటికే దారుణమైన స్థితిలో ఉన్న మన వ్యవసాయం అమెరికాతో వ్యవసాయ ఒప్పందం ఫలితంగా మోన్సాంటో వంటి కంపెనీల చేతిలోకి ఎలా వెళ్తుందో ఒకసారి చదివి తెలుసుకోగలరు.
నిజాలు వెల్లడించకుండా ఇటువంటి రహస్య ఒప్పందాలకు వెళ్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక సారి ఎన్రాన్ తో మనం కుదుర్చుకున్న ఒప్పందం కానీ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులతో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాలు కానీ, ప్రపంచ బ్యాంకు ప్రోద్బలంతో డిల్లీ జల్ బోర్డు ప్రైవేటీకరణ ఒప్పందం కానీ ఒక సారి చూడగలరు. ఆ ఒప్పందాలు కేవలం కంపెనీలతోనే కుదుర్చుకున్నా వాటి వల్ల మన ప్రభుత్వాలకు ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టం కలిగిందో చూడండి. ఇప్పుడు కూడా నేను చెబుతున్నది అదే. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్దాలు ఆడితే మన భవిష్యత్ తరాలు దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రేపు రేపు ఈ అణు విద్యుత్ కథ ఎలా ఉంటుందో మీ కళ్లతో మీరే చూస్తారుగా….
ఓపిగ్గా రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు దిలీప్ గారూ..
.
చాలా రాయాలనుంది కానీ..సమయం దొరకట్లేదు. ఊరికే bloviate చేయడం కన్నా కొన్ని sources of info ఇచ్చి మరీ మాట్లాడుకుంటే వాదులాడుకున్నట్లుగా కాకుండా మనకీ, చదివినవాళ్ళకీ కొంచెం ఉపయోగం కదా. అలా చేద్దామని భావిస్తున్నాను..కాని కొంచెం శ్రమ పడాలి కదా దానికి
మళ్ళీ కలుస్తా.. అప్పటివరకూ మీరు needy people కి చేస్తున్న సేవకి కృతఙతలు. It takes a village to protect the village! Both, You and I are part of it, although we may not always agree with each other.
Regards
దిలీప్ గారు నేను మీ అభిమానినండీ.. మీ “ఒక దళారీ పశ్చాత్తాపం ” నేను ఇప్పటికే రెండు సార్లు చదివాను. నేను నా బ్లాగులో అమెరికాకి వ్యతిరేకంగా టపాలు రాస్తే చాలామంది అందులో నిజాన్ని గ్రహించకుండా గుడ్డిగా అమెరికాని వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా మీ పుస్తకాన్ని ముందేసుకునే ఉన్నాను. మీరు కూడా బ్లాగరని బాలగోపాల్ గారి బ్లాగ్ లో మీ కామెంటు చూసి తెలిసింది. మీరు ఒక్కసారైనా నా బ్లాగుని చదివి నాకు ఒక్క కామెంటు రాస్తే నేను చాలా ఆనందిస్తాను సార్.
శరత్ చంద్ర గారూ,
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
ఏ విషయంలోనయినా భిన్నాభిప్రాయం ఉండటం సహజమే. అమెరికా పట్ల, దాని చర్యల పట్ల కూడా చాలామంది మిత్రులకు సదభిప్రాయం ఉండవచ్చు. మన వాదనకు తగిన సాక్ష్యాలు చూపుతూ వారితో మనం సుహృద్భావ వాతావరణంలో చర్చిస్తూనే ఉండాలి.
కొణతం దిలీప్
మనకు అటువైపు పాకిస్తాన్‌తో పాటు ఇటుపక్కన బల్లెంలా చైనా ఉంది కదా! అది అమెరికా దన్నుగా ఎగిరెగిరిపడుతున్నది. మనం అమెరికాతో దోస్తీ చెయ్యడం చాలా అవసరమైన స్ట్రాటజీ. చైనా తొత్తుల వత్తిడికి తట్టుకోలేక కొన్ని అబద్దాలు చెప్పితే చెప్పవచ్చు. నేను క్షమించాను.
దిలీప్ గారు
ఈ పుస్తకం చదవండి. అణు విద్యుత్తుకి సంబంధించి అతి ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి (మొదటి పాటం ఉచితంగా ఇక్కడ లభిస్తోంది). దేశభక్తులైన మీలాంటి వారు అతి త్వరగా ఈ రంగాన్ని అర్థంచేసుకోవాలి. అణు విద్యుత్తుకి జాతీయవాదానికి ముడిపెట్టడం చాలా తెలివితక్కువ పని. ప్రత్యేకించి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది తగదు.