రాష్ట్రంలో రెండు సెజ్ ల కథ

మూడు నెలల క్రితం కొంతమంది మిత్రులం (ఉప్పలపాటి ప్రశాంతి, రాకేష్) ఒకసారి సమావేశమయ్యాం. ప్రత్యేక ఆర్థిక మండలాల విధానం మరీ దుర్మార్గంగా ఉందని, వీటిని వ్యతిరేకించడానికి మనవంతుగా ఏమైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాం.  మన పెద్దలు తమ జీవితాలు ధారవోసి సంపాదించుకున్న స్వతంత్రం, సెజ్ ల ఏర్పాటువల్ల కోల్పోతున్నామని మా బృందం ప్రగాడ విశ్వాసం.

ఆ సమావేశం తరువాత కాలంలో రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఎస్.ఈ.జెడ్ లపై మేం సమాచార సేకరణ మొదలుపెట్టాం. ఇందులో మొదటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన పోలేపల్లి ఫార్మా సెజ్. ఇక రెండోది మా బృందం సమాచార హక్కు చట్టం వినియోగించుకుని బయటపెట్టిన జార్జియా టెక్ యూనివర్సిటీ సెజ్.

వీక్షణం సామాజిక రాజకీయార్థిక పత్రిక జులై ఎడిషన్ లో ప్రచురితమయిన ఈ రెండు ఎస్.ఈ.జెడ్ ల కథలు చదవండి…

4 స్పందనలు నుండి “రాష్ట్రంలో రెండు సెజ్ ల కథ” కు


  1. 1 తాడేపల్లి 8:56 పూర్వాహ్నం వద్ద జులై 29, 2008

    ఈ దేశానికి స్వాతంత్ర్యం దేని కోసమో నాకు చిన్నప్పట్నుంచి ఆలోచించినా అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా ?

  2. 2 srikanth 1:11 అపరాహ్నం వద్ద జులై 29, 2008

    ఈ వ్యవహారం గురించి నాకు తెలియదు గాని నాకు తెలిసిన ఇంకో కేసు లో భూ సేకరణ సమయంలో భూమిని ప్రజలు సంతోషం గా ప్రభుత్వానికి అమ్ముకొని రెండేళ్ళ తరవాత రెట్లు పెరిగాక అల్లరి మొదలు పెట్టారు ప్రభుత్వ విధానాల గురించి
    అదే గొడవ ప్రభుత్వం భూమి అడిగినప్పుడు ఎవ్వరూ చెయ్యలేదు, ఎందుకంటే మంచి రేటు వచ్చింది కాబట్టి . రెట్లు పదిపోయి ఉంటే అదే గొడవ చేసేవారా అని నా అనుమానం

    పోలేపల్లి విషయంలో అలాంటిది ఏమయినా ఉందేమో చూసారా ?
    16,000 ఎకరానికి నమ్మశక్యంగా లేదు , ఆ రోజు ఎ ప్రతిపక్షం ఆయినా పత్రిక అయినా దీని గురించి పట్టించుకుందా ?

  3. 3 రవి వైజాసత్య 2:25 పూర్వాహ్నం వద్ద జులై 30, 2008

    దేశస్వాతంత్ర్యము, వ్యక్తిగత స్వాతంత్ర్యము ఒకటి కాదు..దేశానికి స్వాత్రంత్ర్యం రాగానే ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్యం వస్తుందనుకోవటం భ్రమ. ప్రతితరంలో ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిందే.

  4. 4 Dil 3:24 పూర్వాహ్నం వద్ద జులై 30, 2008

    శ్రీకాంత్ గారూ,

    పోలేపల్లి విషయంలో ఎప్పుడు ఏం జరిగిందో పోస్టులో స్పష్టంగానే వివరించాను. ఇక్కడి ప్రజలు మొదటి రోజు నుండీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిన్నమొన్నటి దాకా ఏ రాజకీయ పార్టీ వీళ్ల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ అంశం పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చేసరికి నాగబాబు మొదలుకొని చంద్రబాబు వరకూ పోలేపల్లి గురించి మాట్లాడుతున్నారు.

    నమ్మలేని ఇంకో విషయం ఏమిటంటే చాలా మంది బాధిత రైతులకు బ్యాంకుల్లో పంట రుణాలు ఉండటం వల్ల భూమికి నష్ట పరిహారంగా వచ్చిన సొమ్ములోంచి ఆ బ్యాంకు రుణాన్ని మినహాయించుకుని ఇచ్చారు. తత్ఫలితంగా ఎకరానికి మూడు, నాలుగు వేలే దక్కిన దురదృష్టవంతులూ ఉన్నారు.

    ఇప్పుడు మీరు జడ్చర్ల బస్ స్టాండ్ వైపు వెళ్తే ఇద్దరో ముగ్గురో పోలేపల్లి బాధితులు బిచ్చమెత్తుకుంటూ కనపడతారు. జరుగుతున్న “అభివృద్ధి” ఎవరిదో, దానికి ఎవరు మూల్యం చెల్లిస్తున్నారో ఆ దృశ్యం చూస్తే అర్థం అవుతుంది మనలాంటి వాళ్లకు.


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,242 సందర్శకులు