హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎమరాల్డ్ మిఠాయి దుకాణానికి వెళ్లారా మీరెప్పుడైనా? ఇప్పటిదాకా వెళ్లకపోతే వెంటనే బయల్దేరండి.
విజయ్ రాం అనే కళాకారుడు నడుపుతున్నాడీ షాపుని. షాపు ముందరే మీకు నర్సరీల్లో ఉన్నట్టు కొన్ని మొక్కలు కనపడుతాయి. షాపులోకి అడుగుపెట్టిన కొద్ది క్షణాల్లోనే మీకు ఇది అలాంటి ఇలాంటి షాపు కాదని అర్థమవుతుంది. ఒక మూలకు రాగి బిందెలో మంచినీళ్లు ఉంటాయి. పక్కనే గోడకు వేలాడదీసిన కొన్ని తైలవర్ణ చిత్రాలు. వాటన్నిటిలో ఉండేది ఒకటే సందేశం. పర్యావరణాన్ని రక్షించండి, పుడమి తల్లిని కాపాడండి…ఇలా…
అన్నిటికన్నా మిన్నగా మీరు కొనే స్వీట్లను కాగితం సంచీలోనో, గుడ్డ సంచీలోనో ప్యాక్ చేసి ఇస్తారు. ఆ సంచీ మీద కూడా పర్యావరణ పరిరక్షణ గురించి నినాదాలు ఉంటాయి.
మీరు ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంటే, సమయానికి విజయ్ రాం ఉంటే, మీ అదృష్టం బావుంటే, మీకో చక్కని బహుమతి కూడా ఇస్తాడు. అదేమిటనుకున్నారు? మీరు ఇందాక షాపులోకి వస్తుంటే చూశారే చిన్న కుండీల్లో ఉన్న మొక్కల్ని, అదో అవే విజయ్ రాం తన కస్టమర్లకు ఇచ్చే వెలకట్టలేని విలువైన బహుమతులు.
అంతే కాదు, మీకు షాపు వాళ్లిచ్చిన గుడ్డ సంచీ తిరిగి తెచ్చిస్తే, తదుపరి కొనుగోలు పై కొంత రాయితీ కూడా ఇస్తారు.
గుడ్డ సంచీ వాడకాన్ని విజయ్ రాం బాగా ప్రోత్సాహిస్తారు. సేవ్ (SAVE) అనే స్వచ్చంద సంస్థను స్థాపించి కొంత మంది దాతల సాయంతో ప్రజలకు గుడ్డ సంచీలు బహూకరిస్తుంటాడు. ఇటీవలనే ఇందిరా పార్కులో ఉదయం వాకింగుకు వచ్చే వందలాది మందికి ఈ గుడ్డ సంచీలు బహూకరించారు.
రేపు అంటే 5 జూన్ నాడు చిల్కూరులోని బాలాజీ గుడి వద్ద పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజల చేత పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతిజ్ఞ చేయించి వారికి గుడ్డ సంచీలు బహూకరిస్తారు.
ఒక కళాకారుడు మిఠాయి దుకాణం నడపడమే ఒక వింతైతే ఇంత నిబద్దతతో పర్యావరణ స్పృహను ప్రదర్శించడం చాలా అరుదు. వ్యాపారానికీ, పర్యావరణానికి పోటీ ఉండాల్సిన పనిలేదని, అవి రెండూ ఒకదానికొకటి సహకరించుకోవచ్చని చిన్న చిన్న పనుల ద్వారా చాటుతున్నాడు విజయ్ రాం.
బందరు లడ్డూ స్వస్థలమైన బందరు నుండి హైదరాబాదుకు జె.ఎన్.టి.యు లో ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేయడానికొచ్చిన ఈ యువకుడు చివరికి ఇలా బాధ్యతాయుతమైన వ్యాపారవేత్త అయ్యాడు.
ఈ మధ్యే కూకట్ పల్లి జె.ఎన్.టి.యు నుండి హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో ఒక కొత్త శాఖను కూడా తెరిచారు ఎమరాల్డ్ మిఠాయి షాప్ వారు. వీలుంటే ఒకసారి దర్శించి ఈ మంచి మనిషి వెన్నుతట్టండి.
—
విజయ్ రాం గురించి మరింత సమాచారం ఈ కింది లంకెల్లో ఉంది:
జూన్ 5 నాడు పర్యావరణ దినోత్సవం
మరిన్ని వివరాల కొరకు దర్శించండి: http://www.unep.org/wed/2008/english/
అన్నట్టు ప్రశాంతి నడుపుతున్న బత్తీబంద్ బ్లాగు చదువుతున్నారా?










Thanks for the valuable info.
సుజాత గారూ, ఈ మిఠాయి దుకాణం గురించి నేను ఇంతకుముందు ఈనాడులో చదివాను.. నిజంగా విజయరాం గారు చేస్తున్న పర్యావరణ సేవ ఎనలేనిది.. మీరు చెప్పినట్లు గుడ్డ సంచీలను ప్రోత్సహించడం ఆసక్తికరంగా ఉంది.. ఈ కింది లింక్ లో ఆ షాప్ లో ఉండే తైలవర్ణ చిత్రాలు చూడవచ్చు..
http://www.koumudi.net/General/April27_08/nature_friendly.html
చాలా థ్యాంక్సండీ. మంచి విషయం తెలియజేశారు. ఇది చదివిన వెంటనే KPHBలో షాపుకు వెళ్ళిపోయాను. వాళ్ళ కాన్సెప్టు నాకు చాలా బాగా నచ్చింది. స్వీట్లు కూడా రుచిగా ఉన్నాయి. ఇకనుంచీ స్వీట్లంటే నా ఓటు ఎమరాల్డ్ కే.
నిషిగంధ గారు,
సుజాత గారి బ్లాగు మీదుగా నా బ్లాగులోకి వచ్చారా ఏమిటి?
ooops.. ‘గడ్డిపూలు ‘ .. ‘గుండెచప్పుడు ‘ వీటి మధ్య కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను.. సారీ దిల్ గారు
చాలామంచి వ్యాసం చదివాను. కాని హైదరాబాదు ఎప్పుడొస్తానో! అంతవరకూ స్వీట్ల కోసం, ఆ పర్యావరణ ప్రేమికుని కోసం కలలు కంటూ…
దుప్పల రవికుమార్
చక్కని ప్రయత్నం… విజయ్ రాం అభినందనీయుడు.
ఎమెరాల్డ్ స్వీట్ షాప్ కోసం కూడలంతా వెతికితే, చివరకి, ఎమరాల్డ్ మిఠాయి దుకాణం తగిలింది!.
వారికి ఫోను నెంబరున్నదా?
దోర్ డెలివరి అవి ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు కదా?
కందుకూరి రమేష్ బాబు కోళ్ళమంగారం పుస్తకంలో ప్రస్తావించింది ఈ షాపు గురించే కదా??!!
Information provided is very much useful.
మంచి సమాచారం.
నెటిజెన్ గారు,
డోర్ డెలివరీ సంగతి నాకు తెలియదు. ఇందిరా పార్క్ వద్ద గల బ్రాంచి ఫోన్ నెంబర్లు: 27654336, 27654337
రాజేంద్ర గారు,
రెండేళ్ల క్రిందట ఒక మిత్రుని ఇంట్లో చదివాను కోళ్ల మంగారం పుస్తకాన్ని. అందులో విజయ్ రాం ప్రస్తావన ఉందో లేదో గుర్తుకురావట్లేదు!
chadavatam leda pogadatam kante…adi acharanalo pettinappude manam chadivinadaniki saardhakatha ani naa abhiprayam
chala manchi vishayalu vhepparu madam
నేనూ ఈ మధ్యనే ఈ దుకాణంలో మిఠాయిలు కొన్నాను. రుచి, అభిరుచి,నిబద్ధత అన్నీ బాగున్నాయి.
Information provided is very much useful.