మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధానికి అనూహ్య ముగింపు (?)

నిన్న ఉదయాన్నే మా అన్న ఫోన్ చేశాడు. ఆయన చెప్పిన వార్త విని నేను షాక్ అయ్యాను.

“ఒక బ్యాడ్ న్యూస్, గులాబ్ సింగ్ చనిపోయాడు”

నాకో క్షణం పట్టింది తేరుకోవడానికి. “ఎలా”? అనడిగాను.

“మొన్న కర్ణాటక వెళ్తుండగా వీళ్ల కారును డీసీఎం ఢీ కొట్టిందట. డ్రైవర్ స్పాట్ డెడ్ అట, గులాబ్ సింగ్ నిన్న రాత్రి కింగ్ కోఠిలో ఉన్న కామినేని వోక్ హార్డ్ ఆస్పత్రిలో చనిపోయాడు, అతని భార్య ఇంకా కోమాలోనే ఉంది” చెప్పాడు మా అన్న.

ఆ వార్త నా గుండెల్ని పిండేసింది.

అతనెవరో రెండు నెలల క్రితం వరకూ నాకు తెలియదు. కానీ రెణ్ణెళ్లుగా అతణ్ణి ఒక విలన్ గా చూశాను నేను. అతని పై వ్యక్తిగతంగా ఏమీ ద్వేషం లేకపోయినా అతను పెట్టే స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ మా గ్రామాన్నీ, మా చుట్టుపక్కల గ్రామాలనూ ధ్వంసం చేస్తుందనే భయంతో గత రెండు నెలలుగా మేమంతా ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమించాం.

గత వారమే గులాబ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ కి సంబంధించిన పర్యావరణ ప్రభావ నివేదిక (Environmental Impact Assessment Report) ను చదివాను. అందులో ఉన్న అనేక అబధ్ధాలను ఎత్తి చూపుతూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఒక ఉత్తరం కూడా రాసి పెట్టాను. దాన్ని రేపు పోస్టు చేద్దామనుకున్నాను. ఇంతలోనే పిడుగు లాంటి ఈ వార్త తెలిసింది.

గులాబ్ సింగ్ వర్మ వ్యక్తిగతంగా ఎటువంటి వాడో నాకు తెలియదు. కానీ అతను ఇక లేడంటే మాత్రం బాధ కలుగుతోంది. గులాబ్ సింగ్ మరణంతో ఇక మా పోరాటం దాదాపు ముగిసినట్లే…

ప్రతి మరణం మనలో కొద్ది సేపు అయినా వైరాగ్యం కలిగిస్తుంది. మనం ఎన్నో అనుకుంటాం, ఏమేమో సాధించాలనుకుంటాం, సంపాదించుకోవాలనుకుంటాం. కానీ ఒక్క క్షణంలో అంతా తారుమారవుతుంది.

ఉన్నంత కాలం సాటివారికి సాధ్యమైనంత మేలు చేయాలని, చివరికి మనతో పాటు వచ్చేది ఆ మంచి పేరేనని మనలో చాలామందిమి బ్రతికి ఉన్నాళ్ళూ తెలుసుకోం.

 

10 స్పందనలు నుండి “మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధానికి అనూహ్య ముగింపు (?)” కు


  1. 1 subbarao 11:29 అపరాహ్నం వద్ద జూన్ 2, 2008

    What is guarrentee that another Gulab singh is not coming.
    since he laid a path there will be many industrialists would want to follow.
    you better keep watching
    you don’t loose anything by mailing that letter.
    it’d help in future if somebody wants to come up with a project.

  2. 2 Dil 3:49 పూర్వాహ్నం వద్ద జూన్ 3, 2008

    సుబ్బారావు గారు,

    ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకొకరు వచ్చి ఆ ఫ్యాక్టరీ పనులు చేపట్టే అవకాశం అయితే కనపడట్లేదు. కానీ కీడెంచి మేలెంచమన్నారు… కాబట్టి ఆ ఉత్తరం పోస్టు చేస్తాను.

    దిలీప్

  3. 3 నవీన్ గార్ల 7:05 పూర్వాహ్నం వద్ద జూన్ 3, 2008

    జీవితంలో ఉన్నంత నాటకీయత పుస్తకాల్లో ఉండదని తెలిసొచ్చింది. మీ పోరాటానికి ఇలాంటి ముగింపు అస్సలు ఊహించలేదు. ఇంకో నెలలో తను చనిపోతాడని కీ.శే.గులాబ్‌సింగ్‌గారికి తెలుసుంటే, ఫ్యాక్టరీ కోసం అంత తాపత్రయపడే వాడా?

  4. 4 cbrao 5:49 అపరాహ్నం వద్ద జూన్ 3, 2008

    Ending of article is like O.Henry’s twist to the story,at the end/pause of your struggle.

  5. 5 నెటిజెన్‌ 11:13 పూర్వాహ్నం వద్ద జూన్ 5, 2008

    మీ టపాలు చదువుతున్నంతసేపు జూలియా రాబర్త్స్ – Erin Brockovich చిత్రమే మదిలో మెదలాడింది. గులాబ్ సింగ్ మరణం, మీ యుద్ధానికి, రావుగారన్నట్టు ఓ హెన్రీ, కధకు ఇచ్చే ఊహించని మలుపు నిచ్చింది. సుబ్బారావు గారన్నట్టు, ఆ ఉత్తరం ఆపకండి. పంపండి.

  6. 6 రవికిరణ్ తిమ్మిరెడ్డి 4:27 పూర్వాహ్నం వద్ద జూన్ 8, 2008

    కాదనుకున్నా, తోసేసుకున్నా, మనసులో ఊడలు దిగిన ఫ్హూడల్ సంస్కృతి అవశేషాలు దిల్ గారి దిల్ లో కూడా.

  7. 7 Dil 4:47 పూర్వాహ్నం వద్ద జూన్ 9, 2008

    రవికిరణ్ గారూ,

    ఒక మనిషి చనిపోయినందుకు బాధ వ్యక్తం చేస్తే కూడా అందులో “ఊడలు దిగిన ఫ్యూడల్ సంస్కృతి” చూడగలిగిన మీకు జోహార్లు!

  8. 8 రవి వైజాసత్య 5:24 పూర్వాహ్నం వద్ద జూన్ 9, 2008

    ఫ్యూడల్ సంస్కృతి అంటే ఏంటి?

  9. 9 Dil 6:16 పూర్వాహ్నం వద్ద జూన్ 9, 2008

    ఒక్క మాటలో చెప్పాలంటే జమీందారి భూస్వామ్య సంస్కృతి. ఆనాటి రాజులు తమ పరిపాలనా సౌలభ్యం కొరకు జమీందార్లను, దేశ్ ముఖులను నియమించుకున్నారు. వీరు సామన్య ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయటం, శ్రమ, వనరుల దోపిడీ చేయటం వంటి ఆకృత్యాలు సాగించేవారు.

    చాలా మంది చరిత్రకారులు / సామజిక శాస్త్రవేత్తలు భారతదేశం Semi-Feudal society అని అభిప్రాయపడ్డారు.

  10. 10 కిరణ్ 11:31 పూర్వాహ్నం వద్ద జూన్ 11, 2008

    దేశంలో ప్రతి ఏటా లక్ష మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఎయిడ్స్, క్షయ, మలేరియా రోగాలన్నీ కలిపినా ఇంతమంది కాదు. 20 లక్షల మంది తీవ్ర గాయాలు పాలవుతున్నారు. ఈ మరణించేవారిలో ధనిక-బీదా తేడా లేదు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎవరితోవ వారు చూసుకూంటే అందరికీ అధోగతే.


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,242 సందర్శకులు