గుండె చప్పుడు వెనుక…

“గుండె చప్పుడు” దిలీప్, “ఒక దళారీ పశ్చాత్తాపం” దిలీప్ ఒకరేనని మాకు ఇప్పుడే తెలిసింది…

నిన్నటి నుండీ నా ఈ-మెయిల్ బాక్స్ లోకి వస్తున్న అనేక మెయిల్స్ సారాంశం దాదాపుగా ఇదే. మిత్రుడు రవి కుమార్ “ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తకంపై నిన్న ప్రచురించిన ఒక టపాలో నా బ్లాగ్ విషయం పేర్కొనడం వలన చాలామంది బ్లాగ్ మిత్రులకు ఈ విషయం తెలిసింది.

గుండె చప్పుడు బ్లాగ్ మొదలు పెట్టినప్పుడే, నా పరిచయం లో “ఒక దళారీ పశ్చాత్తాపం” గురించి రాద్దామనుకున్నాను కానీ సమయం వచ్చినప్పుడు ప్రస్తావిద్దామని ఆ  పని చేయలేదు.

“ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తక విజయం వల్ల నాకు వ్యక్తిగతంగా చాలా పేరు వచ్చింది. అయితే అనేక సామాజిక, రాజకీయార్ధిక విషయాలపై నేను ఇంకా అవగాహనను పెంపొందించుకునే విద్యార్ధి దశలోనే ఉన్నాను. పుస్తకం ఇంత సక్సెస్ అయ్యిందంటే దానికి ప్రధాన కారణాలు జాన్ పెర్కిన్స్ రాసిన విషయ ప్రాధాన్యత, అతని రచనా శైలీ. 

బ్లాగర్లలో అనేకులు నా అనువాదాన్ని చదివారని నాకు తెలుసు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. నా గురించి రాసిన “లబ్ డబ్” పేజిలో ఉన్న ఈ-మెయిల్ లింక్ ద్వారా మీరు నన్ను చేరవచ్చు.

ఒక దళారీ పశ్చాత్తాపం  పుస్తకం గురించి మరిన్ని వివరాలకు ఈ బ్లాగును దర్శించండి

9 స్పందనలు నుండి “గుండె చప్పుడు వెనుక…” కు


  1. 1 chavakiran 10:20 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 29, 2008

    నేను మీ పుస్తకం చదవలేదు:)

    చాలా రోజులు మీరు బ్లాగులో వ్రాసేవి ఏ పత్రికలోనో వచ్చే విషయాలు ఎవరో కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పెడుతున్నారేమో అనుకున్నాను :)

  2. 2 కొల్లూరి సోమ శంకర్ 11:06 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 29, 2008

    విడుదలైన రెండేళ్లలో ఒక అనువాద పుస్తకం ఆరు సార్లు పునర్ముద్రణ పొందడం చిన్న విషయం కాదు.
    ఒక అనువాదకుడిగా ఆ ఆనందం ఏమిటో నాకు తెలుసు. మంచి పుస్తకాన్ని అనువదించిన మీకు నా అభినందనలు
    కొల్లూరి సోమ శంకర్

  3. 3 నాగరాజా 3:53 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 30, 2008

    వావ్.. శుభాకాంక్షలు (రెండేళ్లలో ఒక అనువాద పుస్తకం ఆరు సార్లు పునర్ముద్రణ పొందడం)

  4. 4 Dil 5:08 పూర్వాహ్నం వద్ద మే 2, 2008

    @ సోమ శంకర్ గారు , @ నాగ రాజా గారు నెనర్లు

    చావా గారు, నా బ్లాగులో పోస్టులన్నీ నావే సార్, ఎక్కడా కాపీ పేస్ట్ చెయ్యలేదు :)

  5. 5 వాసు.బి 8:38 పూర్వాహ్నం వద్ద మే 9, 2008

    అద్బుతమయిన అనువాదం.పుస్తకము చదివిన చాల రోజులవరకు (నా ఆలోచనలన్నీ) ఏమయిపోతుంది మన(దేశ) భవిష్యత్తు ఈ దుర్మార్గపు రాజకీయుల చేతులలో అని దిగులేసింది.
    జాన్ పెర్కిన్స్ కి, మీకు అభినందనలు.
    ఇంకా మీ ఇతర అనువాదాలు ఏమిటో తెలియపరచగలరు.

  6. 6 Dil 9:52 పూర్వాహ్నం వద్ద మే 9, 2008

    వాసు గారు,

    Newyork Times కరస్పాండెంట్ స్టీఫెన్ కింజెర్ రాసిన ‘Overthrow’ అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాను. ఇది త్వరలోనే విడుదల అవుతుంది.

  7. 7 వాసు.బి 6:21 పూర్వాహ్నం వద్ద మే 10, 2008

    నెనర్లు.
    చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
    ముందుగానే మీకు అభినందనలు.

  8. 8 శ్రీ 2:30 అపరాహ్నం వద్ద మే 16, 2008

    నేను జాన్ పెర్కిన్స్ పుస్తకం చదువుతున్నపుడు మీ అనువాదం గురించి విన్నాను. నాకు జాన్ పెర్కిన్స్ confessions of an economic hit man చాలా నచ్చింది. మా డెట్రాఇట్ లిటరరీ క్లబ్ లో మీ పుస్తక సమీక్ష ఉంది ఈ సంవత్సరం. అపుడు మీ పుస్తకం కుడా చదవగలుగుతాం.

  9. 9 కొత్తపాళీ 12:55 అపరాహ్నం వద్ద జూన్ 9, 2008

    నాకీ సంగతి నిన్ననే తెలిసింది! :(


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,708 సందర్శకులు