
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని మనమెవరం చూసి ఉండక పోవచ్చు.
ఆకాల వర్షాలు పడి రాష్ట్రం నలుమూలలా రైతులు, విద్యార్ధులు, ఇతర ప్రజనీకం అష్టకష్టాలూ పడుతుంటే మన అభినవ నీరో చక్రవర్తి గారు చూడండి వాన దేవుడికి చేతులెత్తి దండం పెడుతున్నాడు.
మూడు రోజులు ఎడతెరిపి లేకుండా రాష్ట్రం అంతటా పడ్డ వర్షాలు రైతులకు ఎనలేని నష్టాన్ని కలుగజేసాయి. వరి, మిర్చి, ఇంకా ఇతర పంటలు నాశనమయ్యాయి. అధికారిక అంచనాల ప్రకారమే పంట నష్టం విలువ వంద కోట్లకు పైబడి ఉంటుందట.
రాష్ట్ర ప్రభుత్వమేమో నిన్నటి పత్రికల్లో “వరుణ దేవుడికి వందనాలు” అంటూ భారీ ప్రకటనలు ఇచ్చింది. అకాల వర్షం పడితే దాన్ని కూడా తమ ఘనతే అని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకునే స్థాయికి మన నేతలు దిగజారారు. రైతులకు నష్ట పరిహారం ఇస్తారో లేదో కానీ ప్రకటనలకు మాత్రం కోట్లు తగలేస్తున్నారు.
అధికారం కళ్లు నెత్తికెక్కిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?









meerannadi nooti ki notokka paallu … Nijame …
maree parakatanalaku kotlu enduku karchu avutaayi cheppandi …maree prabhutvanni duyyabattaniki kakapote….
matter nijame kanee… varshalu vachi panata nastapoyina govt varunadevudiki phone chesimare…. varsham kurisettu chesi.. janalanu nasanam cheisindi ante maree darunam ga vutundi kadandi…..
nastapariharam ivvalsindi… govt rules parakaram cheppinaprakaram panta pandinchinavallaku maatrame ani oka rule pedite … manam ilantivi chalavaraku arikattavachu…. vadunayana patti ippatike ekkvuayindi pandiste ..rate raadu anna sare labhaapekshato vestaru .. nastapotaru … govt ni duyyabadutaru… koddiga alochinchadi.. rayataniki chala vundi .. naa comment mee post kanna ekkuva vundi anni ikkdito aaputunna…
మీరు రాసింది నిజమే కానీ సగం మాత్రమే.కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చుకున్న ముఖ్యమంత్రి కి రేపటికి రానున్న ఓట్ల మీద ఆశ.నిజమే.మరి అంతఅన్యాయమైన ప్రకటను పైగా అబద్ధాల ప్రకటనను ముద్రించిన పత్రికల వారిది ఎలాంటి అశంటారు?పైగా ప్రధాన వార్త కు పైన ప్రచురించారు. చూశారా?ఎవరి స్వార్ధం వారిది ఇక్కడెవరూ ఉపయోగంలేని పనులు చేయరు.
రాజేంద్ర కుమార్ గారు,
ఇవ్వాళ పత్రికాధిపతులు చేస్తున్న పనులు, వాటి పర్యవసనాలపైన రాయాలంటే అదో పెద్ద కథ అవుతుంది. దాని గురించి మరో సారి మాట్లాడుకుందాం.
దిలీప్
దీనిలొ సగం మాత్రమే నిజం వుంది
వర్షాల వల్ల శ్రిశైలంప్రాజెక్ట్ లొకి35 నీరు వచింది లొ కి 35 tmc నీరు వచింది.
ఒకరిద్దరు మిత్రులు లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు…
1) అడ్వర్టైజ్మెంటుకు కోట్లు ఎందుకు అవుతాయి అని అడిగాడో మిత్రుడు. నేను ప్రకటనలకు కోట్లు తగలేస్తున్నారు అని రాస్తే దాని అర్థం ఈ ఒక్క ప్రకటనకే అని చదువుకుని అబ్బే అంతెందుకు అవుతుంది అని అంటే నేనేం చెప్పగలనింక? రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది ప్రకటనలకు పెట్టిన ఖర్చు దాదాపు 150 కోట్లన్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియ జేస్కుంటున్నాను.
2) ఏ సంఘటన జరిగినా దాని వల్ల లాభపడే ప్రజలు కొందరుంటారు. ప్రకృతి భీభత్సాల్లో కూడా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. నేనిక్కడ ప్రస్తావించింది అకాల వర్షాలు పడి ప్రజలు ఇక్కట్ట్లు పడే వేళ ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం ఉచితమేనా అని. మొన్నటి వానకు మా ఎండిపోయిన బావిలోకి ఎన్ని నీళ్లొచ్చాయి అనేది కాదు ఇక్కడ టాపిక్. దయచేసి గమనించగలరు.
దిలీప్
చాలా బాగా చెప్పారు దిలీప్ గారు. బొత్తిగా ప్రజల ధ్యాసే పట్టని రాజకీయనాయకులని ఏమనాలో అర్థం కాదు.