ఇప్పుడు మనందరం సాక్షులం!

saakshi newspaper

టీవీల్లో First Day First Show తరహా కార్యక్రమాలు చూసిన ప్రేరణతో ఇవ్వాళ మొదలైన “సాక్షి” పత్రిక తొలిరోజు సంచికపై నా అభిప్రాయం తెలియజేస్తున్నాను.

పేపర్ చేతిలోకి తీసుకోగానే నాకు అర్థమైన మొదటి విషయం ఇది కొంచెం “బరువైన” పత్రిక అని! ఇది మొదటి రోజు కాబట్టి ఇన్ని అనుబంధాలు ఇచ్చారో లేక ప్రతి రోజూ ఇలానే ఉండబోతుందో తెలియదు. రెండు రూపాయలకు ఇంత “బరువు” పత్రిక ఇస్తే చాలా మంది జనాలు పత్రికలో వార్తల కొరకు కాకపోయినా ఈ “బరువు” ప్రాతిపదికన పత్రికను కొంటారని ప్రచురణకర్తల ధీమా కాబోలు. మొత్తం 52 పేజీలు ఉన్నాయి ఆరంభ సంచికలో.

అన్ని పేజీలు రంగుల్లో అని ఈ పాటికే కొన్ని వందల హోర్డింగుల్లో చదివాం కదా. రంగుల పేజీలు కాబట్టి చూడడానికి కంటికి ఇంపుగానే కనిపిస్తుంది పత్రిక. ప్రధాన వార్తలతో పాటు మిగతా అన్ని పత్రికల్లాగే మహిళల పేజీ, సినిమా పేజీ, విద్య, ఉద్యోగాలకు కెరీర్ పేజీ, స్పోర్ట్స్ పేజీ వంటివి ఉన్నాయి.

రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్య నగరాల వాతావరణ వివరాలు, WoW Hyderabad వంటి పత్రికలో ఇచ్చే హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలు, పర్యాటక విశేషాలు, క్లబ్బులు, పబ్బుల వివరాలు, విమానాల వేళలు తెలుగు దినపత్రికల్లో కొత్త విషయం.

వార్తల క్వాలిటీ విషయానికి వస్తే తొలిరోజే దానిపై వ్యాఖ్యానించడం అంత సరికాదు అని నాకు అనిపించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలనుండి కొంచెం స్థాయి ఉన్న జర్నలిస్టులను (కార్టూనిస్టులతో సహా) చేర్చుకున్నాక వార్తల రిపోర్టింగ్ సహజంగానే బాగానే ఉంటుంది.

రేపటి నాడు పత్రిక ఎటువంటి పాలసీ అవలంభిస్తుందో తొలిరోజు వైయెస్ జగన్ రాసిన (ఆయన పేరిట రాసిన అనాలేమో) సంపాదకీయం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. తాము పత్రిక పెట్టిందే కొన్ని పత్రికల (ఈనాడు అని చదువుకోవాలి మనం) పక్షపాత వైఖరి వల్ల అని, తమ పత్రిక మంచి ప్రభుత్వానికి (అంటే నాన్న గారి పరిపాలన అని చెప్పనక్కరలేదనుకుంటా) మద్ధతుగా నిలుస్తుందని జగన్ గారు సూటిగానే చెప్పారు.

ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తివారీ నుంచి మొదలుకొని చిరంజీవి, నాగార్జున, సి.పి.ఐ. నారాయణ, సి.పి.ఎం రాఘవులు, ఎం.ఐ.ఎం. అసదుద్దీన్ ఓవైసి, బీ.జే.పీ కిషన్ రెడ్డి, పుల్లెల గోపీచంద్, భూమిక ఇలా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులంతా హాజరయ్యారు. వక్తల్లో అనేకులు సాక్షి పత్రిక “నిష్పక్షపాతంగా” ఉండాలని ఆకాంక్షించారు (ఇంకేం చెయ్యగలరు పాపం)

ఇక పత్రికలో ఉన్న ప్రభుత్వ ప్రకటనల చిట్టా చూడండి:

1) వ్యవసాయ శాఖ – 2 ఫుల్ పేజీలు
2) పర్యాటక శాఖ – 1 ఫుల్ పేజీ
3) ఆర్టిసీ – 1/4 పేజీ
4) రవాణా శాఖ – 1/2 పేజీ
5) గ్రామీణాభివృద్ధి శాఖ – 1/4 పేజీ
6) శిల్పారామం – 1/4 పేజీ
7) పౌర సరఫరాల శాఖ – 1/6 పేజీ
8 ) హుడా – 1/6 పేజీ
9) కుటుంబ సంక్షేమ శాఖ – 1/6 పేజీ
10) ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి – 1/6 పేజీ
11) గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య శాఖ – 1/6 పేజీ
12) ఆం.ప్ర పారిశ్రామిక మౌళిక వసతుల శాఖ – 1/4 పేజీ

రేపటి నాడీ సాక్షి పత్రిక కాంగ్రెస్ ప్రభుత్వ మద్ధతుతో పార్టీ ప్రచార కరపత్రం అయ్యే సూచనలు, సంకేతాలు తొలిరోజు పత్రిక చూస్తేనే అర్థమవుతున్నాయి.  

సుమారు 500 కోట్ల పెట్టుబడితో సాక్షి పత్రికను స్థాపించారని వార్తలు వినవస్తున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పుత్ర రత్నం ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. ఒక ఉక్కు ఫ్యాక్టరీ, ఒక వార్తాపత్రిక, ఒక టీవీ చానెల్ ఇలా వేల కోట్ల రూపాయల సంస్థలను స్థాపిస్తూ పోతున్న వైనం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. 

ప్రజలేమనుకుంటారో అన్న కనీసపు భావన లేకుండా సిగ్గూ ఎగ్గూ లేకుండా రాష్ట్రంలో నడుస్తున్న దోపిడీ పాలనలో మరో మల్టీ కలర్ మజిలీకి ఇప్పుడు మనందరం సాక్షులం!

20 స్పందనలు నుండి “ఇప్పుడు మనందరం సాక్షులం!” కు


  1. 1 gsnaveen 11:26 పూర్వాహ్నం వద్ద మార్చి 24, 2008

    పొద్దున్న నుంచి ఎవరు దీని గురించి బ్లాగుతారా అని ఎదురు చూశాను. ఆన్లయిన్ వర్షన్ కోసం కూడా తెగ వెతికాను. కానీ దొరకలేదు. ఫోటోతో సహా వ్రాసిన మీ సమీక్ష చాలా బాగుంది. ఈ రోజు పొద్దున్న మా ఊర్లో బస్సెక్కేటప్పుడు షాపోణ్ణడిగా ఏది ఎట్లున్నాయ్ పత్రికల సేల్స్ అని. షరా మామూలుగా ఈనాడు మొదటి గంటలోనే ఖాళీ అని చెప్పాడు. మొత్తానికి సాక్షి 2రూ దెబ్బకు “ఆ రెండు పత్రికలూ” ఎలా కాచుకుంటాయో చూడాలి.

    - నవీన్ గార్ల
    (http://gsnaveen.wordpress.com)

  2. 2 సిరిసిరిమువ్వ 2:39 అపరాహ్నం వద్ద మార్చి 24, 2008

    మీ సమీక్ష బాగుంది.అసలు పత్రిక ఎలా ఉంటుందో చూద్దామన్న ఆసక్తితో పేపరు వేయమని చెపితే నిన్న జోరు వానలో శాంపిలు పేపరు వేసారు కానీ ఇవాళ అసలు పేపరు వేయలేదు, అదేమని ఫోను చేస్తే వాతావరణం బాగోలేదు కదా అందుకని వేయలేదు అని సమాధానం వచ్చింది :)

  3. 3 radhika 5:33 అపరాహ్నం వద్ద మార్చి 24, 2008

    సాక్షి ఎలా వుంటుందో అన్న కుతూహలం తో పోర్టల్స్ అది తెగ వెతికాను.ఎవ్వరూ దీని గురించి రాయలేదు.మన బ్లాగరులు ఎవరన్నా దీని గురించి రాసారా అని వెతుకుతూ వుంటే ఇది కనిపించింది.నెనర్లు.

  4. 4 subbarao 6:16 అపరాహ్నం వద్ద మార్చి 24, 2008

    Eenadu first day free gaa iste Kakinada lo chadevaanu.

    Vaartha ni Delhi veluthu vijayawada station lo koni chadevaa

    America lo Saakshi print edition chadeve chance missayyanu,

    kaani enduko aaa thrill miss aina feeling ledu.

    it is too early to judge,but iam not surprised if it turns

    out to be the voice of Congress party.

    my father was only an editor of a paper.

    i wish i were the son of a small minister in the present gov. i’d have made enough money to start a small TV channel with a 100 crore and a small 40 page news paper with petty cash of a 500 crore.

    remember, the NTR gov.started a news paper, the agents did not sell it to the customers, they made more money selling it by kilos to the old paper shops than the commission they got.

  5. 5 రాజేంద్ర 6:34 పూర్వాహ్నం వద్ద మార్చి 25, 2008

    నేను ఒక చిన్న పరిచయవ్యాసం రాస్తున్నా సాక్షి దినపత్రిక మీద

  6. 6 gsnaveen 7:04 పూర్వాహ్నం వద్ద మార్చి 25, 2008

    మీరు చెప్పింది నిజమేనండోయ్…రెండో రోజే మొదలుపెట్టారు:
    http://epaper.sakshi.com/epaperimages/2532008/2532008-SH-HYD-3/D26697052.JPG

    ఇది మూడో పేజీలో మంత్రుల ఫోటోలతో సహా ప్రచురించాల్సిన వార్తా?

    ఏ అన్యాయం గురించో, ప్రజలకు ఉపయోగపడే సమాచారమో వ్రాస్తే ప్రచురించిన ఆ స్థలానికి ఓ సార్థకత. ఏంటో..ఈ పత్రికలు రాజకీయ పార్టీల్లా తయారౌతున్నాయ్.

  7. 7 రాకేశ్వర రావు 6:43 అపరాహ్నం వద్ద మార్చి 26, 2008

    ఇంతకన్నా విచ్చలవిడిగా ఎవరైనా వ్రాసుకోగలరా ??
    దీన్ని ప్రజలు తిరస్కరిస్తారని ఆశిస్తున్నాను. వారు తిరస్కరించకపోతే, మనుషుల మీదే నాకు నమ్మకం పోయేడట్టుంది :)

  8. 8 Prasanthi 1:53 అపరాహ్నం వద్ద మార్చి 28, 2008

    ప్రజల అభిప్రాయాలు ఎవరు అడిగారు. ఒకవేళ చెప్పినా ఎవరు విలువిచ్చారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు – తోలు మందం రాజకీయం.

  9. 9 నాగరాజు 6:17 అపరాహ్నం వద్ద మార్చి 29, 2008

    దిలీప్,
    పత్రిక మాటెలా ఉన్నా – మీరు చూపించిన ప్రకటన వివరాలు చూస్తుంటే తల తిరుగుతోంది. అయితే, వీళ్ళ రెవెన్యూ అంతా ప్రభుత్వ ఖజానానుంచే అందుతుందోదన్నమాటేగా. ఇదోరకం లీగల్ దోపిడి గాబోలు. ఈ పత్రికలో ప్రకటన్లకి రేట్లెలా ఉంటాయో? ఆ ప్రభుత్వ శాఖలకి ఈ ప్రకటనలివ్వాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు ఈ శాఖలు ఇంకే పత్రికలోనైనా ప్రకటనలు ఇచ్చాయా? ప్రజాస్వామ్యం పేరుతో టోటల్‌టేరియన్ రెజైమ్లో ఉన్నాం కదా?
    నాగరాజు

  10. 10 babu 7:58 పూర్వాహ్నం వద్ద మార్చి 30, 2008

    A True story
    twenty years ago two people were friends one was an engineer and the other was a small time street political worker. The Engineer is working in a Private organisation with 30000 salary. The other friend is worth a few hundred crores. Most of the current crore pathis in AP today are college dropouts Where corruption, inhuman nature and goondaism are considered as virtues.Nothing can be done now.

  11. 11 Sujatha 9:51 పూర్వాహ్నం వద్ద మార్చి 30, 2008

    వాళ్ళూ బహిరంగంగా చెప్పాక, ఇంకా ఎవరి తిరస్కరణతో వాళ్ళకు పనేముంది చెప్పండి? టివిలో వస్తున్న ప్రొమోలు చూసారా ఎంతెంత పొడుగు ఉన్నాయో? నిన్న కొత్త ప్రొమో చూశాను. పొద్దున్నే పేపర్ బాయ్ ‘చేతితో’ తలుపు తట్టి పేపర్ అందిస్తాడని ‘చెయ్యి ‘ ని క్లోజప్ లో రెండు మూడు సెకన్లు చూపించారు. ఐనా సాక్షి గురించి పార్టీ పత్రికగా తప్పించి జనంలో పెద్ద ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయంటారా!

    ఇంకా ఎవరన్నా సాక్షి గురించి రాయాలండీ! నేను రాయడానికి బెంగుళూరులో మిగతా చోట్ల ఎమో గానీ, మా బన్నేరు ఘట్ట రోడ్ లో సాక్షి దొరకడం లేదు.

  12. 12 JALLIPALLIK KRISHNA RAO 3:16 అపరాహ్నం వద్ద మార్చి 30, 2008

    సాక్షి బాగానే ఉంది. అమ్ముకుంటే 2.50 వస్తుంది కిలోల లెక్కన.

  13. 13 తాడేపల్లి 4:49 పూర్వాహ్నం వద్ద మార్చి 31, 2008

    ఎవరేమనుకున్నా సరే ! “సాక్షి” నిజమైన ప్రజాపత్రిక. ఎందుకంటే దాన్ని అక్షరాలా ౬౦౦ కోట్ల రూపాయల తెలుఁగు ప్రజాధనంతో స్థాపించారని అనుమానించడానికి నిండా అవకాశం ఉంది.

  14. 14 తాడేపల్లి 4:53 పూర్వాహ్నం వద్ద మార్చి 31, 2008

    మఱొక విషయం “సాక్షి” కాంగ్రెస్ పార్టీ పత్రిక అంటూ అవమానించడాన్ని నేను నిర్ ద్వంద్వంగా ఖండిస్తున్నాను అది పదహారణాల వై.ఎస్. కుటుంబపత్రిక మాత్రమే.

  15. 15 Dil 9:09 పూర్వాహ్నం వద్ద మార్చి 31, 2008

    నేటి ఉదయం అసెంబ్లీలో బాబుగారు ఇలా అన్నారు అని “ఈనాడు” రాసింది.

    సాక్షి పత్రికకు మొదటి రోజే ప్రకటనలా: బాబు

    హైదరాబాద్‌, మార్చి 31 : పుట్టుకతోనే ధనవంతుడినని చెబుతున్న ముఖ్యమంత్రి ఆదాయం 2003-04లో ఆయన సమర్పించిన లెక్కల ప్రకారమే కుటుంబసభ్యులందరిదీ కలిపి 26.59 లక్షలని చంద్రబాబు నాయుడు అన్నారు. వారి ఆస్తుల విలువ 3.52 కోట్లు అని వారు పేర్కొన్నారని అన్నారు. అలాంటివారు సాక్షి పత్రికను ఏ ఆస్తులతో పెట్టారని అన్నారు. ఆ పత్రికను రెండు రూపాయలకే అమ్ముతున్నారని ఆ ప్రకారం సాక్షి పత్రిక రోజువారి నష్టం 1.70 కోట్లు అని దాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. దేశంలోనే మొదటిసారిగా ఓ ముఖ్యమంత్రి పేపర్‌ పెట్టారని పైగా మొదటిరోజే దానికి ప్రకటనలు ఇచ్చారని దీన్ని ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. వై.ఎస్‌ జగన్‌కు 40 కోట్ల ఆస్తి ఉందని వై.ఎస్‌ అన్నారని దీనికి 12 కోట్ల పన్ను కట్టాలని మరి కట్టారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటంబానికి 13 కంపెనీల్లో బినామీ పేర్లతో భాగస్వామ్యం ఉందని, ఆ నల్లడబ్బును బయటకు తీసేందుకే పత్రిక పెట్టారని ఆరోపించారు.

  16. 16 నేనుసైతం 11:14 పూర్వాహ్నం వద్ద మార్చి 31, 2008

    తాడేపల్లి వారు చెప్పింది అక్షర సత్యం. సాక్షి మనందరి పత్రిక. నిజమైన ప్రజా పత్రిక.యావత్ తెలుగు ప్రజలూ ఇందులో భాగస్వాములే.ప్రతి తెలుగు వారిని పత్రికలు,సిమెంటు,స్టీలు మరెన్నో పరిశ్రమలలో పెట్టుబడి దారులని చేసిన రాజీవ్ శేఖర్ రెడ్డి అభినందనీయుడు.జై సొనియా, జై రాహుల్, జై ప్రియాంక, జై???….
    -నేనుసైతం

  17. 17 రాజేంద్ర 12:20 అపరాహ్నం వద్ద మార్చి 31, 2008

    అవును అవినీతి,అక్రమసంపాదనల గురించి మాట్లాడాలంటే చంద్రబాబంత సమర్ధుడు ఎవరున్నారు??

  18. 18 జ్యోతి 6:08 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 1, 2008

    ఇప్పుడూ అసలు రంగు బయటపడింది. సాక్షి చూడడానికి నీటుగా, ముద్దుగా ఉంది, బోల్డు పేజీలతో. ఆదివారమైతే 34+44 పేజిలు. వారం ఐనా ఒక్క వార్త కూడా చదవాలనిపించలేదు.ఇది ప్రజల డబ్బుతో నడుస్తున్న కాంగ్రేసు పత్రిక అనుకుంటూ. చూద్దాం దీని అసలు బాగోతం ఎప్పుదు మొదలవుతుందో అని. అది ఈరోజు జరిగింది. చంద్రబాబు నిన్న అసెంబ్లీలో మొత్తుకున్నది మామూలు వార్తలా వేసారు, పైగా వై ఎస్ ఆర్ నవ్వుతున్నాడని బాబు ఏడుస్తున్నట్టు కార్టూన్.మిగిలింది రామోజిరావు. అతని కారు ఒక స్కూటరిస్టును ఢీ కొట్టిందని సగం పేజి న్యూస్ పెద్ద పెద్ద ఫోటోలతో.

    ముందు ముందు ఇలాంటివి మామూలే కదా..
    తమాషా చూద్దాం…

  19. 19 Naveen 8:53 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 2, 2008

    Are guys are against to Sakshi or biased to Eeenadu. In India every politician is the same. What about heritage foods, Matrix Laboratories, Ramoji Film City. Do you guys have answers to those then you will get answers to Brahmini Steals and Sakshi

    Every one is the same ……. No difference


  1. 1 పొద్దు » Blog Archive » మార్చి పోస్టుల మార్చిపాస్టు 2:44 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 1, 2008 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,704 సందర్శకులు