Archive for జనవరి, 2008

మదించిన దున్నపోతుల స్వైరవిహారం

1991లో ఆర్ధిక సరళీకరణ జరిగిన కొత్తల్లో స్టాక్ మార్కెట్ మధ్య తరగతి ప్రజలకు ఒక చక్కటి మదుపు సాధనం. తదనంతర కాలంలో కొద్దిమంది బడా వ్యక్తులు, సంస్థల చేతిలో అది బందీ అయిపోయింది. అమెరికా లాంటి దేశాల్లో వడ్డీ రేట్లు పెద్దగా లేని కారణంగా అనేకమంది విదేశీయులు మన స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఈ మధ్య వ్యవహారం తారాస్థాయికి చేరింది. అమెరికన్ డాలర్ విలువ రోజు రోజుకీ పడిపోతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) కోట్ల డాలర్లను మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే వాళ్లు చాలా సిస్టమాటిక్ గా చేస్తున్న ఒక మోసం వల్ల మన దేశపు సంపద మెల్లగా తీరాలు దాటుతోంది.

చదవుట కొనసాగించు ‘మదించిన దున్నపోతుల స్వైరవిహారం’

విఫల స్మరణలు

 2007 సంవత్సరాన్ని విశ్లేషిస్తూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఇటీవలే పదవీ విరమణ చేసిన కె. రామచంద్ర మూర్తి గారు రాసిన ఈ చక్కని వ్యాసం నాకెంతో నచ్చింది. ఇది మీరూ తప్పక చదవాలి.

—- చదవుట కొనసాగించు ‘విఫల స్మరణలు’

రాజకీయమా వీరాభిమానమా?

అసలే సినిమావాళ్లు ఆపై రాజకీయాలు, ఇక పరిస్థితులు మరోలా ఎందుకు ఉంటాయి?

మన “ఫ్యాన్స్” సినిమా విడుదల రోజు చేసే పాలాభిషేకాలూ, కట్టే కటౌట్లు, బ్యానర్లు  చూస్తే అసలు వీళ్లు తమకొరకు, తమవాళ్ల కొరకు ఎప్పుడైనా ఇంత కష్టపడ్డారా అనిపించక మానదు. సరే సరిగా చదువుకోని వాళ్లే ఇలా చేస్తారనుకోవడానికీ లేదు. అమెరికాలో ఉన్న మన వారు ఇంటర్నెట్ సినిమా చర్చా వేదికల్లో కొట్టుకు చచ్చేతీరు, వాడే భాష చూసి మనకు ఈ మొత్తం సినిమాల పైనే విరక్తి కలగడం ఖాయం. దీనికి తోడు చిరంజీవి, బాలకృష్ణల ఫ్యాన్స్ మధ్య వైరం వెర్రితలలు వేసి కుల రంగు పులుముకుని నానా చండాలంగా తయారైంది. ఇప్పుడు చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం దాదాపుగా ఖరారు అవడంతో పరిష్తితి ఇంకా ఉద్రిక్తంగా తయారైంది.

చదవుట కొనసాగించు ‘రాజకీయమా వీరాభిమానమా?’

చింత తెలంగాణకు, నీళ్లు డెల్టాకు

 ”సమైక్యాంధ్రలో రెండు ప్రాజెక్టుల కథ!”  పోస్టుకు కొనసాగింపు ఇది.

వైజా సత్య గారూ,

సామరస్యంగా మంచి చర్చకు ఆస్కారం కల్పించినందుకు కృతజ్ఞతలు. తెలంగాణా గురించి చర్చ జరిగే ప్రతి సందర్భంలోనూ వెలుతురు కన్నా వేడి ఎక్కువ పుడుతుంది, అందుకే కీలకాంశాలు మరుగున పడిపోతాయి.

తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడానికి నా అవగాహనలో ఉన్న కారణాలు ఇవి:

1) కృష్ణా, గోదావరి నదులు రెండూ తెలంగాణా ప్రాంతంలో చాలా దూరం ప్రయాణం చేశాకనే ఆంధ్రలో ప్రవేశిస్తాయి. తెలంగాణాలో కనుక వీటిపై భారీ ప్రాజెక్టులు కడితే తమకు నీటి కొరత ఏర్పడుతుందేమోనని డెల్టా వాసుల భయం. అందువల్లనే ప్రభుత్వాలు తెలంగాణా ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపకపోవడం, చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా దశాబ్దాల తరబడి ఆ ప్రాజెక్టుల్ని మూలన పడేయడం జరుగుతోంది. అయితే ఈ భయం హేతురహితమైనది అని నా అభిప్రాయం ఎందుకంటే ప్రతీ యేటా మనం సముద్రం పాలు చేస్తున్న నీరు మనం వాడుకుంటున్న నీటికి పదిరెట్లు ఉంది.

చదవుట కొనసాగించు ‘చింత తెలంగాణకు, నీళ్లు డెల్టాకు’

తరువాతి కాగితం »


ముఖచిత్రం: తంగేడు పువ్వులు - దక్షిణ భారత దేశమంతటా కనిపించే తంగేడు చెట్టు కు [Cassia Auriculata] తెలంగాణా ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దసరాకు ముందొచ్చే బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వులను ఎక్కువగా వాడుతారు. ఇక తంగేడు చెట్టులో ఇతర భాగాలు కూడా ఎంతో ఉపయోగపడుతాయి. తంగేడు పుల్లలు పళ్లు తోముకోవడానికి, ఆకులు పచ్చి రొట్ట ఎరువుగా, కొమ్మలు వంట చెరకుగా ఉపయోగిస్తారు. తంగేడు చెట్టు బెరడును తోళ్ల శుద్ధి పరిశ్రమలో విస్తృతంగా వాడుతారు. అంతే కాదు ఆయుర్వేదంలో ఈ చెట్టు వేర్లతో, ఆకులతో ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తారు.

Polepally SEZ

polepally public hearing

polepally public hearing 076

polepally public hearing 071

polepally public hearing 067

polepally public hearing 061

More Photos

గణాంకాలు

  • 26,247 సందర్శకులు