మన అభివృద్ధి అగ్రహారాల దాకా వచ్చింది

నిన్న డక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన ఈ వార్త చదవండి (కింద). మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలో 1200 ఎకరాల్లో బ్రాహ్మణుల కొరకు ప్రత్యేకంగా “ధన్వంతరి అగ్రహారం” అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మించనున్నారనే వార్త మన సమాజం ఎటువైపు పయనిస్తున్నదో చెబుతోంది. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడచినా ఇంకా కుల రక్కసి జడలు విప్పి నృత్యం చేస్తూనే ఉంది. కుల వివక్ష అనేక రూపాల్లో కొనసాగుతూనే ఉంది. పైకి మేడి పండులా ఆర్ద్జిక “అభివృద్ధి” సాధిస్తున్నట్టు కనపడుతున్న మన దేశం వాస్తవానికి రోజు రోజుకీ సామాజికంగా దిగజారుతోంది.

కొత్త అభివృద్ధి నమూనా ఇప్పటికే కలిగిన వారి కొరకు “గేటెడ్ కమ్యూనిటీ” లు నిర్మించుకునే సౌకర్యం కలిపిస్తే ఇప్పుడు ఏకంగా కులానికో కాలనీ పధకం మొదలవుతోంది.

—————- 

Top class Brahmin colony cast in Medak 
  
Hyderabad, Nov. 26: A group of eminent Brahmins are setting up a 1,200-acre colony for the community in Siddipet of Medak district to resurrect the old Agraharam ambience. They include senior IAS, IPS, IFS and IRTS officers and journalists from the community. The Brahmin colony has been named Dhanwantari Agraharam and will have modern amenities including engineering and medical college, a super-specialty hospital, super markets, temples and an exclusive hall for rituals.

This is the first ‘caste-based’ mega real estate venture in and around Hyderabad. In olden days kings and rulers used to donate lands to Brahmins to set up Agraharams. Similarly, the new venture is meant to bring Brahmins scattered all over the city to one colony to create “mutual understanding”. The ambitious project, being taken up by Dhanwantri Foundation International, will be ready in two years’ time. Plots have been allotted and construction will begin on the auspicious Pongal day in mid-January next year. The foundation has purchased 180 acres of land near Jadcherla in Mahbubnagar district and 1,200 acres near Siddipet with funds contributed by about 1,000 members.

Plots are being sold at Rs 150 a square yard as against the normal market value of Rs 1,500. Dr P. Kamalakara Sarma, managing trustee of the foundation, refused to divulge more about the project. “I am busy with my patients,” he said when contacted. However, his message on the foundation’s website says that the vote bank-based democracy of India had led the Brahmins to a pathetic situation, irrespective of their position. “The feeling of ego and so-called intellect has not allowed the community to function as a systematic organisation leaving individuals to suffer,” he further adds.

Despite the tall talk, poor Brahmins seem to have no place in this modern Agraharam. The 504 governing council members of the foundation will get land ranging between one and three acres and 400 donor members will get 1,000 square yards each. A senior IPS officer, who is on the board of trustees, said he had been briefed about the project though he did not buy a plot.

8 స్పందనలు నుండి “మన అభివృద్ధి అగ్రహారాల దాకా వచ్చింది” కు


  1. 1 వికటకవి 2:05 అపరాహ్నం వద్ద నవంబరు 28, 2007

    ఇందులో కొత్తేముంది. ఎన్నెన్ని కాలేజీలు, పెళ్ళి మండపాలు కులాల ప్రాతిపదికపై లేవు. నా బాధల్లా, రేప్పొద్దున ఏదో కుల ప్రాతిపదికన గొడవలైతే, ఒకర్నొకరు కొట్టుకుచావటానికి మరింత అందుబాటులో ఉంటాయి.(ఫలానా కులం వాడు ఎక్కడున్నాడో వెతకనక్కర్లా):-)

  2. 2 Budaraju Aswin 4:53 అపరాహ్నం వద్ద నవంబరు 28, 2007

    మీకు బెజవాడ తెలియదా ….

  3. 3 T.L.Bla Subrahmanyam 5:20 అపరాహ్నం వద్ద నవంబరు 28, 2007

    బ్రాహ్మణుల కోసం ఒక వెంచర్ ప్రారంభం కావడం ముదావహం. నిజానికి ఇలాంటివి చాలా అవసరం. నేనుంటున్న అపార్ట్‌మెంట్‌లో అందరూ అబ్రాహ్మణులే. అందరూ మద్యమాంస ఘనాపాఠీలే. రోజూ దుర్భరమైన చికెన్ మటన్ కోడిగుడ్డు వాసనల మధ్య నేను పూజా పారాయణా జపం హోమం చేసుకునే గతిపట్టింది. ఈ వార్త తెలియజేసినందుకు నెనర్లు.

    కులరక్కసి అంటారెందుకు ? కులం మన ఇండియన్ యూనియన్‌లో ఒక రాజ్యాంగబద్ధమైన, ప్రభుత్వ ఆమోదం కలిగిన, వ్యవస్థాపరమైన గుర్తింపు కలిగిన, అందరికీ ప్రీతిపాత్రమైన ఆత్మీయతాభావమైతే ?

  4. 4 ramarajubhaskar 6:04 అపరాహ్నం వద్ద నవంబరు 28, 2007

    ఇందులో అంత ఆశ్చర్యం దేనికి? మిగతావాళ్ళు కట్టుకున్నప్పుడు మీరు ఆశ్చర్య పోలేదా? లేక అబ్బో బాపనోళ్ళుకూడా కట్టుకుంటున్నారని సెటైరా? ప్రతీవాళ్ళాకీ బ్రాహ్మణులు అంటే అలుసైపోఇంది. Please dont get me wrong (I am not putting this question to you, this is to all).

  5. 5 Dil 10:02 పూర్వాహ్నం వద్ద నవంబరు 29, 2007

    వికటకవి, భాస్కర్ గారికి,

    ఒక కులం వారి ఇళ్లు ఒకే ప్రాంతంలో ఉండటం ఇదే మొదటి సారి జరగడం లేదని తెలుసు. హైదరాబాద్ లో కనీసం మూడు చోట్ల వైశ్య కులస్థులు వాసవి కాలనీలు నిర్మించుకున్నారు. అలాగే ఒకటి రెండు ఇతర కులాల పేర్లతో కాలనీలు ఉన్నాయి. ఇక్కడ తేడా ఏమిటంటే ఈ “అగ్రహారం” లో ప్లాట్లు కొనుక్కోవడానికి కేవలం బ్రాహ్మణులకే అర్హత ఉందనడం. ఇక బ్రాహ్మణులంటే నాకు ప్రత్యేక దృష్టి ఏమీ లేదు. ఇదే పని ఏ ఇతర కులం వాళ్లు చేసినా నా ప్రతిస్పందన ఇలాగే ఉండేది.

    అశ్విన్ గారు,

    విజయవాడ లో పరిస్థితి ఏమిటో నిజంగానే తెలియదు నాకు…

    బాల సుబ్రహ్మణ్యం గారు,

    మీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. కానీ దానికి పరిష్కారం ఇలా కులాల వారీగా కాలనీలు కట్టుకోవడం కాదనుకుంటా?
    (అన్నట్టు మీ కామెంట్ రెండు సార్లు వచ్చింది. ఒకదాన్ని డిలీట్ చేశా)

  6. 6 Sudhakar 2:52 పూర్వాహ్నం వద్ద డిసెంబరు 1, 2007

    ఈ దౌర్భాగ్యం ఎప్పటి నుంచో వున్నదే. తాడేపల్లి గారు చెప్పినట్లు కాకపోయినా మనకు నచ్చిన వారి పక్కనే ఇల్లు కొనుక్కోవటం తప్పు లేదు. అయితే ఇలా కులకంపు కోలనీలు వెలిసే సంస్కృతి మాత్రం అసహ్యకరం. ప్రభుత్వం ఇవి ఎంత తొందరగా నిషేధిస్తే అంత మంచిది. అలానే ఈ గర్జనలు గట్రా ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి.

    విచిత్రమేమిటంటే మన దేశంలో కాస్త బలంగా వున్న వర్గాలే ఈ గర్జనలు గట్రా చెయ్యగలిగేది. కేవలం వేల సంఖ్యలో వున్న కులాల అతీ గతీ ఎవడికీ లేదు. వారూ ఈ కులాల మీద అధారపడి ముష్టి అడుక్కోవటం మర్చిపోయి చాలా రోజులే అయ్యింది.

    మన దేశంలో, అదీ మన స్వర్ణాంధ్ర భారతంలో రైతు తప్పితే అందరూ రకరకాల కులస్తులే. వారికి అదే వూపిరి…అదే చావు.

  7. 7 చదువరి 2:00 అపరాహ్నం వద్ద డిసెంబరు 2, 2007

    కమ్మవారి వనభోజనాలు, రెడ్డి బంధువుల సేవా సంఘం, కాపునాడు.. ఈమధ్య కులాల పేరిట ఇలా సామూహిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి; దాదాపుగా అన్ని కులాలవారూ జరుపుతున్నారు. అగ్రహార ప్రతిపాదన కూడా అలాంటిదే కదా!? అవన్నీ ఎంత సమర్ధనీయమో ఇదీ అంతే!

    సినిమాలు, రాజకీయాలు, వ్యాపారాలతో సహా సమాజంలోని ప్రతీదీ కులమయమై పోయింది. బహుశా ప్రజల్లోని అభద్రతా భావమో, కులాన్ని సొమ్ము చేసుకోవాలనే కొందరి స్వార్థమో (లేక రెండూనో) మనలనీ కులం పేరిట సంఘటితం చేస్తున్నాయి.

  8. 8 రాజ మల్లేశ్వర్ 2:15 అపరాహ్నం వద్ద డిసెంబరు 3, 2007

    ఇందులో ఇంత ఆశ్చర్యము, అసహనము చూపించాల్సిన దేంటో నాకర్ధం కావట్లా..! జపానోడో అమెరికోడో ఆశ్చర్యపడి బుర్ర గోక్కున్నట్టు…!!
    ఇంకా మన భారతం లో కులమనేది రోజువారీ వ్యవహార మేకదా..!! వోట్ల దగ్గర నించీ కులపతుల నియామకాల దాకా..! మీ రేదన్నా బాధ పడితే దీనికి బాధ పడండి. కాస్త చెప్పుకోడానికయినా బావుంటుంది… !!

    ఏమైనా… ఈ ఏడుపు నాకు నచ్చలా…!!!


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,704 సందర్శకులు