పుట్టబాబా విశ్వ విరాట్ దర్శనం అట్టర్ ఫ్లాప్!

సత్యనారాయణ రాజు ఉరఫ్ పుట్టబాబా లేటెస్ట్ గారడీ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రునిలో “విశ్వరూపం” చూపిస్తానని డంబాలు పలికిన సదరు బాబాగారు విశ్వరూపం కాదుగదా అసలు ఉత్తి చంద్రున్నే చూపలేకపోయాడట. సాయంత్రం నుండీ బ్రేకింగ్ న్యూస్ అంటూ న్యూస్ చానెళ్లు ఊదరగొట్టాయి. బాబా మాటలు విని పోలోమని పుట్టపర్తి విమానాశ్రయానికి తండోపతండాలుగా తరలివెళ్లిన భక్తజనకోటికి సహజంగానే నిరాశే మిగిలింది.

టెలివిజన్ చానెళ్ల వీడియో కనులకు  తన “మాయలు” చిక్కడం మొదలయ్యాక గాల్లోంచి బంగారు గొలుసులూ, శివలింగాలూ సృష్టించడం బాగా తగ్గించాడు మన బాబా. భక్తులను అలరించేందుకు మరోసారి ఈ కొత్త గారడీ ప్రదర్శనకు రంగం సిద్ధం చేసుకున్నాడు. కానీ చివరి నిముషంలో కారుమబ్బులు అడ్డుపడడంతో కథ అడ్డం తిరిగింది.

అయినా మబ్బులు అడ్డం రాకుండా చేయలేని బాబా చంద్రునిలో ఎలా కనపడతాడు? ఇప్పుడంత అర్జెంటుగా చంద్రునిలో కనపడాల్సిన అవసరం ఏం వచ్చింది? వంటి లాజికల్ ప్రశ్నలు మనకే కానీ పాపం “అమాయక” బాబా భక్తులకు తట్టనే తట్టవు.

11 స్పందనలు నుండి “పుట్టబాబా విశ్వ విరాట్ దర్శనం అట్టర్ ఫ్లాప్!” కు


  1. 1 నెటిజన్ 6:00 అపరాహ్నం వద్ద అక్టోబర్ 4, 2007

    భలే వారే మీరు!
    అన్ని టీ.వీలలోను “బాబా” ని దర్శించలేదా మీరు?
    అది “విశ్వసనీయ విశ్వదర్శనం” కాదా?
    ఈ హేతువాదుల మూర్ఖత్వమే, బంగాళాఖాతంలో అల్పద్రోణికి కారణమై, పుట్టపర్తిలో ఆకసం మేఘావ్రుత్తమైనది.
    పచ్చ కామెర్ల వారికి ప్రపంచం అంతా పచ్చగానే కనబడూతుందంట!
    కళ్ళు పెట్టుకుని మనసునిండా వారిని తలవండి.
    మీ జ్ఞాననేత్రంతో వారిని దర్శించగలరు!

  2. 2 చదువరి 6:01 అపరాహ్నం వద్ద అక్టోబర్ 4, 2007

    :) విశ్వరూపాన్ని చూపించేవాడు చంద్రునిలోనే ఎందుకో.. అ రోడ్డు మీదే చూపించొచ్చుగదా!
    ఈ ప్రహసనం ఇలా ఉంటే.. టీవీ9 వాడు ఓ భక్తుణ్ణి టెలి ఇంటర్వ్యూ చేసాడు. ఆయన “బాబా విశ్వరూపం చూపించేసాడు, అంచేతనే టీవీ చానెళ్ళన్నీ బాబానే చూపిస్తున్నాయి” అన్నాడు. (కిందపడ్డా నాదే పైచేయి అన్నట్టు.) మొత్తమ్మీద బాబాకి మంచి టెలిఫుటేజీ దొరికింది.

  3. 4 సుధాకర్ 7:38 అపరాహ్నం వద్ద అక్టోబర్ 4, 2007

    ఎంతకు తెగిస్తున్నారు ఈ బాబాలు. చంద్రుడిలో దేవుడు కనిపిస్తే, చంద్రుని మీద కాలెట్టిన వాడినేమనాలి? దైవ సన్నిధి చేరిపోయినట్లా…అసలు ఈ బాబా కి విశ్వం మీద ఒక పరీక్ష పెట్టాలి. పైన చెప్పినలాంటు మూర్ఖ భక్త శిఖామణులు పెరిగితే ఇక నాలుక మీద నాకాన్ని చూపించవచ్చు…

    నా దగ్గరకు వస్తే నరకాన్ని కూడా చూపిస్తా…హైదరాబాదు రోద్ల మీద…బాబాని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు కూడా కనిపించవచ్చు ఒక పది కిలోమీటర్లు ఈ రోడ్ల మీద బైకు నడిపితే…

  4. 5 రానారె 9:41 అపరాహ్నం వద్ద అక్టోబర్ 4, 2007

    గారడీవాడైనా మాయలవాడైనా, దేశవిదేశాలనుండీ చేరుతున్న భక్తుల పరపతిని చాలావరకూ ప్రజాసేవకు ఉపయోగిస్తున్న బాబాయే నయం. ప్రజాసేవకులమని చెప్పుకొంటున్న రాజకీయ వ్యాపారులకంటే, సమానత్వం పేరుచెబుతూ మానవత్వాన్ని మరచిన మావోయిస్టులకంటే ఇతగాడేమీ హానికరం కాదని నా ఉద్దేశం.

  5. 6 నెటిజన్ 2:26 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 5, 2007

    ఐతే మన “రాజీవశేఖరుడు” కి చెప్పి, ప్రతి మండల కార్యాలయమ్ లో పరిధిలోను ఒక ౧౦౦ ఎకరాలు ఉచితమ్‌గా ఇవ్వమందాం.
    అందులో ఒక బాబా / స్వామిని పోషించమందాం!
    వోట్లు,నోట్లు, “దేశవిదేశాలనుండీ చేరుతున్న భక్తుల పరపతిని చాలావరకూ ప్రజాసేవకు ఉపయోగి”ంచుకోవచ్చు.
    ఉచితంగా?
    ఏమంటారు?

  6. 7 విశ్వనాధ్ 6:58 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 5, 2007

    రాజీవశేకరునికి అప్పజెపితే బాబాలు స్వామీజీలు పుట్టరు.
    {పెనంలోచి పొయ్యిలో పడ్డట్టుగా}

    ఫాదర్స్ పుడతారు “ఆమెన్” అనుకొంటూ…

    సోనియాజీ,కాంగ్రెసుల మద్దతుకూడా పుడుతుంది వాళ్ళకు.

  7. 8 kranti 1:22 అపరాహ్నం వద్ద అక్టోబర్ 5, 2007

    భలే రాసారండి మీరు.నేను కూడ ఈ విషయం మీద రాద్దాం అనుకున్నాను కాని,బాబా భక్తులందరు కలసి నన్ను కుమ్మేస్తారని నోరుమూసుకున్నాను.

  8. 9 సుధాకర్ 5:32 అపరాహ్నం వద్ద అక్టోబర్ 5, 2007

    రానారెతో నేను విభేదిస్తున్నాను. ఏదో ఒకటి చేస్తున్నాడు గదా అదే నయం అనుకోవటం అమాయకత్వ దివాళాతనం. ఎలా అయినా జనాలని మోసం చేస్తే మోసం మోసమే. లక్షల మందిని మోసం చేస్తూ వారిచ్చిన డబ్బుతోనే వారికి కొన్ని పనులు చెయ్యటం గొప్ప అయితే చరిత్రలో చాలా మంది రాబిన్ హుడ్ లు వున్నారు, బిల్ గేట్లూ, వారెన్ బఫెట్లు వున్నారు. వారిచ్చిన విరాళాల ముందు ఇవి పెద్ద లెక్కేమీ కాదు.

  9. 10 సుధాకర్ 6:17 అపరాహ్నం వద్ద అక్టోబర్ 6, 2007

    అదీ తెలుగు డాటు కాము ఇలా కూసింది..ఇలా రాసుకుంటే ఇక పత్రికెందుకు?

    http://thatstelugu.oneindia.in/talk2006/2007/saibaba-vishwadarshan2-051007.html

  10. 11 Dil 5:25 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 7, 2007

    నువ్విచ్చిన లింకు ఆ వ్యాసం పార్ట్-2 కి వెళ్తోంది సుధాకర్.

    బాబాను సపోర్టు చెయ్యలనే ఆత్రుతతో సదరు భక్తుడు నానాకంగాళీ వ్యాసం ఒకటి కెలికేశాడు. ఆయన అనుచరుడి కారణంగా బాబాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది అనే ఒక హాస్యాస్పదమైన జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం, ఆ తరువాత అయోమయంగా “బాబా గారు స్వతహాగా భోళా మనిషి కావడం, అనుచరులను అతిగా నమ్మడం వల్ల సమస్యలు వస్తున్నాయి. పదిహేనేళ్ళ క్రితం హైదరాబాద్ సత్యసాయి నిగమాగమానికి వచ్చిన ఆయన ఆ కార్యక్రమంలో సహచరుల సలహా మేరకు గాలిలో నుంచి బంగారు గొలుసు తీయబోయారు. దానిని ఆయన గాల్లోంచి తీయలేదని, తన చొక్కా పొడుగు చేతుల్లోంచి తీశారంటూ ఒక ఆంగ్ల దినపత్రిక ఫోటోలతో సహా ప్రచురించింది. బాబా గారి భక్తులు అటువంటి వార్తలను నమ్మరు. ఆయన మీద వారికున్న విశ్వాసం అటువంటిది.”
    అని రాశాడు.

    ఫొటొలతో సహా పత్రికలో ప్రచురించినా బాబా భక్తులు నమ్మరట!

    నెపం ఆయన అనుచరుల మీద వేసి సదరు వ్యాసకర్త ఇప్పుడు చెప్పదలుచుకున్నదేమిటి? “బాబా గారు” ఉట్టి అమాయకుడు, అనుచరులు చెప్పినట్టలా ఆడుతాడనేనా?

    ఏమి తెలియని వాడు దేవుడెలా అయినాడు స్వామీ?

    ఒక అ”సత్య” దేవుడిని వెనకేసుకురావడానికి ఎన్ని అబద్ధాలూ, అమాయకత్వాలూ, అజ్ఞానాలూ, మోసాలూ…


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,242 సందర్శకులు