ఇరాక్ లో స్థానిక సైన్యానికి గత రెండేళ్లుగా అమెరికా సరఫరా చేసిన ఆయుధాలలో 1,10,000 AK-47లు, 80,000 పిస్తోళ్లు కనిపించట్లేదనే వార్త ఆందోళన కలుగజేస్తుంది. గడచిన అనేక దశాబ్దాలుగా ప్రపంచం లోనే అతిపెద్ద ఆయుధ బేహారిగా మారి, తాను ఉత్పత్తి చేస్తున్న ఆయుధాలు అమ్ముకోవడానికి లక్షలాది ఉసురు తీసే యుద్ధాలు మొదలు పెడుతున్న రక్త పిపాసి అమెరికా పొరపాటున చేసిందో కావాలనే చేసిందో కానీ ఈ తప్పిదం మాత్రం క్షమార్హం కాదు.
అత్యంత పురాతన మెసొపొటేమియా నాగరికతకు నిలయమైన ఇరాక్ ను, ప్రాచీన బాగ్దాద్ నగరాన్ని సమూలంగా నాశనం చేసి, లక్షలాది ఇరాకీయుల మృతికి కారణమైన అమెరికా పోయినేడాది ఇరాక్ సైన్యాన్ని “ఆధునీకరించడానికి” 1900 కోట్ల డాలర్లను ఖర్చు చేసిందంటేనే ఈ అగ్ర రాజ్యం ఎంత నర హంతక రాజ్యంగా మారిపోయిందో తెలుస్తోంది.
ఇప్పుడు లెక్క తెలియకుండా పోయిన ఆ లక్షల తుపాకుల వల్ల ఎంతమంది అమాయకుల ప్రాణాలకు ముప్పు ఉందో…









0 స్పందనలు నుండి “1,10,000 AK-47లు పోయాయట!” కు