నిన్న పులకరింత నేడు జలదరింపు!

వర్షం రేకెత్తించిన హర్షాతిరేకం గురించి రాసి పూట గడిచిందో లేదో ప్రకృతి భీబత్సాన్ని ప్రత్యక్షంగా చూడవలసి వచ్చింది నాకు.

నిన్న సాయంత్రం ఐదవుతుండగా ఒక్కసారిగా గాలీ, వానా మొదలయ్యాయి. మూసిన కిటికీ అద్దాల్లోంచి కూడా బయట జరుగుతున్నది లీలా మాత్రంగా వినపడుతోంది. నా రూం లో ఉన్న కొలీగ్స్ చాలా మంది వెనీషియన్ బ్లైండ్స్ తొలగించి బయట కురుస్తున్న వర్షాన్ని చూసి ఆనందపడ్డారు.

ఆరూ పది అవుతుండగా నా క్యాబ్ చెక్ పోస్ట్ దాటి కాస్త ముందుకెళ్లిందో లేదో, ముందో పెద్ద ట్రాఫిక్ జాం. రెండు నిముషాలు ఏమైందా అని చూస్తుండగానే అటు వైపు నుండి అంబులెన్స్ ల సైరన్లు, ఒక దాని వెంట మూడు 108 అంబులెన్స్ లు దౌడు తీస్తూ కనిపించాయి. మనసు ఏదో కీడును శంకిస్తూనే ఉంది. అల్లంత దూరం నుంచే ఏదో భవనం కూలినట్టు కనిపించింది.

దగ్గరకు పోయి చూస్తే, కూలిందో భారీ హోర్డింగ్. గత కొంత కాలంగా నగరం నలు మూలలా పుట్ట గొడుగుల్లా వెలిసాయి ఈ కొత్త రకం ఒంటి స్థంభం హోర్డింగులు. వాటిని చూస్తే నే భయం వేస్తుంది. అయిదింటికి వీచిన బలమైన గాలుల ధాటికి ఈ హోర్డింగ్ నేలకూలింది. పక్కనే ఉన్న చిన్న ఐస్ క్రీం పార్లర్ మొత్తం కుప్ప కూలి అందులో పనిచేసే మనిషి ఒకతను అక్కడికక్కడే చనిపోగా, నలుగురైదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న రెస్టారెంట్ కూడా బాగానే ధ్వంసం అయ్యింది. రెండు మూడు కార్లు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. ఇంకొంచెం లేటుగా ఈ సంఘటన జరిగినా, లేకా ఆ హోర్డింగ్ ఇంకొంచెం ముందుకు వచ్చి రోడ్డు పై వెళ్లే ట్రాఫిక్ పై పడినా నష్టం భారీగా ఉండేది.

ఈ హోర్డింగుల నుండి వచ్చే పన్ను కోసం ఆశపడి ఎడాపెడా అనుమతులు ఇస్తున్న అధికారులు అసలు ఇవి సురక్షితమేనా అన్న విషయం పట్టించుకుంటున్నట్టు లేరు. నిన్నటి గాలి దుమారం ఒక విధంగా చిన్నదే. దానికే ఇలాంటి హోర్డింగులు కూలి పొతే ఇక రేపు రేపు వచ్చే బలమైన తుఫాన్లకు ఇవి తట్టుకుంటాయా?

వెంటనే ఒక నిపుణుల బృందంతో వీటి భద్రతను తనిఖీ చేసి ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది.

1 ప్రతిస్పందన నుండి “నిన్న పులకరింత నేడు జలదరింపు!” కు


  1. 1 సుధాకర్(శోధన) 6:54 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 17, 2007

    దీనికి కొసమెరుపు ఏమిటంటే…

    కొన్ని ఒంటి స్థంభం హోర్డింగులకు ఉన్న యాడ్ లను తొలగించారు. ఇప్పుడు అవి అస్థిపంజరాలుగా మాత్రమే వున్నాయి. అయినా వాటికి విద్యుత్త్యు కొరత మాత్రం ఏమీ లేదు. ఆఖరుకు తెల్లని ఖాలీ హోర్డింగులకు కూడా భారీ విద్యుత్తు కాంతులు రాత్రంతా విరజిమ్ముతూనే వున్నాయి.


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,144 సందర్శకులు