తెలంగాణా వాదం వేర్పాటువాదమా? పై వ్యాఖ్యలు:

రాసినది: నవీన్ గార్ల
>> ఆంధ్రప్రదేశ్ జనాభాల 40% ఉన్న తెలంగాణ ప్రజలకి సెక్రెటేరియట్ ల 10% కూడా లేని ఉద్యోగాలు (ఆ 10% కూడా చాలామటుకు అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలట)

ఈ విషయం ఎవరు చెప్పారు మీకు?

రాసినది: ఇలా దేశాన్ని రాష్ట్రాలుగా విడగొట్టడం వేర్పాటువాదం కాదా? ఇది దేశ విచ్చిన్నతకు దారి తీయదా? « తె
[...] Source: http://hridayam.wordpress.com/2007/03/05/telangana-separatism/ [...]

రాసినది: చైతన్య
ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ జిల్లాలతో హైదరాబాద్ రాజధాని గా ఉండింది. అప్పటికే హైదరాబాద్ భారతదేశంల అభివృద్ధి చెందిన నగరాలల్ల ఒకటి. కలిసినప్పుడు హైదరాబాద్ తో సహా ఎట్ల కలిసినమో విడిపోయేటప్పుడు అట్లనే హైదరాబాద్ తో సహా విడిపోవాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నరు. అది సహజమే కదా! తెలంగాణ అనే బదులు ముందు ఉన్నట్టుగానే హైదరాబాద్ రాష్ట్రం అని డిమాండ్ చేస్తే హైదరాబాద్ తెలంగాణల భాగమని అర్థం అవుతదేమో మరి. ఇన్నాళ్ళు తమది కూడా అనుకున్న నగరం తమది కాకపోతే సహజంగా బాధ కలుగుతుంది అని చదువరి గారు అన్నరు. అది నిజమే! కాని అదివరకే అభివృద్ధి చెందిన హైదరాబాద్ ని తమది అనుకున్నట్టే పాలకులు తెలంగాణ జిల్లాలను కూడా తమవి అనుకుని నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, సెక్రెటేరియట్ కొలువులు తగిన పాళ్లలో సమకూర్చి వుంటే 50 ఏళ్ల నుండి తెలంగాణ డిమాండు పదే పదే ముందుకు వచ్చేది కాదు. ఇంకో విషయం 50 ఏళ్లుగా కలిసివున్నందుకే ఆంధ్ర ప్రాంతం వారికి హైదరాబాద్ తమది కాకుండా పోతే బాధ కలిగితే 400 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల ప్రజల కష్టాన్ని, వనరులని ఉపయోగించి నిజాం నిర్మించిన హైదరాబాద్ తెలంగాణది కాకపోవడం ఎక్కడి న్యాయం?

తెలంగాణ వచ్చిన తరువాత కూడా పేదోడు పెద్ద పేదోడు, ధనికుడు పెద్ద ధనికుడూ అవుతారు అని సుధాకర్ గారు అన్నరు. అది నిజమే. తెలంగాణ వస్తే సమసమాజం ఏమీ రాదు కదా! అయితే ప్రత్యేక రాష్ట్రం వస్తే కనీసం రాష్ట్రానికి రావలిసిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు తెలంగాణకే వస్తయి అని తెలంగాణ ప్రజల ఆశ! నిధులు వస్తే రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు దండుకునే డబ్బు పోగా మిగిలిందయినా వేరే ప్రాంతానికి తరలించబడకుండా మా ప్రాంతానికే వస్తయి కదా! ఉద్యోగాలు చిన్నవో, పెద్దవో మా ప్రాంతానివి మాకే ఉంటయి కదా! ఆంధ్రప్రదేశ్ జనాభాల 40% ఉన్న తెలంగాణ ప్రజలకి సెక్రెటేరియట్ ల 10% కూడా లేని ఉద్యోగాలు (ఆ 10% కూడా చాలామటుకు అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలట) తెలంగాణ వస్తే మావి మాకే ఉంటయి కదా! సెక్రెటేరియట్ ల ఉద్యోగావకాశాలు తగ్గినయనే అంశం కన్న ముఖ్యమైనది ఆ ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకు లేనందువల్ల అన్ని రంగాలల్ల నిర్ణయాలు తీసుకోబడుతున్న సెక్రెటేరియట్ ల మా ప్రాతినిధ్యం లేనట్టే కదా! అన్నింటికీ మించి నదులపై ఒకటో రెండో ప్రాజెక్టులు కట్టుకుంటే పేదోడు ధనికుడైపోకపోయినా కనీసం పొట్టకూటికి సరిపడే వ్యవసాయం చేసుకోగలడు కదా! ఆంధ్రప్రదేశ్ ల కృష్ణా నది 68.5% పరివాహక ప్రాంతం, గోదావరి 69% పరివాహక ప్రాంతం తెలంగాణలనే ఉన్నయి. అయినా ఆంధ్రప్రదేశ్ ల నదీ జలాలతో సాగు చేయబడుతున్న ప్రాంతం తెలంగాణల ఉన్నది 18.2% శాతం మాత్రమే! ఇగ భాష, సంస్కృతులపై దాడి ఉండనే ఉన్నయి. అయితే తెలంగాణ కోసం ఉద్యమించే ప్రతి ఒక్కరికీ ఆంధ్ర ప్రాంత పాలకుల పట్ల వ్యతిరేకతే కాని ఆంధ్ర ప్రజల పట్ల కాదు. ఆ విషయాన్ని పదే పదే ఎన్నో వేదికల మీద కవులు, కళాకారులు, ఉద్యోగుల సంఘాలు, విద్యావంతులు చెప్తనే వున్నరు.

ఎందరు కవులు, కళాకారులు, విద్యావంతులు, ఉద్యోగులు మొత్తుకున్నా, 1969 ల మొత్తం పది జిల్లాలల్ల వోట్లు వేసి చెప్పినా, మొన్న కరీంనగర్ ఎన్నికలల్ల ప్రజలు వోట్లతో తెలియజేసినా ఇది రాజకీయ నాయకుల డిమాండ్ అని చెప్పి ఒక ప్రజాస్వామిక ఆకాంక్షని విలువ లేనిదిగా చూపించాలని ప్రయత్నిస్తున్నరు. తెలంగాణల రాజకీయ పార్టీలకు అతీతంగ ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని సంఘాలు ఏర్పడినా రాజకీయ నాయకుల మాయల పడ్డట్టే మాట్లాడడాన్ని ఏమనాలె? TRS కి అనుకూలంగా, వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయంగా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నరు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా అయినా, వ్యతిరేకంగా అయినా, అతీతంగా అయినా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నది నిజం – అది కూడా వాళ్ల చైతన్యంతో, న్యాయమైన డిమాండ్లతో కోరుకుంటున్నరు, ఎవరో చెప్పిన మాటల మాయల పడి కాదు. తెలంగాణ రావాలని నిజంగా ప్రజల గట్టి కోరిక అయితే వాళ్లే కొట్లాడి తెచ్చుకుంటరు. లేకపోతే ఉద్యమం ఎలాగూ నీరు కారిపోతది. తెలంగాణ విషయంల తెలంగాణ ప్రజలకే నిర్ణయించుకునే హక్కు ఉంటదని అయితే అందరూ అంగీకరిస్తరనుకుంటున్న. ఇగ అది కూడ కాదంటే వాళ్లు అప్రజాస్వామికం అనక తప్పదు.

PS: తెలంగాణ ప్రజలు తెలంగాణ ఒక్కటే వెనకబడిందని ఏమీ అనడం లేదు. తెలంగాణ వెనకబడ్డది అని అంటున్నరు. వారికున్న చైతన్యంతో దానికి పరిష్కారంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షని వ్యక్తపరుస్తున్నరు. ఇతర వెనకబడిన ప్రాంతాలవారు వారి పరిష్కారాన్ని వాళ్లే వెతుక్కుంటరు.

రాసినది: Dil
పోస్టు పై వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు. జవాబులు మరీ పెద్దగా ఉండటం వలన వాటిని ఇక్కడ కాకుండా విడిగా పోస్టు చేద్దామని ఆగాను. రేపటినుండి పోస్టు చేయడం మొదలు పెడతాను…

రాసినది: సిరిసిరిమువ్వ
వ్యాసం బాగుంది.  కాని ఒక విషయం.  శోధన సుధాకర్ గారు అన్నట్లు తెలంగాణ వచ్చిన తరువాత కూడా పేదోడు పెద్ద పేదోడు, ధనికుడు పెద్ద ధనికుడూ అవుతారు. అంతకన్నా పెద్ద మార్పేమి వుండదు. ఇప్పడు తెలంగాణ వెనుకపడింది అభివృద్ధి లేదు అంటున్నారు.  అసలు ఏ ప్రాంతం లో అభివృద్ధి మెండుగా వున్నట్లు?  వెనకబాటుతనం ప్రతి చోటా వుంది.  రేపు తెలంగాణా వస్తే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది.  చుట్టి చుట్టి హైదరాబాదు చుట్టూనే జరుగుతుంది (ప్రస్తుతం ఆంధ్రా లో అత్యధిక వేగవంతంగా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతం కూడా అదే). ఇప్పుడు ఉన్న మహబూబునగరు అలానే వుంటుంది, నల్గొండ అలానే వుంటుంది. అదిలాబాదు అలానే వుంటుంది.  విడిపోతే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతాయనుకుంటే విడిపోవటం లో తప్పు లేదు కాని స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది కుహ(నా)యకుల అభివృద్ధి కోసం విడిపోవటం తెలంగాణ కు నిజంగా మేలు చేస్తుందా?

రాసినది: T.Bala Subrahmanyam
దిలీప్ గారూ మీరు చాలా కష్టపడ్డారు. కాని తెలంగాణా వాదం ముమ్మాటికీ వేర్పాటువాదమే. పది కోట్ల తెలుగు మహాజాతిలోంచి వేరుపడాలని ప్రయత్నం చెయ్యడం ఇంకేమనిపించుకుంటుంది ? అలా వేరు పడడానికి సరైన ప్రాతిపదిక ఏమిటి ? ఖచ్చితమైన హేతువేంటి మన ప్రాంతం వాడొకడు లేచి ఆ నినాదం ఇచ్చి మన బి.పి.పెంచడం తప్ప ? నాకు ఈ సందర్భంలో అంబానాథ్ గారు గుర్తొస్తున్నారు. మీరు చెప్పే ఇండియన్ యూనియన్ అనే దేశమూ దాని సమైక్యమూ దాని రాజ్యాంగమూ పుట్టక ముందే తెలుగుజాతి ఉంది.కాబట్టి ఇండియన్ యూనియన్ ఉన్నా ఊడినా మన జాతి నిలబడాలి. నిలబడాలంటే కలిసుండాలి.కాబట్టి మన సమైక్యానికి దాని సమైక్యానికి ముడిపెట్టకండి.

ఇహపోతే మద్రాసు నుంచి తెలుగువాళ్ళు వేరుపడ్డారన్నారు. అయ్య మద్రాసు రాష్ట్రం ప్రజలు ఏర్పరచింది కాదు.తెలుగువాళ్ళూ తమిళులూ కలిసి ఉంటామని బ్రిటీషువాళ్ళతో ఎప్పుడూ అనలేదు.వాళ్ళు తమ సామ్రాజ్య పరిపాలనా నిర్వహణల నిమిత్తం నానా భాషల కలగాపులగంతో అర్థం పర్థం లేని రాష్ట్రాలు ఏర్పరిచారు. మనం స్వాతంత్ర్యం వచ్చాక ఒకే జాతికి చెందిన ప్రజలతో అర్థవంతమైన రాష్ట్రాలు ఏర్పరచి రాష్ట్రాల ఏర్పాటుకు ఒక హేతుబద్ధమైన విధానాన్ని రూపొందించుకున్నాం. మీరు చూడండి ప్రపంచంలో దేశాలు సైతం భాషాప్రాతిపదికనే ఏర్పడ్డాయి. మినహాయింపులు ఉండొచ్చు. కాని చాలా తక్కువ.మీరు ఇంత తెలిసినవారై ఉండి కేసీయార్ లాంటి దగుల్బాజికి వంతపాడే పని భుజానికెత్తుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది.

రాసినది: సుధాకర్(శోధన)
వ్యాసం చాలా బాగుంది. వేర్పాటువాదం సంగతేమో గానీ, ‘తెలంగాణా ముద్దు బిడ్డలం’ అని చెప్పుకునే కొంతమంది రాజకీయ నాయకులు చాలా అసహ్యకరమైన రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. అది ఎంత వరకూ వచ్చిందంటే ‘తెలుగు’ భాష మీద దాడి కూడా మొదలయింది.ఇలాంటి కోవలోని వారే తెలంగాణా వాదానికి వేర్పాటువాదం అని పేరు పెట్టేది. పక్కనున్న తోటి తెలుగు వాళ్లని తిట్టడం, ఢిల్లీ వెళ్లి ఇటాలియన్ల కాళ్లు గుద్దటం ఏ రకమైన ఆత్మాభిమానమో కూడా అర్ధం కాదు. ఇది మన ప్రాంతం, మన ప్రజలు, మన భాష. ఏదైనా తేల్చుకోవాలంటే ఇంట నుంచి గెలుచుకు రావాలి. ప్రతి ఇంటి నుంచి ఆ నినాదాన్ని మారు మోగించాలి. అంతే గానీ ఎద్దు తోక తొక్కితే పిల్లి ఎలక వంక ఎర్రగా చూసిందన్నట్లు, ఎవరికో భూములు దొరక్క, పదవులు రాక, సరిగ్గ జనాలను దోచుకునే అవకాశం రాక మొదలు పెట్టిన ఈ నినాదం, వాదం తోటి తెలుగు వాల్లను దొంగలుగా చిత్రీకరించటం మానాలి. ప్రతీ దగ్గరా పేదల కడుపు కొట్టే వాడు ఒకడే…అది తెలంగాణా కావచ్చు, పాడుబడిన ఉత్తరాంధ్ర కావచ్చు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా పేదోడు పెద్ద పేదోడు, ధనికుడు పెద్ద ధనికుడూ అవుతారు. ఇది పరమ సత్యం.ఇక్కడ మనమేమి నవ నూతన పేదోళ్ల దేశాన్ని నిర్మించటం లేదని గుర్తించాలి. శ్మశానాన్ని ఎన్ని భాగాలు చేసినా రాబందులకు కొదవుండదు.

అయితే ఈ తెలంగాణవాదం ఇప్పటికయినా ఆ అవకాశ రాజకీయ నాయకులను పక్కన పెడితే, తెలంగాణా ప్రజల సమైక్యవాదం మొదలై ఈ స్వప్నం సాధించటం  అతి దగ్గరలోనే  ఉండవచ్చు.

రాసినది: చదువరి
బహుశా సెషెషన్ అనే ఇంగ్లీషు మాటను అనువదించడంలో వచ్చిన ఇబ్బంది కావచ్చు. నిజానికి వేర్పాటు అనేది అంత చెడు మాటేమీ కాదు, ఆస్తి పంపకాలపుడు కూడా వాడుతారు – వేరు పడుతున్నారు అని. వాడుకలో ఈమాటను ఏర్లు పడడం అని కూడా అంటారు మా గుంటూరు జిల్లాలో. రాష్ట్ర విభజన కోరడం వేర్పాటు అని అనవచ్చేమో! అయితే.. ఇది కేవలం నా ఆలోచన, రామచంద్ర గుహ గారి అభిప్రాయాలను ఒప్పుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు.

ఉల్ఫా ప్రాంతీయ తత్వం ప్రత్యేకమైనదైనట్లే.. ప్రత్యేక తెలంగాణ వాదం కూడా మరో రకంగా భిన్నమైనది! వ్యాసంలో ఉదహరించిన ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు విషయంలో.. విడిపోదలచినవారు విడిపోయి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ విషయంలో మాత్రం.. విడిపోదలచిన వారు ‘రాజధాని మాదే, మీరు పోయి మీ రాజధానిని నిర్మించుకోండి’ అని మిగతావారిని అంటున్నారు. ఇన్నాళ్ళు తమది కూడా అనుకున్న నగరం తమది కాకపోతే సహజంగా బాధ కలుగుతుంది. తెలంగాణపై కోస్తా రాయలసీమల వ్యతిరేకతకు బహుశా అదో ముఖ్యకారణం కావచ్చు. ఇకపోతే దీనికి మించిన నీళ్ళ పంపకాల గొడవ ఎలాగూ ఉండనే ఉంది.