కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తున్నారు

ఈ మధ్య చదువరి కార్పోరేట్ కిరాణా దుకాణాలపై ఒక పోస్ట్ చేశాడు. దాని పై జరిగిన చర్చలో బ్లాగు మిత్రులు కొంత మంది మాల్స్ రావాలని అవి వస్తేనే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయనే అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఇంట్లో ఎలుకలు దూరాయని ఇల్లు తగలబెట్టుకోవడం లాంటి పని ఇది. భారత దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయాన్ని గత 15 యేళ్ల liberalized economic policies ఇప్పటికే సర్వనాశనం చేసి పెట్టాయి. ఇక రిటైల్ రంగం లో ఇప్పుడు అనుమతించిన విదేశీ పెట్టుబడులు తద్వారా మొదలైన shopping malls, మన దేశ ప్రజల మరో ముఖ్య జీవనోపాధిని దారుణంగా దెబ్బతీస్తాయి.

wal.JPG

ముందు ఒక సంఘటన గురించి చెప్పాలి మీకు.

మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కి గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. పెరుగుతున్న ధరలే ఆ పార్టీ కొంప ముంచాయని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.

మన రాష్ట్రం లో గత రెండు నెలలుగా పప్పులు, నూనెల ధరలు మరీ అన్యాయంగా పెరిగిపోయాయి. దరలు ఇలా పెరిగి పోవడానికి కారణం కొంత మంది వ్యాపారులు భారీ ఎత్తున నిత్యావసర వస్తువులను నిల్వ చేయడమేనని పౌర సరఫరాల అధికారులు గుర్తించారు. నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం హోల్ సేల్, రిటేల్ వ్యాపారస్తులు లైసెన్స్ లేకుండా నిత్యావసర వస్తువులు నిల్వ చేయడం నేరం. సరుకులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా ప్రభుత్వం యాభై ఏళ్ల కిందటే ముందు చూపుతో తెచ్చిన చట్టం అది.

సరుకుల అక్రమ నిల్వలపై దాడులు జరిపేందుకు విజిలెన్స్ శాఖ, తూనికలు కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసాయి. సదరు టాస్క్ ఫొర్స్ గత వారం రోజులు గా రాష్ట్రం నలుమూలల అక్రమార్కుల పై ముమ్మరంగా దాడులు జరిపి దాదాపు 20 కోట్ల రూపాయల పప్పు ధాన్యాలను సీజ్ చేసింది. ఇంత వరకూ బాగానే ఉంది స్టొరీ. కొసమెరుపు చూడండి…

పట్టుబడ్డ ఘనుల లిస్ట్ లో మన త్రినేత్ర, స్పెన్సర్స్, హైదరాబాద్ సెంట్రల్, ఫుడ్ వరల్డ్, సుభిక్ష, సిటి కాపిటల్ ఉన్నాయి.

హైదరాబాద్ లో ఎలాంటి లైసెన్సులు లేకుండా నిత్యావసర వస్తువులు అమ్మే వారిలో అత్యధికులు ఇలాంటి మాల్స్ యజమానులే అని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.

“మంచి” (?) ఉద్యోగాలు పొందలేని ఎందరో దేశ పౌరులకు ఒక గౌరవ ప్రదమైన జీవనోపాధి ని కలుగజేస్తుంది రిటైల్ రంగం. చిన్న పల్లెటూర్ల నుండి పట్నాల దాకా చదువుకోని, చదువుకున్నా సరైన ఉద్యోగం దొరకని లక్షలాది మంది ఏ చిన్న కిరాణా కొట్టో, కూరగాయల కొట్టో పెట్టుకుని బతుకు బండిని నడుపుతున్నారు.

ఇప్పుడు వాల్ మార్ట్ వంటి సంస్థలకు ఈ రంగం లో ప్రవేశించే అవకాశం కలిపించిన మన ఏలికలు రేపు జరగబోయే ఉపద్రవాన్ని గమనిస్తున్నట్టు లేరు.

ఒక అంచనా ప్రకారం భారత దేశం లోని 35 పెద్ద పట్టణలలో కనుక వాల్ మార్ట్ తన మాల్స్ ను తెరిస్తే ఇప్పటి వాల్ మార్ట్ పనితీరు ప్రకారం అది కేవలం 10195 మంది ఉద్యోగులతో 80,330 మిలియన్ రూపాయల టర్నోవర్ సాధించగలదు. అలా చేయడం ద్వారా అది దాదాపు 4,32,000 వ్యక్తుల జీవనోపాధిని దెబ్బతీయగలదు.

ఇక మాల్స్ వస్తే తక్కువ ధరకు నాణమైన సరుకు దొరుకుతుందన్న వాదన కూడా కరెక్ట్ కాదు. సాధారణంగా బహుళ జాతి కంపెనీలు ఏ దేశానికి వెళ్లినా ముందు అక్కడ స్థానిక కంపెనీల కన్నా తక్కువ ధరకు సరుకులు అమ్మడం చేస్తాయి. పోటిదారులంతా చచ్చూర్కున్నాక అప్పుడు ఉంటుంది విశ్వరూప ప్రదర్శన. వీళ్ల మోనోపొలి మొదలయ్యాక అటూ రైతుకు, ఇటు వినియోగదారునికీ పంగనామాలు పెట్టడం ఖాయం. చిన్న వ్యాపారస్తులు నాణ్యత తక్కువ సరుకులు అమ్మడానికి చాలా సార్లు వాళ్లున్న మార్కెట్ కారణం. నాణ్యమైన A1 సరుకంతా డబ్బున్న షరాబులుండే చోటికి తరలి పోతుంది. ఇక మధ్య తరగతి, పేదలుండే ప్రాంతాల్లో సహజంగానే B, C రకాలే దొరుకుతాయి. శివారు ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్ కు వెళ్లి చూడండి అన్నీ చచ్చు పుచ్చు కూరగాయలే దొరుకుతాయి. అదే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 లో తోపుడు బండి పైన అయినా తళ తళ లాడుతూ మిరిమిట్లు గొలిపే కూరగాయలు “సరసమైన” ధరలకు లభ్యమవుతాయి. ఖరీదు కట్టే షరాబు దొరకాలి కాని అమ్మడానికి కొట్టువాడికేమీ అభ్యంతరం ఉండదు.

కాలం మారి ఉండొచ్చు. మారుతున్న కాలంతో పాటు మనుషులూ మారాలని మనం గట్టున కూర్చొని ఎన్ని జీవిత సత్యాలైనా బోధించవచ్చు. కానీ ఉన్న ఊర్లో వ్యవసాయం గిట్టుబాటు కాక పొలం పుట్రా తెగనమ్మి నగర శివార్లలో జనరల్ స్టొర్ పెట్టుకుని బతుకుదామనుకున్న వ్యక్తి ఇప్పుడేం కావాలి. సహజంగా జరిగే మార్పులకు మనిషి కొన్ని వేల సంవత్సరాలుగా adapt అవుతూనే ఉన్నాడు. కొద్ది మంది బలమైన వ్యక్తుల ప్రయోజనాలకు జరుగుతున్న ఈ కృత్రిమ మార్పులకు బలహీనులు ఎన్ని సార్లు adapt కావాలి?

ఈ mall culture ఎవరికీ లాభదాయకం కాదు. ఒక వైపు లక్షలాది మంది చిన్న వ్యాపారస్తుల పొట్టలు గొడుతుంది, రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తుంది, మధ్య తరగతిని ఆశల పల్లకీలో ఊరేగించి కష్టార్జితం అంతా గుల్ల చేస్తుంది, చట్టాలు ఉల్లంఘించి పన్నులు ఎగవేస్తుంది.

లాభం వాల్ మార్ట్ కు, రిలయన్స్ కు. సామాన్యుడి జివితం మాత్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.

21 స్పందనలు నుండి “కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తున్నారు” కు


  1. 1 Parupalli 6:31 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 23, 2007

    Its the responsibility of the government, civil supplies department to see the proper supply of house-hold goods to the general public. If some one is storing something illegally to increase the commodity price means, its the govenment failure to stop such things.

    Most of these illegal storages to increase the commodity prices happen with the proper knowledge of corrupt officers only. If the pressure from public gets too high then these guys go for some searches and do some show business as if they were ignorant of the facts.

    Coming to retail business, Let me give my experience

    Half litre milk packet costs 8 Rs if you buy it directly from the milk agent.

    Same packet costs 9 to 10 Rs if you buy it from a small “kirana” shop and shop wala even cries if you ask for a polythene cover to carry it and becomes adament if you argue more with him for the cover.

    Reliance Fresh sells it for 7.75 Rs. The guy at the counter receives you cardially and tries to help you for other customer related issues.

    As a consumer, what is the better option for me ?

    చిన్న కొట్టైనా, పెద్ద మాల్ అయినా మౌళిక వ్యాపార సూత్రాలు అనుసరించినంత కాలం, వినియోగదారుడి కి గౌరవం, విలువ ఇచ్చినంతకాలం వారి వారి వ్యాపారానికి ఢొకా వుండదు అని నా అభిప్రాయం.

  2. 2 సుధాకర్(శోధన) 7:22 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 23, 2007

    మీరన్నది పక్కా నిజం. నేను కూడా ముందు మాల్స్ వచ్చి తీరాలనుకునే వాడిని. కానీ మా కుటుంబ స్నేహితులోకరు సరిగ్గ మీరు ఇక్కడ చెప్పిన మాటలే చెప్పి నా కళ్ళు తెరిపించారు.

  3. 3 Dil 7:36 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 23, 2007

    Dear Parupalli,

    I think you have missed some important observations in the post. Let me clarify them again

    1) You gave me an example of a neighbourhood shop that charges 1-2 Rupees ‘more’ than the MRP and our dear Reliance Fresh which sells you at 25 paise less than the MRP. If you read my post carefully you will understand (a) that these ‘cheap’ rates are here to stay only till the smaller stores are out of business. and (b) that Reliance Fresh might have offered you goods at 25 Paise less than the MRP, but I can assure you that they would have made enough profit from you by making you buy more consumables than what you actually need. The very strength of Mall business lies in selling more (useless) things to the consumer. So, if you think carefully, you lose more when you go to a Mall.

    2) You said “If some one is storing something illegally to increase the commodity price means, its the govenment failure to stop such things.”

    Yes! what you said is completely true. My idea was to drive home the point that ‘Bigger Malls’ will only resort to bigger frauds. I am fully aware that these illegal activities happen with the connivance of a few corrupt officers only. Hope you got my point.

  4. 4 ప్రవీణ్ గార్లపాటి 1:17 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 23, 2007

    నిజంగానే తెలీక అడుగుతున్నాను.

    malls కి కూడా పోటీ ఉంటుంది కదా ? మరి అలాంటప్పుడు వాళ్ళు కొన్ని రోజులు తక్కువ ధరలకు ఇచ్చి తరవాత పెంచేస్తే వినియోగదారుడు మరో చోటకి వెళ్ళి పోతాడు అని వారికి తెలీదా. లేక అందరూ పెంచేస్తారని మీ ఉద్దేశ్యమా ?

    ఎందుకడుగుతున్నాను అంటే ఇప్పుడూ బ్రాడ్బాండ్, టెలీకాం నే తీసుకోండి. ఎన్నడూ లేనిది BSNL కొంత professional గా తయారయి చక్కని సేవలు అందిస్తోంది అంటే పోటీ ఉండబట్టేగా ?

    మరి గవర్నమెంట్ సంస్థలు కూడా పోటీ వల్ల లాభ పడుతున్నాయి కదా. మరి అలాగే ఇవి కూడా బాగుపడతాయి అని ఎందుకు అనుకోకూడదు ?

    wallmart ని నిందించేందుకు అందరూ ముందు ఉంటారు కానీ అందులో వారి తప్పేమీ లేదు అని నా అభిప్రాయం. వారిది business కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు వారికి ఉంటాయి. అది గనక ప్రజలకు చేటు కలిగిస్తుంది అంటే ప్రభుత్వ నిర్ణయాల పొరబాటే కదా ? (Microsoft, Bill Gates ని కూడా ఇదే విధంగా అంటుంటారు కానీ నాకు అది తప్పుగా అనిపిస్తుంది.) (ఇది మిమ్మల్నుద్దేశించి కాదు)

    అదీ కాక నాకు తెలిసినంత వరకూ US wallmart లో ఇంకా ధరలు తక్కువ గానే ఉంటాయని అనుకుంటున్నాను. అవి పెరిగిపొయాయో లెదో నాకు తెలీదు.

    మిగతా అర్థికం గా దెబ్బ తీస్తుందంటారా ? దాని గురించి నాకు పెద్దగా తెలీదు. నాకు తెలీని దాని గురించి నేను మాట్లాడలేను.

  5. 5 భాస్కర్ 3:08 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 23, 2007

    పక్కా నిజం. ఈ మాల్స్ వల్ల వచ్చే కష్టాలు ఇంతింతకాదయా అన్నారు పెద్దలు. అదియెలా గంటే, అవసరం లేకపొఇనా వాల్-మార్ట్ కి నడిపిస్తాఇ కాళ్లు. మొత్తాం తిప్పిస్తై లోపల. మా బుడ్డోడు యెడో ఒక బొమ్మో గొమ్మో చూస్తాడు, యేడుస్తాడు. మా ఆవిడ పోనీలేండి అంటుంది. అంతే అది బుట్టలో పదుతుంది. అలా అవసరం లేనివి ఉన్నవి అన్నిజేరి వాల్-మార్ట్ కి పొఇనప్పుడల్లా $100 బొక్క.కాం. ఇంక మన దేశమ్లోకి కూడా వాల్-మార్ట్ వస్తే మనవాళ్లకి ఇంక దోపిడీ.కాం.

  6. 6 T.Bala Subrahmanyam 6:42 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 23, 2007

    “హృదయ”కర్త అభిప్రాయాన్నీ కాదనడానికి లేదు.పఠితల అభిప్రాయాల్నీ కాదనడానికి లేదు.ప్రభుత్వం అనుమతించినా వాల్‌మార్ట్ లాంటివి మన చిన్న పచారీ కొట్లని కిరాణా కొట్లని దెబ్బతియ్యలేవని నా అభిప్రాయం.కారణమేంటంటే-

    1.స్థానిక కిరాణా వ్యాపారుల దగ్గర అప్పు ప్రాతిపదిక (credit basis)పై వస్తువులు తీసుకోవడానికి (ఖాతా పెట్టడానికి)అవకాశం ఉంది. ఈ సదుపాయం మాల్స్‌లో ఈనాటికీ లేదు.అందుచేత మధ్యతరగతి జీవులు మాల్స్‌కి వెళ్ళరు.

    2.కేవలం ఉన్నత మధ్యతరగతి మీదా ఉన్నత వర్గాలవారిమీదా ఆధారపడి వ్యాపారం చెయ్యడంలో చాలా రిస్కులున్నాయి.పదేళ్ల కిందట హైదరాబాదు నగరం నలుమూలలా ఆర్భాటంగా షాపులు తెఱిచిన Food World ఆ తరువాత వాటిల్లో కొన్నింటిని అమ్మేయ్యాల్సి రావడమే ఇందుకు నిదర్శనం.

    3.Malls అన్నీ Class-1 మఱియు Class-2 నగరాలకి పరిమితమైనవి.అంటే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రిలాంటి మహానగరాల మార్కెట్ మీదనే అవి కన్నేస్తాయి.ఆదాయ వనర్లు పరిమితంగా ఉన్న పట్టణాల్లోకి అవి చచ్చినా అడుగుపెట్టవు.ఇందులో సందేహం లేదు.

    4.భారతీయ వినియోగదార్లు నాణ్యత గురించి పట్టుపట్టరు.తక్కువ నాణ్యత ఉన్నా లేదా తక్కువ నాణ్యత అని తెలిసినా “మన స్థాయికి/అవసరానికి ఈ మాత్రం చాల్లే” అని సరిపెట్టుకుంటారు తప్ప నాణ్యత లేదని స్థానిక కిరాణా కొట్లని ఒదిలిపెట్టి Malls కి పరుగెత్తడం జరగదు.

    కాబట్టి ఇక్కడ malls వ్యాపారం అమెరికా/యూరప్ అంత భారీ స్థాయికి ఎదగడం అనుమానాస్పదం.

  7. 7 రానారె 7:52 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 23, 2007

    బాలసుబ్రహ్మణ్యం గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. మన దేశంలో పల్లెలు, చిన్నచిన్న పట్టణాలలోని జనాభాతోనూ వారి కొనుగోలుశక్తితోనూ పరిశీలిస్తే వాల్‌మార్ట్ నగరాలకే పరిమితమవక తప్పదు. మన ప్రజలు జాగరూకతా పాలకులు బాధ్యతా గుర్తెరిగితే వాల్‌మార్ట్ మననేమీ దెబ్బతీయలేదు. లోపం మనది. మన బంగారం మంచిది కానపుడు ఎవరిని నిందించి ఏం ప్రయోజనం!?

  8. 8 సుధాకర్(శోధన) 3:38 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    ప్రవీణ్ గారు BSNL సంగతి తీసుకుందాం. BSNL దేశం మొత్తం మీద అత్యధిక నెట్వర్క్ కవరేజీ వున్న సంస్థ.(గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా). అది మన ప్రజల సంస్థ. కానీ ఇక్కడ జరిగిందేంటో ఒక్క సారి గమనిస్తే….దేశంలో సెల్ ఫోన్ విప్లవం మొదలైన రోజులలో లైసన్సులు వచ్చిన కంపనీలన్నీ విదేశీ కంపనీలు లేదా వాటి పెట్టుబడులు వున్నవే. అవన్నీ ఆ రంగంలో బాగా స్థిర పడిన తరువాత BSNL తాపీగా TRAI కి సెల్ ఫోన్ ప్రొవైడర్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసింది. ఈ ఆలస్యం ఖరీదు కొన్ని వందల కోట్ల రూపాయలు. కానీ ఆ ఆలస్యాన్ని మహా అయితే ఒక అయిదు కోట్ల లంచంతో కొనేసుంటారు…టెలికామ్ మంత్రిత్వ శాఖ స్థాయిలో. ఇంటర్నెట్ దీ అదే పరిస్థితి. ఇప్పుడు BSNL ఇంటర్నెట్ అడిగితే సవాలక్ష ప్రశ్నలు.

    మాల్స్ అన్ని class-1, class-2 కి పరిమితమే కాదనను. కానీ అవి ఎందుకు పరిమితమో తెలుసా? ఎక్కడ కొనే వాడుంటాడో అక్కడే వ్యాపారం. మన రాష్ట్రంలో భారీగా ఖర్చు పెట్టే మధ్య తరగతి వినియోగదారులందరూ వుండేది ఈ నగరాలలోనే. మెల్ల మెల్లగా ఈ మాల్లు type-3 , type-4 కు కూడా విస్తరిస్తాయి. అయితే చిన్న స్థాయి దుకాణాలలో కొంత నిజాయతీ పెరిగితే తప్ప అవి బ్రతికే చాన్సులు లేవు. పక్కాగా కల్తీ వ్యాపారం చేసేది వాళ్లే.

  9. 9 డా.ఇస్మాయిల్ పెనుకొండ 4:41 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    దిల్ గారూ…

    నా దిల్ లో ఉన్న మాటలు చెప్పారు. ప్రపంచీకరణ అంటూ ఊదరగొట్టడమే కానీ మన రైతన్నలకు సబ్సిడీ అంటే ‘నో’ అంటారు…బిలియన్లకు బిలియన్ల డాలర్లు సబ్సిడీ ఇస్తున్న అమెరికా ‘ఫార్మర్స్’తో పోటీ పడమంటారు. తక్కువ వేతనాలిస్తూ ఇక్కడి చిరుద్యోగుల పొట్టకొడుతూ…చైనా,ఇండియాల్లో దారుణమైన పని చేయించుకొంటూ తక్కువ ధర అంటూ బిలియన్ల లాభాన్ని మూటగట్టుకుంటున్నారు. నాణ్యత విషయంలో వారు రాజీ పడకపోయినా… మన చిన్న,చిన్న వ్యాపారుల జీవనోపాధికి గండి కొట్టినట్టే!

  10. 10 Chaithanya 4:58 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    Walmart గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని నిజాలు – ఇవి తెలుసుకున్నాక Walmart లో తక్కువ ధరలు ఎందుకుంటాయో అర్థం కాక మానదు.

    Walmartలో అన్నింటికన్నా ఎక్కువ ఉండేవి సేల్స్ అసోసియేట్స్ ఉద్యోగాలు. 2001 లో సగటున వారి సంవత్సర ఆదాయం $13,861. 2001లో అమెరికా Poverty guidelines ప్రకారం ముగ్గురు సభ్యులున్న కుటుంబానికి $14,630 సంవత్సర ఆదాయం దారిద్ర రేఖగా పరిగణించబడింది. అంటే Walmart లో పనిచేసే ఎక్కువ శాతం ఉద్యోగులు దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇక సంఖ్యలో సేల్స్ అసోసియేట్స్ తర్వాత వచ్చే కాషియర్ల సంవత్సర ఆదాయం 2003 wage analysis ప్రకారం $11,948 మాత్రమే.

    Follow the link to read completely…
    http://japes.wordpress.com/2007/02/24/walmart_konni_vaasthavaalu

  11. 11 నాగరాజు 5:39 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    ఇంతకు గద్దల్ని కొట్టి కాకులకు వెయ్యాలనా మీ ఉద్దేశ్యం? :-) ఏవి కాకులో, ఏవి గద్దలో అర్ధం కావడం లేదు!!!

  12. 12 Dil 8:23 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    స్పందించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. కొన్ని వివరణలు…

    ప్రవీణ్ గారూ, టెలికాం రంగంలో ఏం జరిగిందో వివరంగా ఒక పోస్ట్ రాస్తాను. అది చాలా పెద్ద టాపిక్. ఇక BSNL పనితీరు గురించి మనం సంతోషపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే ప్రైవేటు కంపెనీలు మొత్తం పిండేసుకునేదాకా దాని చేతులు కట్టేసి ఇప్పుడు వదిలారు దాన్ని. ఇక ఇప్పుడు అది సంపాదిస్తున్న డబ్బు కూడా మూడూ నాళ్ల ముచ్చటే. దాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చెయ్యడానికి ఎన్నడో నిర్ణయం జరిగిపోయింది. Its just a matter of time

    బాల సుబ్రహ్మణ్యం గారు, అవును నిజమే, మాల్స్ class 1 పట్టణాలకే ముందు వస్తాయి..ఆ తరువాత class 2 పట్టణాలకూ వస్తాయి. పల్లెటూర్లనీ, చిన్న టౌన్లనీ అవి వదిలేస్తుండొచ్చు. నా ఉద్దేశ్యం “చాలా మంది” ప్రజల ఉపాధి దెబ్బతింటుందనే…”అందరి” ఉపాధి కాదు. ఇక Food World మొదట్లో అంతగా లాభదాయకంగా నడవకపోవడానికి కారణం అది ahead of times రావడమే. ఇప్పుడు బాగానే నడుస్తుందది.

    నాగరాజు గారూ ఈ ఆటవిక “వేట” ఉండకూడదన్నదే నా అభిప్రాయం. సీరియస్ టాపిక్స్ లో ఇలా జోకులు వేయడం అంత బాగుండదేమో…ఒక్క సారి ఆలోచించండి.

  13. 13 చదువరి 12:49 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    మధ్య తరగతి వాళ్ళు మాల్సుకు వెళ్ళరనే మాట తప్పనుకుంటాను. ప్రస్తుత రిలయన్సు కూరగాయల కొట్లలో కనపడేది వాళ్ళే (మనమే)! అసలు.., పై దేశాలనుండి వెల్లువెత్తుతున్న వ్యాపార దండయాత్రలకు ప్రధాన ఆకర్షణే మన మధ్యతరగతి! తెగ పెరిగిపోతున్న మధ్యతరగతే! తెగ ఖర్చు పెడుతున్న మన మధ్య తరగతే! (పొదుపు అవకాశాలను క్రమంగా తగ్గిస్తూ ప్రభుత్వం కూడా యథాశక్తి దీనికి దోహదపడుతోంది.)

    ఫుడ్ వరల్డ్ ను మూసెయ్యలేదు.. మరొకరు కొనుక్కున్నారు, అంతే! చిల్లర వ్యాపారం మూతపడలేదు, ఒక బ్రాండు పోయి మరోటొచ్చింది. అసలు వ్యాపారమే బాగోకపోతే మరొకడు ఎందుకు కొనుక్కుంటాడు చెప్పండి!

    ఈ కార్పొరేటు కొట్లు పెద్ద నగరాలకే పరిమితమౌతాయనేది ఇప్పటి మాటే. కేవలం కొద్ది సంవత్సరాల్లోనే ఈ పరిస్థితి మారిపోద్ది. దేశంలోని దాదాపు 6000 పట్టణాల్లో తమ స్టోరులుండాలని రిలయన్సు సంకల్పించిందంట. అంటే చూడండి.. మన రాష్ట్రంలో దాదాపు 350 నుండి 400 ఊళ్ళన్న మాట! ప్రతి మూడో మండల కేంద్రంలోనూ రిలయన్సు కొట్టుంటుందన్న మాట -ఒక్క రిలయన్సు సంగతి ఇది.

  14. 14 నాగరాజు 1:59 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    ఒప్పుకుంటాను. ఇక్కడ లాభ నష్టాలు రెండూ ఉన్నాయి అని నా అభిప్రాయం. ఇకపోతే, మన దుకాణాల వారు అందరు కూడా ఒక సమాఖ్యగా ఏర్పడి, ఈ దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి ప్రయత్నించ వచ్చునేమో…. అయితే, ప్రస్తుతం కల్తీ సరుకులు అమ్మడాలు, స్టాండర్డ్స్ అనేవి లేకపోవడాలు అనేవాటి మీద నా ధ్యాస నిలబడి సీరియస్ కాలేకపోయాను.

  15. 15 valluri 5:55 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    ఏ వ్యాపారానికైనా నాణ్యత, నిబద్దత అనేవి ప్రామాణిక సూత్రాలు. అవి నమ్మి వ్యాపారం చేసేవారికి చెరుపుండదు. ఇక ప్రస్తుత మాల్స్ దాడి విషయనికివస్తే, చిన్నవ్యాపారులంతా సంఘటితంగా వుండి కృషిచెస్తే, ‘బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ’ అన్నట్లు ఈ దాడి ఎదుర్కొని మాల్స్ ని మట్టికరిపించచ్చు.

  16. 16 Raggadu 7:38 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 26, 2007

    Annayya Namaskaram…

    Antha Bagundi… Every thing is allright… Oka sagatu madhya tharagathi manishi ga chepthunnanu… anni malls ravatam vallano, Inkoka dani vallano manam ithe bagu paduthunnam… thakkuva dabbulaku koni… ikapothe as you said it is a matter of time ani annaru… Any ways again my point here is malls valla manaku nashtala kante labhalu ekkuve
    1. FDI’s
    2. Small Scale Purchasers will benefit more
    3. Farmers will benefit with tieups – i myself worked for ITC in cultivating the farmer friendly culture.
    4. Youth Employment – i need not say you howmany are working in central
    5. i have seen one of my friend starting a superstore in competition with food world….

    Manchina Chedina Chese vadilo undadu… vadu chesthu unte choosi kurchune mana prabhutvallo untundi , manalo utundi ani na strong feeling annayya… meeremantaru

    Raggadu

  17. 17 Dil 9:08 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 26, 2007

    తమ్ముడూ!

    రామాయణం మొత్తం విని…అన్న సామెత గుర్తొచ్చింది నీ పోస్టు చదివి. ఈ మాల్స్ వల్ల మధ్యతరగతికి తాత్కాలికంగా లాభం కలగొచ్చు కాని తరువాత మాడు పగులుద్ది అని ఆల్రెడీ చెప్పాను కదా.

    ఇక ITC లో పని చేసి కూడా నువ్వు వీటి వల్ల రైతులు బాగు పడతారని అంటున్నావంటే బహుశా నువ్వు సమస్య మూలాల్లోకి వెళ్లిచూసే ప్రయత్నం చెయ్యలేదనిపిస్తోంది. పెద్ద మాల్స్ ఎన్నటికీ మన దేశ వ్యవసాయాన్ని బాగుపరచలేవు. మాల్స్ ఇచ్చే ఉద్యోగాలు ఎన్నో, అవి displace చేసే livelihoods ఎన్నో నా పోస్ట్ లోనే ఉంది. మళ్లీ ఒక సారి చదివితే బెటర్.

    FDI గురించి ఇంకా తెలుసుకోవాలంటే నువ్వు “మారిషస్ లో అన్ని డబ్బులున్నాయా” అని ప్రశ్నిస్తూ నేను రాసిన పోస్టు చదువు.

    ఇక నీ ఫ్రెండ్ ఫుడ్ వరల్డ్ తో పోటీ పడుతున్నాడని తెలుసుకుని చాలా సంతోషం వేసింది. కానీ ఒక్క ఉదాహరణ పట్టుకుని అందరూ అలా చేయగలరు అనుకోవడానికి లేదు కదా బ్రదర్!

    ఇక మంచైన చెడైనా…అంటూ చివరికి అన్నావే…అది బంగారం లాంటి మాట.

    చూస్తూ కూర్చోగూడదనే ఇది రాస్తున్నా….

    థాంక్స్ బ్రదర్!.

  18. 19 Dil 3:01 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 27, 2007

    ITC is one of the first generation multinationals. It was incorporated in 1910 under the name of ‘Imperial Tobacco Company of India Limited’. It was owned by British American Tobacco (BAT). (I think they still own a sizeable share of ITC). The company ventured into non-tobacco businesses only in 70s.

  19. 20 rajendra kumar devarapalli 3:26 అపరాహ్నం వద్ద నవంబరు 30, 2008

    దిలీప్ గారు తాజా స్థితిగతుల మీద మీరొక సారి మరో టపా రాయాలని నాకోరిక

  20. 21 Konatham Dileep 3:18 పూర్వాహ్నం వద్ద డిసెంబరు 11, 2008

    ఆలస్యంగా స్పందించినందుకు మన్నించగలరు. తాజా స్థితిగతులపై రాయాలనే ఉంది. త్వరలోనే రాస్తాను.


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,597 సందర్శకులు