నడి రోడ్డుపై రుద్రమదేవి!

మొన్న శుక్రవారం నాడు ఆఫీసునుండి ఇంటికి కాబ్ లో వెళ్తున్నాను. సమయం సాయంత్రం దాదాపు 6:30 అవుతోంది. హిమాయత్ నగర్ లో ఇద్దరు కొలీగ్స్ ను దించి కాస్త ముందుకు వెళ్లానో లేదో ముందు ఒక చిన్నపాటి ట్రాఫిక్ జాం. ఏమిటని గ్లాసు దించి చూస్తే అక్కడో వింత సన్నివేశం.

ఇద్దరు అమ్మాయిలు ఒక వ్యక్తి తో (బహుశా ఆటో డ్రైవర్) గొడవ పడుతున్నారు. దాదాపు 20 యేళ్లుంటాయేమో ఆ అమ్మాయిలకు. ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన అమ్మాయిల్లా ఉన్నారు. పంజాబీ డ్రెస్సులో ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి ఆవేశం పట్టలేక సదరు పురుషుడి గల్లా పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి పారేసింది. చుట్టూ ఉన్న జనం బిత్తరపోయి ఈ వినోదాన్ని చూస్తున్నారు. ప్యాంటు, షర్టూ వేసుకుని ఉన్న ఇంకో అమ్మాయి తన స్నేహితురాలి చెయ్యి పట్టి వారించి వెనక్కి తీసుకువెళ్లింది.

తేరుకోవడానికి నాకో రెండు నిముషాలు పట్టింది

పల్లెటూర్లలో (కొండకచో పట్నాల్లోనూ) తాగి గొడవపడే మొగుళ్ల పై చీపురు తిరగేసే మహిళల గురించి ఎరుగుదును. కానీ నడిరోడ్డు పై ఒక మగవాడిని ఈ లెవెల్లో వాయించిన అపర రాణీ రుద్రమ దేవిని చూడడం మాత్రం ఇదే మొదటి సారి.

సమాజం మారుతోందా? ఒక వేళ ఆ పురుషుడు ఏ ఆటో డ్రైవరో కాక ఒక ఉన్నత ఆర్ధిక స్థాయికి చెందిన మనిషైనా ఈ అతివలు ఇలాగే వాయించేవారా? ఆ ఇద్దరు అమ్మాయిలూ మధ్య తరగతికి చెందిన వాళ్లైతే కూడా ఇలాగే చేసేవారా? ఈ సంఘటన ఇంతటితో ముగిసిపోతుందా లేక అతనేమైనా పగ పెంచుకుంటాడా? Class Dynamics, Gender Dyamics… ఏది ప్లే చేసిందిక్కడ…

ఎన్నెన్నో ప్రశ్నలు…నా మనసులో…

ఒక చిన్న సంఘటన అలోచనల తేనెతుట్టెను కదిపింది…

4 స్పందనలు నుండి “నడి రోడ్డుపై రుద్రమదేవి!” కు


  1. 1 radhika 5:42 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 21, 2007

    ఈమధ్య మధ్య తరగతి అమ్మాయిలు కూడా తెగువ చూపిస్తున్నారు.కోపం వస్తే తమ పట్ల అసభ్యం గ ప్రవర్తించే వారు ఉన్నత కుటుంబం వాడా,పేదవాడా అని అలోచించరు .పక్క వాల్లు ,స్నేహితులు వారించి వివరిస్తే తప్ప.ఇలా ప్రతీ అమ్మాయి తెగువ చూపిస్తే అది శుభపరిణామమే కదా.

  2. 2 Dil 2:45 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 22, 2007

    ఎస్! త్వరలోనే అటువంటి రోజు రావాలని కోరుకుంటున్నా…

  3. 3 సుధాకర్(శోధన) 3:49 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 24, 2007

    ఈ సంఘటన ఒక చేదు నిజం బయట పెడుతుంది. అదేంటంటే పెరుగుతున్న ఆటోవాళ్ళ సెక్సువల్ హరాస్మెంట్. ఆటో దిగుతున్న అమ్మాయల వెనుక తట్టడం, వెకిలిగా చూడటం, మరీ దురదృష్టకర పరిస్థితులలో తీసుకుపోయి అత్యాచారయత్నం…ఇవీ మన భాగ్యనగర ఆటో బాబుల పరిస్థితి. మీరు చూసిన ఈ సంఘటనలో ఇలాంటిది ఏదో తప్పక జరిగే వుంటుంది.

    ఈ మధ్య నగర పోలీసులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసారు..

    ౦౧. ఇద్దరు డ్రయివర్లు వున్న ఆటో చచ్చినా ఎక్కవద్దు
    ౦౨. దూర ప్రాంతాలకు వెళ్ళే అమ్మాయిలు ఆటోలో నిద్ర పోవద్దు
    ౦౩. ఆటో ఎక్కడ ఎక్కువ సేపు ఆపినా కూడా ఒప్పుకోవద్దు

    నాకిప్పటి వరకూ రెండు మూడు సంఘటనలు కొలీగ్స్ ద్వారా తెలిసాయి.

  4. 4 Jaya Prakash 8:07 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 27, 2007

    అసభ్యంగ ప్రవర్తిస్తే ఎవరినైనా పట్టుకొని వాయించొచ్చి… అక్కడ క్లాస్ జెండర్ అస్సలు అడ్డం రావద్దు. ప్రతి అమ్మాయి అంతే ధైర్యంగా ఉండాలని నేను ఆశిస్త. కని అదే ‘క్లాస్’ ఇష్యూ అయితే గనుక చింతించాల్సిన విషయమే.


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,144 సందర్శకులు