మన్మోహన్ సింగ్ ను నియమించింది అమెరికానా?

prattler.jpg

అవుననే అంటున్నారు సుప్రసిద్ధ మార్క్సిస్టు ఆర్ధికవేత్త, ఇందిరా గాంధీకి సలహాదారుగా వ్యవహరించిన అశోక్ మిత్రా. ఇంకా మార్కెట్లోకి రాని ‘A Prattler’s Tale’ అనే పుస్తకం లో మిత్రా ఈ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు. మొన్న దక్కన్ క్రానికల్ పత్రికలో ఎం.జె. అక్బర్ ఈ పుస్తకాన్ని పరిచయం చేశాడు.

1991లో ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి మన దేశం ఆర్ధిక స్థితి బాగోలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఎంతో కాలంగా గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్న (అబ్బా అలోచిస్తే ఎంత చక్కగా సరిపొయిందీ ఉపమానం!) IMF, World Bank రెండూ రంగం లోకి దిగాయి. మీకున్న ఇబ్బందికర పరిస్థితి నుండి తప్పించాలంటే మేము చెప్పినట్టు వినాల్సిందేనని మన నేతల మెడలు వంచాయి. మేము చెప్పినట్టు పాలసీలు మార్చాలని హెచ్చరించాయి. అందుకు గ్యారెంటీగా మేము సూచించిన వ్యక్తినే ఆర్ధిక మంత్రిగా నియమించాలని షరతు పెట్టాయి. తత్ఫలితమే మన్మోహన్ సింగ్ నియామకం.

మొదటినుంచీ మంచి అమెరికా విధేయుడిగా పేరున్న మన్మోహన్ సింగ్ కి అప్పటికే ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులకి పనిచేసిన అనుభవం ఉంది.

ఇదివరకు వికీపీడియాలో ఉన్న సింగుగారి బయోడేటాలో ఈ విషయాలు చాలా డీటైల్డ్ గా ఉండేవి. ఈ మధ్య కనిపించట్లేవెందుకో!

ప్రపంచ బ్యాంకు, ఐ. ఎం. ఎఫ్ లలో పని చేసిన అనుభవమున్న మన్మోహన్ సింగు ను స్వయానా వాషింగ్టన్ పెద్దలే నియమించారన్న ఈ వార్త చాలా ఆందోళన కలిగిస్తోంది.

మనకు వచ్చింది నాం కే వాస్తే స్వాతంత్రమేననీ, ఇంకా మన పాలనా పగ్గాలు ఏడేడు సముద్రాల అవతల వాషింగ్టన్ పెద్దల చేతిలోనే ఉన్నాయనీ మరోసారి రుజువైంది.

4 స్పందనలు నుండి “మన్మోహన్ సింగ్ ను నియమించింది అమెరికానా?” కు


  1. 1 Sudheer Kothuri 10:33 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 7, 2007

    “మనకు వచ్చింది నాం కే వాస్తే స్వాతంత్రమే”-ఏ పాలకులైనా ఇది వర్తిస్తుంది(తల పగులగొట్టుగోడానికి ఏ రాయైతేయెమన్నట్లు). ఉదాహరణకి స్వదేశీ, స్వదేశీ అని, ఒకటి రొండు చోట్ల కోక్ బాటిల్స్ పగులగొట్టి, మరో చోట చంద్రిక లాంటి స్వదేశీ సబ్బులు, ఉత్పత్తులే వాడాలి అని ఉపన్యాసాలిచ్చి, రాముడి పేరడ్డంపెట్టుకొని రాజ్యమేలిన నికార్సైన స్వదేశీ పార్టీ ఘనకార్యాలు “దేశంలో దొంగలు పడ్డారు -1″ అని మీరు రాసిన వ్యాసంలో చూసాము. అసలు విషయం దొరల వొత్తిడి కన్నా, ఆ వొత్తిడిలో ఎంత దండుకోవొచ్చో అనే నికృష్టమైన కోర్కెలే వీరిని మెడలు వంచేటట్లు చేస్తున్నాయి, దేశప్రయోజనం ముఖ్యం అనుకొంటే ఈ వాషింగ్టన్ దొంగల్లాంటి కోన్ కిస్కె గొట్టంగాల్లకి లొంగాల్సిన అవసరంలేదు.

  2. 2 సత్యసాయి 5:46 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 7, 2007

    ఆశ్చర్యపడేదేమీలేదనుకొంటా మన్ దేశంలో పడిన దొంగలని చూస్తోంటే. ౧౯౯౭ కరెన్సీ విపత్తు వచ్చినప్పుడు దక్షిణ కొరియాని కూడా IMF ఇలాగే వంచింది. మొదట్నుంచీ కొరియాకి అమెరికా గ్రాంటులూ, నిధులూ సమకూరుస్తోనే ఉంది. అలాగే చాలా ఆఫ్రికన్, ఆసియన్ దేశాలకూ సహాయం అందించింది. కానీ ఒక్క కొరియా మాత్రమే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశప్రగతిని సాధించింది. అక్కడా లంచగొండి తనం లాంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. కాని దేశభక్తి, దేశాన్ని ముందు నిలబెట్టాలన్న తపన ప్రజల్లో ఎక్కువ ఉండడం వల్ల వాటి ప్రాబల్యం ఎక్కువ కాలేదు.

  3. 3 valluri 5:47 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 7, 2007

    పాలుకులు ఎవరైతే నేం? మన దేశ (జాతి)చరిత్ర సమస్తం, పరపిడన పరాయణత్వం


  1. 1 ముసుగులు బయటపడుతున్నాయ్! « గుండె చప్పుడు… 10:41 పూర్వాహ్నం వద్ద నవంబరు 12, 2007 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,708 సందర్శకులు