ప్లీజ్ ఇంకోసారి హ్యాప్పి పొంగల్ అనకండి!

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

గత పదేళ్లుగా ప్రతీ సంక్రాంతి నాడు క్రమం తప్పకుండా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు బ్లాగ్ వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

మన రాష్ట్రంలో ఎక్కడి నుండి మొదలైందో కాని గత కొన్నేళ్లుగా సంక్రాంతిని పొంగల్ అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది.

మొదట్లో వచ్చిన ఇంగ్లీషు గ్రీటింగు కార్డుల మీద హ్యాప్పి న్యూ ఇయర్ అండ్ పొంగల్ అని వుండేది. బహుశా అక్కడి నుండి మనవాళ్లు పట్టుకున్నారనుకుంటా దీన్ని.

పొంగల్ అనేది తమిళుల పండుగ. సంక్రాంతి నాడే జరుపుకుంటారు దీన్ని.

ప్లీజ్! ఇంకోసారి హ్యాప్పి పొంగల్ అనకండి…

(పొద్దున్నే వచ్చిన ఒక ఈ మెయిల్ చూశాక దీన్ని రాయాలనిపించింది)

5 స్పందనలు నుండి “ప్లీజ్ ఇంకోసారి హ్యాప్పి పొంగల్ అనకండి!” కు


  1. 1 వైజాసత్య 1:27 పూర్వాహ్నం వద్ద జనవరి 15, 2007

    పొంగల్ అనటము ఫ్యాషనైపోయిందనుకుంటా. రామ రామ

  2. 2 రానారె 2:00 పూర్వాహ్నం వద్ద జనవరి 15, 2007

    నేనూ అందరికీ ఈ విషయం చెబుతున్నాను. “సంక్రాంతి శుభాకాంక్షలండీ మీకు” అంటే “సంతోషం, మీక్కూడా” అనే పలకరింపుమాటలు తెలుగు. Happy Pongal అనే మాట వింటే వికారం కలుగుతుంది. ఆమాట అజ్ఞానజనిత సంకరం.మనది కాదది.

  3. 3 T.Bala Subrahmanyam 9:27 పూర్వాహ్నం వద్ద జనవరి 15, 2007

    పొంగల్ అనగానే నాకు సంక్రాంతి గుర్తుకురాదు. తినే పొంగలి గుర్తొస్తుంది.సంక్రాంతిని అమెరికన్‌లు పొంగల్ అంటారేమోనని భ్రమపడే తెలుగువారు చాలామంది ఉన్నారు. అది అఱవభాషాపదమని వారికి తెలీదు. ఏదో కాలంలో మనం నోరూ వాయీ లేకుండా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పడున్న రోజుల్లో అఱవ్వాళ్ళు మనకి అంటించిన పదమది. అందుకే నేనూ ఇస్మాయిల్‌గారిలానే ప్రతి సంక్రాంతికీ నా పరిచస్తులకి చెబుతూనే ఉంటా-మన తెలుగు పండుగని తెలుగు పదంతోనే పిలుద్దామని.

  4. 4 పారుపల్లి 5:12 పూర్వాహ్నం వద్ద జనవరి 16, 2007

    Thank you very much for this posting. Even I scolded lot of my friends who whished me like that.
    ఈ పొంగల్ పిచ్చి ఎవడు అంటిచ్చాడు మన వాళ్లకి.

  5. 5 Dil 5:24 పూర్వాహ్నం వద్ద జనవరి 16, 2007

    నిన్న జెమిని మ్యూజిక్ చానెల్ చూస్తుంటే మతిపోయింది. స్క్రీన్ పైన వస్తున్న ఎసెమ్మెస్ లలో 90% హాప్పీ పొంగల్ అనే వున్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువే ఈ జాడ్యం వుంది…


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,144 సందర్శకులు