మలి ప్రయత్నం!

ఇది నా రెండో బ్లాగ్. స్వంత బ్లాగ్ ఒకటి వుండాలని దాదాపు యేడాది కింద ఆలోచన వచ్చాక మొదటి ప్రయత్నం బ్లాగర్ తో చేశాను. కానీ ఎందుకో అది అంతగా సఫలం కాలేదు. అప్పటికి తెలుగులో రాయరాకపోవడం, బ్లాగర్ లేఔట్ పెద్దగా రుచించకపోవడం…వీటికి తోడు నా బద్దకం…వంటి కారణాల వల్ల నా బ్లాగు ఉదయించక ముందే అస్తమించింది.

కొత్తగా పరిచయం అవుతున్న బ్లాగు మిత్రులు. సులభంగా వున్న లేఖిని పరికరం, ఏదో రాయాలన్న తాపత్రయం… వెరసి ఇలా “గుండె చప్పుడు” రూపంలో బైటికి వస్తోంది.

టైం వున్నప్పుడు ఓ సారి ఇలా తొంగిచూడండి…

5 స్పందనలు నుండి “మలి ప్రయత్నం!” కు


  1. 1 narender reddy 8:45 పూర్వాహ్నం వద్ద జనవరి 2, 2007

    దిలీప్…

    చాలా బాగుంది..
    కొనసాగించు:)

    నీ గుండె చప్పుడు అప్పుడప్పుడు వింటూ ఉంటాను.

    నరెందర్

  2. 2 radhika 4:40 పూర్వాహ్నం వద్ద జనవరి 11, 2007

    మీ వ్యాసాలు కొన్ని ఆసక్తికరంగా,ఆలోచించేవిధం గా వున్నయి.ఇవి అందరికి అందేలా[చదివేలా] మీ బ్లాగుని కూడలి లో పెట్టొచ్చు కదా.

  3. 3 Dil 8:06 పూర్వాహ్నం వద్ద జనవరి 11, 2007

    కొత్తగా బ్లాగడం మొదలుపెట్టాను కదా…తప్పటడుగుల దశ దాటాక అప్పుడు కూడలి కి వద్దామని ఆగాను. సందర్శించినందుకు కృతజ్ఞతలు

  4. 4 sai 10:30 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 15, 2007

    me gunde chappudu bagundi…chala vishayalu telustunnayi…specially telangana gurinchi ipudu ipude telusukuntunnanu….

  5. 5 Dil 7:35 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 16, 2007

    సాయి గారూ థాంక్యూ! గుండె చప్పుడు మొదలుపెట్టడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి ఇప్పుడు మన దేశంలోను, రాష్ట్రం లోను “అభివృద్ధి” పేరిట జరుగుతున్న విధ్వంసం వివరించడం. రెండోది తెలంగాణ గురించి ఒక అర్ధవంతమైన చర్చను రేకెత్తించడం. తెలంగాణ అంటే కేసీయారు, నరేంద్ర మాత్రమే కాదు, అదొక ప్రాంత ప్రజల యాభై అయిదేళ్ల స్వప్నం అని నెజ్జనులకు చెప్పాలనే చిన్న ప్రయత్నం ఈ గుండె చప్పుడు!


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,597 సందర్శకులు